వసతి గృహం నుంచి విద్యార్థి అదృశ్యం
Published Fri, Nov 11 2016 12:27 AM | Last Updated on Fri, Nov 9 2018 5:02 PM
కాకినాడ క్రైం:
విశాఖ జిల్లా పాయకరావుపేట గ్రామానికి చెందిన అల్లు భాస్కరరావు అనే పదిహేడేళ్ల విద్యార్థి కాకినాడ శ్రీచైతన్య జూనియర్ కళాశాల హాస్టల్ నుంచి అదృశ్యమైనట్టు తమకు గురువారం ఫిర్యాదు అందినట్లు రెండో పట్టణ సీఐ చైతన్యకృష్ణ తెలిపారు. భాస్కరరావు కళాశాలో ఇంటర్మీడియెట్ ప్ర««దlమ సంవత్సరం చదువుతున్నాడని, ఈనెల 8వ తేదీ ఉదయం 6 గంటల నుంచి హాస్టల్ నుంచి కనిపించకుండా పోయినట్లు హాస్టల్ ఇన్‌చార్జి వేసరపు సతీష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఇతని ఆచూకీ తెలిస్తే 94407 96541, 0884 2379312 ఫో¯ŒS నంబర్లకు సమాచారం ఇవ్వాలని కోరారు.
Advertisement
Advertisement