Raging student
-
కర్నూలు మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ భూతం ..
-
Ragging in Suryapet: ఆరుగురు విద్యార్థులపై సస్పెన్షన్ వేటు
సాక్షి, నల్గొండ: సూర్యాపేట మెడికల్ కాలేజీ ర్యాగింగ్ ఘటన నిజమేనని తేలింది. ర్యాగింగ్‌పై ఏర్పాటు చేసిన కమిటీ హాస్టల్లో ర్యాగింగ్ జరిగినట్లు నివేదికలో తేల్చింది. ఏడాదిపాటు ఆరుగురు విద్యార్థులపై సస్పెన్షన్ వేటు వేస్తున్నట్లు డీఎంఈ తెలిపారు. విద్యార్థులు తక్షణం హాస్టల్ ఖాళీ చేయాలంటూ డీఎంఈ ఆదేశించారు. కాగా, ర్యాగింగ్ ఘటన సంచలనంగా మారడంతో ప్రభుత్వం సీరియస్ అయ్యింది. కాగా, సూర్యాపేట మెడికల్ కళాశాలకు సంబంధించిన హాస్టల్లో ఓ జూనియర్ విద్యార్థిని రెండో సంవత్సరం విద్యార్థులు నాలుగు గంటలు గదిలో బంధించి హింసించారు. మోకాళ్లపై కూర్చోబెట్టి సెల్యూట్ చేయించుకోవడమే కాకుండా పిడిగుద్దులు గుద్దారు. కన్నీరుపెట్టి వేడుకున్నా వదలకుండా ట్రిమ్మర్‌తో గుండు గీసేందుకు ప్రయత్నించారు. టాయిలెట్ వస్తుందని అక్కడి నుంచి బయటపడ్డ ఆ విద్యార్థి ఫోన్ చేసి విషయం తల్లి దండ్రులకు చెప్పాడు. దీంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. చదవండి: (కులమేంటని అడిగి.. సార్ అని పిలవాలని హుకుం, గదిలో బంధించి దారుణం) -
Suryapet: ర్యాగింగ్ ఘటనపై విచారణ
సూర్యాపేట క్రైం: సూర్యాపేట మెడికల్ కళాశాల బాలుర హాస్టల్లో జరిగిన ర్యాగింగ్ ఘటనపై వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు స్పందించారు. ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపి నివేదిక అందజేయాలని డీఎంఈ రమేశ్‌రెడ్డిని ఆదేశించారు. ఈ మేరకు సోమవారం సూర్యాపేట ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ దండ మురళీధర్‌రెడ్డి, మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సీవీ శారద, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ బాబురావుతో పాటు పలువురు అసోసియేట్ ప్రొఫెసర్లతో కూడిన కమిటీ, విద్యార్థుల నుంచి ఈ ఘటనకు సంబంధించిన సమాచారం సేకరించింది. అనంతరం ఈ కమిటీ విచారణ నివేదికను సూర్యాపేట జిల్లా కలెక్టర్ టి.వినయ్‌కృష్ణారెడ్డికి సమర్పించింది. (చదవండి: కులమేంటని అడిగి.. సార్ అని పిలవాలని హుకుం, గదిలో బంధించి దారుణం) బాధ్యులందరిపై కేసు నమోదు చేస్తాం.. బాధిత విద్యార్థి సాయికుమార్ ఫిర్యాదు మేరకు జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్ కూడా విచారణ జరిపారు. హాస్టల్‌ను సందర్శించి పలువురు మెడికోలను విచారించారు. కాగా, ర్యాగింగ్ ఘటనపై పూర్తి స్థాయిలో విచారిస్తున్నామని, ప్రస్తుతం ఐదుగురిపై కేసు నమోదు చేసి వారిని అదుపులోకి తీసుకున్నామని ఎస్పీ చెప్పారు. ఇంకా మరికొంతమందిని గుర్తించే పనిలో ఉన్నామని, బాధ్యులైన ప్రతి ఒక్కరిపై కేసు నమోదు చేస్తామని తెలిపారు. గతంలో కూడా కళాశాల వసతి గృహంలో ర్యాగింగ్ జరిగినట్లు తెలిసిందని, విద్యా సంస్థలు, వసతిగృహాల వద్ద ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. ఇప్పటికే ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థల్లో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించామని, త్వరలో మెడికల్ కళాశాల వసతి గృహాల్లో కూడా ర్యాగింగ్‌ను నిరోధించేందుకు విద్యార్థులకు అవగాహన కల్పిస్తామని వివరించారు. ఎస్పీ వెంట డీఎస్పీ మోహన్‌కుమార్, సీఐ ఆంజనేయులు, ఎస్ఐ శ్రీనివాస్ ఉన్నారు. ఇదిలా ఉండగా మెడికల్ కళాశాల హాస్టల్లో జూనియర్ విద్యార్థిపై ర్యాగింగ్‌కు పాల్పడిన సీనియర్లను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ పలు విద్యార్థి సంఘాల నాయకులు మెడికల్ కళాశాల ఎదుట ధర్నా చేశారు. ర్యాగింగ్ జరగకుండా అధికారులు చర్యలు చేపట్టాలని కోరారు. -
నేటి విద్యా వ్యవస్థను ఆవిష్కరించే తలైకీళ్
ఉన్నత విద్యనభ్యసించి కుటుంబానికి, దేశానికి బాధ్యత గల పౌరులుగా సేవలందించాలని ఆశిస్తూ గ్రామాల నుంచి విద్యార్థులు నగరానికి వస్తుంటారు. తల్లిదండ్రులు అప్పులు చేసి, ఆస్తులు అమ్మి పిల్లలను చదివిస్తుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో డబ్బు దండు కోవడమే లక్ష్యంగా పనిచేసే కొన్ని కళాశాలలు, సీనియర్ల పేరుతో విద్యార్థుల ర్యాగింగ్, అవమానాలు తదితరాలను మార్చాలని ప్రయత్నించే ఓ యువ విద్యార్థి కథే తలై కీళ్ చిత్రమని దర్శకుడు రెక్స్రాజ్ తెలిపారు. లండన్‌కు చెందిన ఈయన కథ, కథనం, మాటలు, పాటలు రాసి తొలిసారిగా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని మాతా క్రియేషన్ పతాకంపై ధరణియన్ నిర్మిస్తున్నారు.నవ నటుడు రాకేష్ హీరోగా నటిస్తున్నారు. ఇందులో తేజామై, నివేదా హీరోయిన్లుగా నటిస్తున్నారు. యువతను దృష్టిలో పెట్టుకుని జనరంజకంగా తెరకెక్కించిన తలైకీళ్ చిత్రాన్ని లియో ఇంటర్నేషనల్ పతాకంపై జేవీ రుక్మాంగదన్ విడుదల చేయనున్నారని దర్శకుడు తెలిపారు.