రేఖారాణికి ఎంఏడీఏ బాధ్యతలు?
రేఖారాణికి ఎంఏడీఏ బాధ్యతలు?
Published Tue, Sep 27 2016 11:53 PM | Last Updated on Sat, Apr 6 2019 9:11 PM
చిలకలపూడి (మచిలీపట్నం):
మచిలీపట్నం ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ వైస్‌చైర్మన్‌గా ఐఏఎస్ అధికారిణి జి.రేఖారాణిని ప్రభుత్వం నియమించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆ పదవిలో జేసీ చంద్రుడు ఉన్నారు. జేసీగా ఆయనకు పని ఒత్తిడి ఎక్కువగా ఉండటంతో అథారిటీకి ఎక్కువ సమయం కేటాయించలేకపోతున్నానని ప్రభుత్వానికి చెప్పినట్లు సమాచారం. అథారిటీకి కొత్త వైస్‌చైర్మన్‌ను రెండు రోజుల్లో నియమిస్తామని ఇటీవల మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు రేఖారాణికే ఈ బాధ్యతలు కట్టబెట్టవచ్చని సమాచారం. ఇప్పుడామె శాప్‌కు సారథ్యం వహిస్తున్నారు. పోర్టు నిర్మాణం, పారిశ్రామిక కారిడార్‌కు సంబంధించి ఇటీవల భూసమీకరణ నోటిఫికేషన్ విడుదల చేసిన నేప«థ్యంలో పూర్తిస్థాయిలో ఐఏఎస్ అధికారిని నియమించాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది.
Advertisement
Advertisement