ఎస్సీ బాలుర వసతి గృహం మూసివేత | SC boys' hostel closed | Sakshi
Sakshi News home page

ఎస్సీ బాలుర వసతి గృహం మూసివేత

Published Thu, Aug 11 2016 10:49 PM | Last Updated on Sat, Sep 15 2018 3:01 PM

మూతపడిన న్యామద్దెలలోని ఎస్సీ బాలుర వసతి గృహం - Sakshi

మూతపడిన న్యామద్దెలలోని ఎస్సీ బాలుర వసతి గృహం

విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉందన్న నెపంతో చెన్నేకొత్తపల్లి మండలంలోని న్యామద్దెల గ్రామ ఎస్సీ బాలుర వసతి గృహానికి అధికారులు తాళం వేశారు.

చెన్నేకొత్తపల్లి :
విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉందన్న నెపంతో చెన్నేకొత్తపల్లి మండలంలోని న్యామద్దెల గ్రామ ఎస్సీ బాలుర వసతి గృహానికి అధికారులు తాళం వేశారు. దాదాపు 30 సంవత్సరాల క్రితం ఈ గ్రామంలో ఏర్పాటు చేసిన ఈ హాస్టల్‌కు రూ. లక్షల ప్రజాధనాన్ని వెచ్చించి సొంత భవనాన్ని ఏర్పాటు చేశారు.
 
విద్యార్థుల సౌకర్యాం కోసం విశాలమైన గదులు, డైనింగ్‌ హాల్‌ ఉన్నాయి. ఇక్కడ ఉంటూ చదువుకున్న వారు పలు శాఖల్లో ఉన్నత ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. ఎంతో ఘన చరిత్ర గలిగిన ఈ హాస్టల్‌ మూతపడడంతో విద్యార్థులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. వెంటనే హాస్టల్‌ను పునరుద్ధరించాలంటూ న్యామద్దెల వాసులు కోరుతున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement