సిరిసిల్ల/కోరుట్ల:నిరుద్యోగులకు ఉపాధి శిక్షణతోపాటు, నైపుణ్య శిక్షణ ఇస్తూ వేలాదిమందికి ఉపాధి బాట చూపుతోంది న్యాక్ కేంద్రాలు. రాష్ట్రవ్యాప్తంగా 38 న్యాక్ కేంద్రాలు ఉన్నాయి. వివిధ వృత్తివిద్యా కోర్సుల్లో పేద యువతకు శిక్షణ ఇస్తూ భవిష్యత్‌పై బరోసా కల్పిస్తున్నాయి.
న్యాక్ ఆఫర్ చేస్తున్న కోర్సులు..
వెల్డింగ్, ప్లంబింగ్, పేయింటింగ్ అండ్ డెకరేషన్ కోర్సులకు ఏడో తరగతి చదివిన అభ్యర్థులు అర్హులు. ఎలక్ట్రికల్ హౌస్ వైరింగ్, స్టిచింగ్ అండ్ కర్టెన్ మేకింగ్ కోసం పదో తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ల్యాండ్ సర్వేయర్, జనరల్ వర్క్స్ సూపర్‌వైజర్ కోసం ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణత పొంది ఉండాలి. మూడు నెలలపాటు శిక్షణ అందిస్తారు. ఉచిత వసతి గృహం, భోజన వసతి కల్పిస్తారు.
వీరు అర్హులు..
ఈ కోర్సులకు 18– 35 వయసు గల అభ్యర్థులు రేషన్ కార్డు, ఆధార్‌కార్డు, క్వాలిఫైంగ్ సర్టిఫికెట్, కుల «ధ్రువీకరణ పత్రం, బ్యాంక్ పాస్‌పుస్తకం దరఖాస్తుతో జతచేసి న్యాక్‌కేంద్రంలో సమర్పించాలి.
నైపుణ్య శిక్షణ..
శిక్షణ పొందే అభ్యర్థులు కార్మికశాఖలో పేరు నమోదు చేసుకోవాలి. లేబర్ కార్డు ఉండాలి. తాపీమేస్త్రీ, ప్లంబింగ్, వెల్డింగ్ కోర్సులకు నైపుణ్య శిక్షణ కోసం 15 రోజులపాటు ఉచిత శిక్షణ ఇవ్వడంతోపాటు భోజన వసతి కల్పిస్తారు. నిత్యం రూ. 300 చొప్పున స్టైఫండ్ చెల్లిస్తారు.
నూరుశాతం ప్లేస్‌మెంట్.. ఉచిత భోజన వసతి హాస్టల్ సదుపాయంతోపాటు, భోజనం, యూనిఫాం, కోర్సు మెటీరియల్స్ అందజేస్తారు. శిక్షణ అనంతరం సర్టిఫికెట్ ఇస్తారు. నూరుశాతం ప్లేస్‌మెంట్ కల్పిస్తారు. ఉద్యోగంలో చేరిన మూడు నెలల అనంతరం ప్రభుత్వం వారిబ్యాంకు ఖాతాలో రూ. 3,000 జమ చేస్తుంది.
ఉన్నత చదువులు చదివినా ఉద్యోగం రావడంలేదనుకునేవారు కొందరు.. చదువు లేక కూలీనాలి చేసేవారు మరికొందరు.. చదువు.. ఆలోచనా శక్తి.. ప్రభుత్వ పథకాలను అందిపుచ్చుకునే నేర్పు ఉన్నవారు మరికొందరు. ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాల కోసం ఎదురు చూడకుండా తమ కాళ్లపై తాము నిలబడి మరో పదిమందికి ఉపాధి కల్పిస్తున్నారు ఎంతోమంది. స్వయం ఉపాధిపై ఆసక్తి ఉన్నవారిని ప్రోత్సహించేందుకు ప్రభుత్వాలు అనేక అవకాశాలు కల్పిస్తున్నాయి. వీటిని సద్వినియోగం చేసుకునేందుకు నిబంధనలనూ సరళీకృతం చేస్తున్నాయి. ఆర్థికంగా అండగా నిలిచేందుకు రుణసాయం అందిస్తున్నాయి. రాయితీ.. సబ్సిడీ.. వడ్డీ మాఫీతో స్వయం ఉపాధిని ప్రోత్సహిస్తున్నాయి. మరికొన్ని సంస్థలు యువత వృత్తినైపుణ్యం పెంచుకునే అవకాశం కల్పిస్తున్నాయి. సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్‌వైపు నడిపిస్తున్నాయి. స్వయం ఉపాధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పథకాలు.. నైపుణ్య శిక్షణ పెంపొందిస్తున్న సంస్థలు.. కోర్సులు.. దరఖాస్తు విధానం.. రుణాలు పొందే అవకాశం.. తదితర వివరాలతో ఈవారం వీకెండ్.
Comments
Please login to add a commentAdd a comment