హాస్టల్లో ఇంటర్ విద్యార్థి మృతి
Published Sat, Feb 4 2017 11:35 PM | Last Updated on Fri, Nov 9 2018 5:02 PM
వినుకొండ రూరల్ : అనుమానాస్పద స్థితిలో విద్యార్థి మృతి చెందిన సంఘటన పట్టణంలోని ఓ ప్రైవేటు కళాశాలలో శనివారం చోటు చేసుకుంది. కాలేజీ నిర్వాహకులు తెలిపిన వివరాల ప్రకారం శావల్యాపురం మండలం పిచికలపాలెం ఎస్సీ కాలనీకి చెందిన అచ్చయ్య, శాసమ్మల కుమారుడు రాంబాబు(16) పట్టణంలోని లాయర్స్ స్ట్రీట్‌లో గల ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్మీడియెట్ చదువుతున్నాడు. కళాశాల హాస్టల్లోనే ఉంటున్నాడు. శనివారం కళాశాల వదిలిన తర్వాత హాస్టల్‌కు చేరుకొని మరుగుదొడ్డిలోకి వెళ్లి ఎంతసేపటికీ బయటకు రాలేదు. తోటి విద్యార్థులు వెళ్లి పరిశీలించగా అపస్మారకస్థితిలో పడి ఉన్నాడు. ప్రైవేటు వైద్యశాలకు తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతి చెందాడు. ఆరోగ్యంగా ఉండే విద్యార్థి ఎలా మృతి చెందాడంటూ రాంబాబు తల్లిదండ్రులు, బంధువులు కళాశాల యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫిట్స్ వల్ల మృతి చెంది ఉండవచ్చని విద్యార్థులు, కళాశాల యాజమాన్యం చెబుతున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఈ ఘటనపై పోలీసులకు సమాచారం లేదు.
Advertisement
Advertisement