సాక్షి, వరంగల్: హాస్టల్ నుంచి పారిపోయి వచ్చిన బాలుడిని వరంగల్ సీటీఐ అతని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ సంఘటన వరంగల్ రైల్వే స్టేషన్‌లో చోటుచేసుకుంది. నెక్కొండ మండలం ముదిగొండ గ్రామానికి చెందిన మేడబోయిన సాయి(13) రెడ్యాలలోని హాస్టల్‌లో ఉంటూ ఏడో తరగతి చదువుతున్నాడు. సోమవారం తన స్నేహితుడైన దీక్షకుంట్ల గ్రామానికి చెందిన అజయ్‌తో కలిసి హాస్టల్ నుంచి పారిపోయి వచ్చి వరంగల్ స్టేషన్‌లో స్వర్ణజయంతి ఎక్స్‌ప్రెస్ ఎస్-4 బోగీలో ఎక్కాడు. అజయ్ మాత్రం వరంగల్ స్టేషన్‌లోనే ఉండిపోయాడు. రైలు బల్లార్షా చేరుకుంటుండగా రైలులోని టీటీఈలు బి.మాధవరావు, ఎస్.శ్రీనివాస్‌లు అతడిని చేరదీశారు. అక్కడినుంచి వారు ఆ బాలుడిని మంగళవారం మరో రైలులో వరంగల్ స్టేషన్‌కు తీసుకొచ్చి అతని కుటుంబీకులకు అప్పగించినట్లు సీటీఐ శ్రీనివాస్‌రావు వివరించారు. ఈ సందర్బంగా ఆయన టీటీఐలు మాధవరావు, శ్రీనివాస్‌లను అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment