
అనంతపురం : తమ కళాశాలకు అనుమతి ఇవ్వకుంటే అంతుచూస్తామని అనంతపురం జేఎన్టీయూ వీసీకి బెదిరింపు కాల్స్ వచ్చాయి. విద్యా ప్రమాణాల దృష్ట్యా ఇంజినీరింగ్ కళాశాలల్లో నిబంధనలను ప్రభుత్వం కఠినతరం చేసింది. ఈ నేపథ్యంలో దాదాపు ఐదు జిల్లాల్లోని 63 ఇంజినీరింగ్ కాలేజీల అనుమతులు ప్రశ్నార్ధకంగా మారాయి. దీంతో తమ కాలేజీలకు అనుమతులు దక్కవేమోనని కొందరు ఇంజినీరింగ్ కాలేజీ యాజమాన్యాలు బెదిరింపులు పాల్పడుతున్నట్లు అధికారుల దృష్టికి వచ్చింది.