విద్యార్థులకు అస్వస్థత | students injured | Sakshi
Sakshi News home page

విద్యార్థులకు అస్వస్థత

Aug 16 2016 11:38 PM | Updated on Sep 4 2017 9:31 AM

చికిత్స పొందుతున్న విద్యార్థులు

చికిత్స పొందుతున్న విద్యార్థులు

మండలంలోని పెంబి గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థులు మంగళవారం అస్వస్థతకు గురయ్యారు. 40 మందికిపైగా వాంతులు, విరేచనాలతో బాధపడుతున్నారు.

  • 40 మందికి వాంతులు, విరేచనాలు
  • ఖానాపూర్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలింపు
  • ఖానాపూర్‌ : మండలంలోని పెంబి గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థులు మంగళవారం అస్వస్థతకు గురయ్యారు. 40 మందికిపైగా వాంతులు, విరేచనాలతో బాధపడుతున్నారు. సాయంత్రం భోజనం వికటించడమే అందుకు కారణమై ఉంటుందని ఆస్పత్రి వైద్యులు తెలిపారు. మంగళవారం అర్ధరాత్రి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి వార్డెన్‌ మోతిలాల్‌ విద్యార్థులను 108, ఆటోల్లో తరలించారు. మరో ఉపాధ్యాయుడికీ వాంతులు, విరేచనాలు అయ్యాయి. సాయంత్రం 5.30 గంటల నుంచే విద్యార్థులకు వాంతులు, విరేచనాలు ప్రారంభమయ్యాయి. ఆస్పత్రిలోని పడకలు నిండిపోయాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement