![Illegal Storage Of Hostel Rice - Sakshi](/styles/webp/s3/article_images/2018/06/14/Illegal-Storage-Of--Hostel-.jpg.webp?itok=tor1rMHZ)
ఇంట్లో దాచిన హాస్టల్ సన్నబియ్యం, బియ్యంపై బస్తాలపై టీఎస్‌సీఎస్‌సీఎల్ అని ఉన్న దృశ్యం
మంచిర్యాలక్రైం: రాష్ట్ర ప్రభుత్వం పేద విద్యార్థులకు అందిస్తున్న సన్నబియ్యం మాయమైన సం ఘటన బుధవారం మంచిర్యాలలో వెలుగుచూసింది. పట్టణలోని ఓ హాస్టల్ నుంచి ఉదయం బియ్యం అక్రమంగా తరలించి సీసీ నస్పూర్ సమీ పంలోని పెట్రోల్‌బంక్ ఎదురుగా ఉన్న ఓ ఇంట్లో నిలువ ఉంచారు.
విషయం తెలుసుకున్న ఓ యువకుడు వీడియో తీసి ‘సాక్షి’కి చేరవేశాడు. ఇది తెలుసుకున్న ‘సాక్షి’ విలేకరి 15 నుంచి 20 నిమిషాల్లో ఘటనా స్థలానికి చేరుకునేలోపే అక్కడినుంచి బియాన్ని మాయం చేశారు. బియ్యం గురించి ఇంటివారిని ప్రశ్నించగా తమకేమీ తెలి యదంటూ బెదిరింపులకు దిగారు.
ఈ విషయమై పట్టణంలోని ప్రభుత్వ వసతిగృహాల నిర్వాహకులను వివరణ కోరగా తమకేమీ తెలియదని సమాధానం చెప్పడం గమనార్హం. బియ్యం బస్తాలపై తెలంగాణ స్టేట్ సివిల్ సప్లై కార్పొరేషన్ లిమిటెడ్ (టీఎస్‌సీఎస్‌సీఎల్) సన్నబియ్యం హాస్టల్ అని ఉంది.
బియ్యాన్ని వసతిగృహాలకు తరలిస్తున్న క్రమంలోనే మార్గమధ్యంలో మాయం అవుతున్నాయి. సంబంధిత అధికారులు, వసతిగృహాల నిర్వాహకుల అండతోనే ఈ దందా జోరుగా సాగుతోందని తెలుస్తోంది. బియ్యం ఎక్కడివి, ఎవరు తరలించారు, అసలు దొంగలు ఎవరు అనేది అధికారులు విచారిస్తే తేలనుంది.
Comments
Please login to add a commentAdd a comment