
సాక్షి, హైదరాబాద్: నగరంలోని జేఎన్‌టీయూ విశ్వవిద్యాలయంలో విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడం కలకలం సృష్టించింది. కంప్యూటర్ సైన్స్ విభాగంలో ఫోర్త్ ఇయర్ చదువుతున్న మేఘనా రెడ్డి బిల్డింగ్‌పై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది.
వివరాల ప్రకారం.. జేఎన్‌టీయూలో కంప్యూటర్ సైన్స్ విభాగంలో ఫోర్త్ ఇయర్ చదువుతున్న మేఘన బుధవారం.. సీఎస్‌ఆర్ బిల్డింగ్‌పై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. కాగా, సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. అయితే, మేఘనా రెడ్డి.. అనారోగ్య సమస్యల కారణంగానే ఆత్మహత్యకు పాల్పడినట్టు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. గతంలో కూడా మేఘనా రెడ్డి.. మానసికంగా ఇబ్బందులకు కావడంతో అందుకు తగిన ట్రీట్‌మెంట్ కూడా తీసుకున్నట్టు సమాచారం.
మనిషికి ఉండేది ఒక్కటే జీవితం. ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి.
ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001
మెయిల్: roshnihelp@gmail.com
Comments
Please login to add a commentAdd a comment