
ర్యాగింగ్ కలకలం.. కత్తితో కాలేజీకి వెళ్లాడు
అనంతపురం: అనంతపురం జిల్లా కదిరిలో ర్యాగింగ్ కలకలం రేపింది. ఓ విద్యార్థి ప్రతీకారం తీర్చుకునేందుకు ఏకంగా కత్తి తీసుకుని కాలేజీకి వెళ్లాడు. కదిరిలోని స్పేస్ జూనియర్ కాలేజీలో సీనియర్, జూనియర్ విద్యార్థుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ర్యాగింగ్కు పాల్పడంతో సీనియర్లు, జూనియర్ల మధ్య తీవ్ర వివాదం ఏర్పడింది. దీంతో కక్ష తీర్చుకునేందుకు ఓ విద్యార్థి కత్తితో కాలేజీకి వెళ్లాడు. ఈ విషయం కాలేజీ యాజమాన్యం దృష్టికి రావడంతో స్పందించింది. 10 మంది విద్యార్థులను సస్పెండ్ చేసింది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.