నాణ్యత లోపించిన భోజనం పెడుతున్నారని హాస్టల్ విద్యార్థులు అందోళనకు దిగిన సంఘటన హైదరాబాద్లోని వనస్థలిపురంలో బుధవారం జరిగింది.
వనస్థలిపురం : నాణ్యత లోపించిన భోజనం పెడుతున్నారని హాస్టల్ విద్యార్థులు అందోళనకు దిగిన సంఘటన హైదరాబాద్లోని వనస్థలిపురంలో బుధవారం జరిగింది. తమకు నాణ్యమైన భోజనం అందించాల్సి ఉండగా వార్డెన్ అవినీతికి పాల్పడుతూ పురుగుల అన్నం, పాడైన కూరగాయలతో వండిన వంట పెడుతున్నారని బీసీ హాస్టల్ విద్యార్థులు ఆందోళన దిగారు. వార్డెన్ సస్పెండ్ చేయాలని రోడ్డుపై ధర్నా చేశారు. విద్యార్థుల ధర్నాతో రోడ్డుపై ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది.