rice business
-
బియ్యం వ్యాపారంలోకి హిజ్రాలు
సాక్షి, తిరువొత్తియూరు: చెన్నైలో తొలిసారి 40 మంది హిజ్రాలు బియ్యపు వ్యాపారంలోకి ప్రవేశించారు. చెన్నైలో హిజ్రాలు స్వయం ఉపాధి కల్పనతో పలు వృత్తుల్ని స్వీకరిస్తున్నారు. వారికి పలు స్వ చ్ఛంద సంస్థలు సహకారం ఇస్తున్నాయి. ఈ నేప థ్యంలో రాయపేటలో తొలిసారి టీ దుకాణం, చాకలిపేటలో టిఫిన్ దుకాణాలు ఏర్పాటు చేశా రు. అంతేకాకుండా ఓ సంఘంగా ఏర్పడి 40 మంది హిజ్రాలు చెన్నై మైలాపూరులో బియ్యం వ్యాపారానికి శ్రీకారం చుట్టారు. వారికి 400 బస్తాల బియ్యాన్ని స్వచ్ఛంద సంస్థలు అందజేశా యి. హిజ్రా నర్తకి నటరాజ్, డాక్టర్ మాలతి, జయ, సబిత తదితరులు పాల్గొన్నారు. చదవండి: (ప్రాణం తీసిన చికెన్ గ్రేవీ, శీతల పానీయం?) -
హాస్టల్ బియ్యం పక్కదారి!
మంచిర్యాలక్రైం: రాష్ట్ర ప్రభుత్వం పేద విద్యార్థులకు అందిస్తున్న సన్నబియ్యం మాయమైన సం ఘటన బుధవారం మంచిర్యాలలో వెలుగుచూసింది. పట్టణలోని ఓ హాస్టల్ నుంచి ఉదయం బియ్యం అక్రమంగా తరలించి సీసీ నస్పూర్ సమీ పంలోని పెట్రోల్‌బంక్ ఎదురుగా ఉన్న ఓ ఇంట్లో నిలువ ఉంచారు. విషయం తెలుసుకున్న ఓ యువకుడు వీడియో తీసి ‘సాక్షి’కి చేరవేశాడు. ఇది తెలుసుకున్న ‘సాక్షి’ విలేకరి 15 నుంచి 20 నిమిషాల్లో ఘటనా స్థలానికి చేరుకునేలోపే అక్కడినుంచి బియాన్ని మాయం చేశారు. బియ్యం గురించి ఇంటివారిని ప్రశ్నించగా తమకేమీ తెలి యదంటూ బెదిరింపులకు దిగారు. ఈ విషయమై పట్టణంలోని ప్రభుత్వ వసతిగృహాల నిర్వాహకులను వివరణ కోరగా తమకేమీ తెలియదని సమాధానం చెప్పడం గమనార్హం. బియ్యం బస్తాలపై తెలంగాణ స్టేట్ సివిల్ సప్లై కార్పొరేషన్ లిమిటెడ్ (టీఎస్సీఎస్సీఎల్) సన్నబియ్యం హాస్టల్ అని ఉంది. బియ్యాన్ని వసతిగృహాలకు తరలిస్తున్న క్రమంలోనే మార్గమధ్యంలో మాయం అవుతున్నాయి. సంబంధిత అధికారులు, వసతిగృహాల నిర్వాహకుల అండతోనే ఈ దందా జోరుగా సాగుతోందని తెలుస్తోంది. బియ్యం ఎక్కడివి, ఎవరు తరలించారు, అసలు దొంగలు ఎవరు అనేది అధికారులు విచారిస్తే తేలనుంది. -
ఫైన్ బియ్యం దందా
మిర్యాలగూడ : బియ్యం వ్యాపారంలో ఆరితేరిన రైస్‌మిల్లర్లు సూపర్ ఫైన్ బియ్యం విక్రయాల్లో అడ్డదారులు తొక్కుతున్నారు. సూపర్ ఫైన్ బియ్యంలో కర్నూల్ రైస్‌కు తెలుగు రాష్ట్రాల్లో మంచి గిరాకీ ఉంది. దానిని ఆసరాగా చేసుకుంటున్న మిర్యాలగూడ రైస్‌మిల్లర్లు కొంత మంది ‘నం.1 కర్నూల్ రైస్’ పేరుతో దందా సాగిస్తున్నారు. ఏ రైస్ మిల్లులోతయారవుతున్నాయో వారి ఇండస్ట్రీ పేరుతోనే బియ్యం వ్యాపారం సాగించాల్సి ఉంది. కానీ స్థానికంగా బియ్యం విక్రయించుకోవడానికి సొంత ఇండస్ట్రీ పేరును ఉపయోగిస్తూనే, హైదరాబాద్‌తోపాటు ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేసే సమయంలో కర్నూల్ రైస్ పేరుతో దందా సాగిస్తున్నారు. లోకల్ బ్రాండ్ ఉన్న ఫైన్ బియ్యాన్ని 25 కిలోల బస్తాను 1,100 రూపాయలకు విక్రయిస్తుండగా కర్నూల్ రైస్ బ్రాండ్‌తో ఉన్న 25 కిలోల ఫైన్ బియ్యాన్ని 1150 రూపాయలకు వి క్రయిస్తున్నారు. స్థానికంగా తయారైన వాటినే కర్నూల్ రైస్‌పేరుతో సూపర్ ఫైన్ బియ్యంగా విక్రయించి క్వింటాకు అదనంగా రెండు వందల రూపాయలు కూడా వినియోగదారుడి వద్ద దోచుకుంటున్నారు. సూపర్ ఫైన్ బియ్యంలో మిక్సింగ్ ఇలా.. లోకల్ బ్రాండ్ పేరుతో సూపర్ ఫైన్ బియ్యం విక్రయిస్తున్నారు. అయితే అందులో బీహార్ ధాన్యంతో తయారు చేసిన బియ్యాన్ని మిక్సింగ్ చేస్తున్నారు. వాస్తవానికి సూపర్‌ఫైన్ బియ్యం తయారు చేయాలంటే బీపీటీ ధాన్యంతో పాటు రబీలో దిగుబడి వస్తున్న హెచ్ఎంటీలతో పాటు మరికొన్ని రకాలను వినియోగించాల్సి ఉంది. కానీ బీహార్‌తో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల నుంచి దిగుమతి చేసుకుంటున్న సాధారణ రకం ధాన్యాన్ని బియ్యంగా మార్చి సూపర్‌ఫైన్‌లో మిక్సింగ్ చేస్తున్నారు. క్వింటాకు 4400 రూపాయలు వెచ్చించి కొనుగోలు చేస్తున్న వినియోగదారులు మిక్సింగ్ బియ్యం తినాల్సి వస్తోంది. బియ్యం వ్యాపారుల సిండికేట్ మిర్యాలగూడలో బియ్యం వ్యాపారులు సిండికేట్‌గా మారారు. మిర్యాలగూడలోనే సుమారుగా వంద రైస్ మిల్లులు ఉప్పటికీ కేవలం 10 నుంచి 15 మంది రైస్ మిల్లర్లు మాత్రమే స్థానికంగా బియ్యం విక్రయాలు చేస్తుంటారు. మిగతా వారు ఎక్కువగా హైదరాబాద్‌తో ఇతర ప్రాంతాలకు ఎగుమతులు చేస్తుంటారు. స్థానికంగా బియ్యం విక్రయించే మిల్లర్లు సిండికేట్‌గా మారి ధరలను విపరీతంగా పెంచుతున్నారు. ఫైన్, సూపర్ ఫైన్ బియ్యం పేరుతో రకరకాల పేర్లతో దందా సాగిస్తున్నారు. హైదరాబాద్‌లో సూపర్‌ఫైన్ బియ్యానికి ఉన్న ధరలనే మిర్యాలగూడలో విక్రయిస్తున్నారు. తూకంలోనూ మోసం 25 కిలోల సూపర్‌ఫైన్ బియ్యం బస్తాలో కేవలం 24 కిలోల తూకం మాత్రమే ఉంటుంది. కానీ 25 కిలోల బస్తాకు నిర్ణయించిన ధరనే తీసుకుంటారు. ఈ బస్తాను 1150 రూపాయలకు విక్రయిస్తే, దానిలో ఒక కిలో బియ్యం తక్కువగా ఉన్నట్లయితే వినియోగదారుడు కిలోకు 46 రూపాయలు అదనంగా చెల్లించాల్సి వస్తుంది. అంటే క్వింటా బియ్యానికి నాలుగు కిలోలకు 184 రూపాయలను అదనంగా ఇవ్వాలి. ఈ విధంగా వినియోగదారులను తూకంలో కూడా మోసం చేస్తున్నారు. బియ్యం ఓపెన్ మార్కెట్లో విక్రయించుకోవచ్చు బియ్యం ఓపెన్ మార్కెట్లో విక్రయించుకోవచ్చు. క్వాలిటీ, క్వాంటిటీ విషయంలో వినియోగదారులు సరిచూసుకోవాలి. కర్నూల్ బ్రాండ్ పేరు బియ్యం విక్రయాలు ఎక్కువగా సాగుతున్నాయి. ఏ బ్రాండ్‌తో బియ్యం విక్రయాలు చేసినా రైస్‌మిల్లు అడ్రస్ ఉండాలి. తూకంలో తక్కువగా ఉంటున్న విషయంపై తూనికల కొలతల అధికారులు ఇటీవల రెండు, మూడు కేసులు కూడా నమోదు చేశారు. అదే విధంగా సూపర్‌ఫైన్ బియ్యం మిక్సింగ్ విషయంలో వినియోగదారులు నాణ్యత చూసుకొని కొనుగోలు చేయాలి. బియ్యం రవాణా, తయారీపై ఎలాంటి ఆంక్షలు లేకపోవడంతో మేము తనిఖీలు చేయాలనే నిబంధనలు కూడా లేవు. – డీఎస్ఓ ఉదయ్‌కుమార్ -
