![Cochin University Allows Saraswati Pooja on Campus - Sakshi](/styles/webp/s3/article_images/2019/02/7/cochin.jpeg.webp?itok=2I3NFxx_)
తిరువనంతపురం : విద్యార్ధుల నిరసనలతో కొచ్చిన్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ తమ అలప్పుజ క్యాంపస్‌లో సరస్వతి పూజకు అనుమతించింది. శాంతియుతంగా పూజ నిర్వహించాలని సూచిస్తూ వర్సిటీ వారిని అనుమతించింది. కొచ్చిన్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్‌లో అభ్యసిస్తున్న ఉత్తరాది విద్యార్ధుల ఆందోళనలతో పూజలకు వర్సిటీ అధికారులు అనుమతించారు.
తొలుత వర్సిటీ సెక్యులర్ క్యాంపస్ అని, ఇక్కడ మతపరమైన ప్రార్థనలు, పూజలకు అనుమతించబోమని కొచ్చిన్ వర్సిటీ అధికారులు స్పష్టం చేసినా ఉత్తరాది విద్యార్ధులు ఆందోళన చేపట్టడంతో ఈనెల 9,10,11 తేదీల్లో క్యాంపస్‌లో శాంతియుతంగా సరస్వతి పూజ నిర్వహించుకోవాలని అనుమతించారు. గత ఏడాది సైతం పూజలకు అనుమతించారని విద్యార్ధులు ఆందోళన చేపట్టడంతో కొచ్చిన్ వర్సిటీ వీసీ, రిజిస్ర్టార్‌లతో కూడిన ఉన్నతస్ధాయి కమిటీ సరస్వతీ పూజకు అనుమతించిందని వర్సిటీ వర్గాలు పేర్కొన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment