
కాలేజీలో 100మంది విద్యార్థులకు అస్వస్థత
కలుషిత ఆహారం తిని 100 మంది కాలేజీ విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. ఉత్తరప్రదేశ్లోని ఓ ఇంజినీరింగ్ కాలేజీలో ఈ ఘటన చోటుచేసుకుంది.
కాన్పూర్: కలుషిత ఆహారం తిని 100 మంది కాలేజీ విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. ఉత్తరప్రదేశ్లోని ఓ ఇంజినీరింగ్ కాలేజీలో ఈ ఘటన చోటుచేసుకుంది. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై ఇప్పటికే విచారణకు ఆదేశించారు. వివరాల్లోకి వెళితే కాన్పూర్ జిల్లాలోని అక్బర్పూర్లో ప్రభాత్ ఇంజినీరింగ్ కాలేజీ ఉంది. ఇందులో వసతి గృహం అవకాశం కూడా ఉంది. ఇందులో 365మంది అబ్బాయిలు, 30మంది అమ్మాయిలు ఉంటున్నారు.
వీరంతా బుధవారం మధ్యహ్నాం భోజనం చేశాక అస్వస్థతకు లోనయ్యారు. వరుసగా ఓ వందమందికి వాంతులు, నీళ్ల విరేచనాలు, కళ్లుతిరగడం, అజీర్తివంటి సమస్యలు తలెత్తడంతో వారిని ఆస్పత్రికి తరలించారు. ఫుడ్ పాయిజినింగ్ అయినట్లు అధికారులు తెలిపారు. కాగా, ఫుడ్ పాయిజినింగ్కు గల కారణాలు శోధిస్తున్నామని, ఇప్పటి వరకు తమ కాలేజీ ప్రాంగణంలో అలాంటి ఘటన జరగలేదని, ఇక ముందు జరగబోనివ్వబోమని కాలేజీ యాజమాన్యం ప్రకటించింది. ఆహారంలో ఏదో పడి ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు. ప్రస్తుతానికి 16మందిని ఐసీయూలో, మిగితావారిని జనరల్ వార్డులో ఉంచి చికిత్స ఇప్పిస్తున్నారు.