జోరుగా జీరో దందా
మార్కెట్‌కు రాకుండానే ఇతర జిల్లాలకు తరలింపు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న వ్యాపారులు పట్టించుకోని అధికారులు కుల్కచర్ల: మండలంలో జీరో దందా జో రుగా సాగుతోంది. మార్కెట్‌కు రాకుం డా లక్షల రూపాయల విలువైన ధాన్యం గుట్టుచప్పుడు కాకుండా మహబూబ్‌నగర్ జిల్లాకు తరలుతోంది. కుల్కచర్ల మార్కెట్‌కు కమిటీ లేకపోవడం.. పరిగి మార్కెట్‌కు అనుసంధానంగా ఉండడంతో పట్టించుకొనేవారు లేకుండా పోయారు. దీంతో జీరో దందా మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది. మండల కేంద్రానికి 24 కి.మీ దూరంలో ఉన్న మరికల్లో ఎలాంటి అనుమతి లేకుండా మినీ మార్కెట్ కొనసాగుతోంది. అక్కడ ఉన్న దళారులు, వ్యాపారులు రైతులు పండించిన పంటను కుల్కచర్ల మార్కెట్‌కు రాకుండా అక్కడే అక్కడే కొని మహబూబ్‌నగర్ జిల్లాకు తరలిస్తున్నారు. మండల కేంద్రంలో ప్రతి బుధవారం మార్కెట్ కొనసాగుతుంది. ఈ మార్కెట్‌కు కుల్కచర్ల, గండేడ్ మండలాల నుంచి రైతులు ధ్యానం తీసుకువస్తారు. మండలంలోని మరికల్, ముజాహిద్పూర్, బండవెల్కిచర్ల, పుట్టపహాడ్, చౌడపూర్ గ్రామాల్లో కొందరు వ్యాపారులు అక్కడే మార్కెట్లు ఏర్పాటు చేశారు. రైతులకు మాయమాటలు చెప్పి ధాన్యాన్ని మార్కెట్‌కు రాకుండా చేస్తున్నారు. మార్కెట్‌కు వెళ్తే రవాణా, హమాలీ, దడువాయి ఖర్చులు అవుతాయని చెబుతూ అక్కడే తక్కువ ధరకు కొనుగోలు చేసి రైతులను నట్టేట ముంచుతున్నారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని కుల్కచర్ల మార్కెట్‌కు తరలించకుండా మార్కెట్ ఫీజు లేకుండా, వే బిల్లులు లేకుండా ఇతర జిల్లాకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. రోజుకు 20 నుంచి 25 లారీల వరకు మొక్కజొన్న, వరి ధాన్యాన్ని తరలిస్తున్నారు. దీంతో ప్రతి వారం మార్కెట్‌కు వేలల్లో నష్టం జరుగుతోంది. తూకాల్లో మోసాలు ధాన్యం తక్కువ ధరకే తీసుకోవడం కాకుండా తూకాల్లో కూడా పెద్ద మొత్తంలో మోసాలకు పాల్పడుతున్నట్లు రైతులు ఆరోపిస్తున్నారు. క్వింటాలుకు 5 కిలోలు తక్కువ అవుతున్నాయని, ఎవరికి చెప్పుకోవాలో తెలియడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏమైనా అందామంటే అవసరం ఉన్నప్పుడు డబ్బులు ఇవ్వరని ఏమి అనలేక పోతున్నామని వాపోతున్నారు. ఇప్పటికైనా మార్కెట్ కమిటీ అధికారులు, విజిలెన్స్ అధికారులు స్పందించాలని కోరుతున్నారు.