MADA
-
మడ అడవుల్లో మెరుపు దాడి
సాక్షి, తూర్పుగోదావరి : కాకినాడ కోరింగ మడ అడవుల్లో నాటు సారా తయారీ స్థావరాలపై స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (ఎస్ఈబీ), పోలీసులు కలిసి దాడులు చేపట్టారు. ఎస్ఈబీ కమిషనర్ వినీత్ బ్రిజ్‌లాల్ ఆదేశాలతో అడిషనల్ ఎస్పీ సుమిత్ నేతృత్వంలోని పోలీసుల బృందం అభయారణ్యంలో దాడులు జరిపింది. మడ అడవుల్లో 22 సారా బట్టీలపై మెరుపు దాడిన చేసిన ఎస్ఈబీ అధికారులు 46000 లీటర్ల ఊట బెల్లాన్ని ద్వంసం చేశారు. 200 లీటర్ల సామర్థ్యం కలిగిన 230 బారెల్స్‌ను గుర్తించిన ఎస్ఈబీ అధికారులు 1400 లీటర్ల సారా స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడుల్లో ఎస్ఈబీ అదనపు ఎస్పీ సుమీత్ గరుడ్ స్వయంగా పాల్గొనగా..దాడులను ఇంకా కొనసాగిస్తున్నారు. అయితే పోలీసుల రాకతో సారా తయారీదారులు అక్కడి నుంచి పరారయ్యారు. -
మడ అడవుల పరిరక్షణ కార్పొరేట్ సంస్థలదే
– సదస్సులో కలెక్టర్ కార్తికేయ మిశ్రా కాకినాడ సిటీ : జిల్లాలోని మడ అడవుల పరిరక్షణ ద్వారా వాతావరణ సమతుల్యాన్ని కాపాడడానికి కార్పొరేట్ సంస్థలు ముందుకు రావాలని కలెక్టర్ కార్తికేయ మిశ్రా పిలుపునిచ్చారు. మంగళవారం కాకినాడలోని హోటల్ రాయల్‌పార్క్‌లో ఎగ్రీ ఫౌండేషన్ ప్రీ కార్పొరేట్ సదస్సు నిర్వహించింది. ఈ సందర్భంగా కలెక్టర్ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ దేశంలో సుందర్బన్ తరువాత జిల్లాలో ఉన్న మడ అడవులు అత్యంత ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయని వీటిని పరిరక్షించాల్సిన బాధ్యత అందరిపైన ఉందన్నారు. జిల్లాలో ఆయిల్, సహజవాయువు, ఫెర్టిలైజర్స్ షిప్పింగ్ పోర్ట్స్ వ్యవహారాలు నిర్వహిస్తున్న కార్పొరేట్ సంస్థలు వాతావరణ పరిరక్షణ కోసం మైక్రో ప్లాను రూపొందించి వాటిని అమలు చేయాలన్నారు. కోరంగి మడఅడవుల పరిరక్షణకు కార్పొరేట్ సంస్థలు చేపట్టాల్సిన అంశాలపై ఒక ప్రణాళిక రూపొందించాలని వన్యప్రాణి విభాగం డీఎఫ్ఓను కలెక్టర్ కోరారు. చీఫ్ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ఎం.రవికుమార్ మాట్లాడుతూ ఎగ్రి ఫౌండేషన్ ఆధ్వర్యంలో కోస్తా జీవ పరిరక్షణ కోసం ఆయిల్, సహజవాయువు, ఆక్వా కల్చర్, టూరిజం, ఫెర్టిలైజర్స్, ఫిషరీస్ వంటి ఏడు సంస్థలను గుర్తించామన్నారు. ఆక్వాకల్చర్ నిపుణులు డాక్టర్ డి.పద్మావతి రూపొందించిన పిన్ఫిష్ అట్లాస్ పుస్తకాన్ని కలెక్టర్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా అటవీశాఖాదికారి నందిని సలారియా, ఓఎన్జీసీ ఇడి అలోక్ సుందర్, కోరమండల్ జీఎం జ్ఞానసుందరం, వన్యప్రాణి విభాగ డీఎఫ్ఓ ప్రభాకరరావు, ట్రైనీ కలెక్టర్ ఆనంద్, వివిధ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. -
రేఖారాణికి ఎంఏడీఏ బాధ్యతలు?
చిలకలపూడి (మచిలీపట్నం): మచిలీపట్నం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ వైస్‌చైర్మన్‌గా ఐఏఎస్ అధికారిణి జి.రేఖారాణిని ప్రభుత్వం నియమించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆ పదవిలో జేసీ చంద్రుడు ఉన్నారు. జేసీగా ఆయనకు పని ఒత్తిడి ఎక్కువగా ఉండటంతో అథారిటీకి ఎక్కువ సమయం కేటాయించలేకపోతున్నానని ప్రభుత్వానికి చెప్పినట్లు సమాచారం. అథారిటీకి కొత్త వైస్‌చైర్మన్‌ను రెండు రోజుల్లో నియమిస్తామని ఇటీవల మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు రేఖారాణికే ఈ బాధ్యతలు కట్టబెట్టవచ్చని సమాచారం. ఇప్పుడామె శాప్‌కు సారథ్యం వహిస్తున్నారు. పోర్టు నిర్మాణం, పారిశ్రామిక కారిడార్‌కు సంబంధించి ఇటీవల భూసమీకరణ నోటిఫికేషన్ విడుదల చేసిన నేప«థ్యంలో పూర్తిస్థాయిలో ఐఏఎస్ అధికారిని నియమించాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. -
రైతన్న మెడపై కత్తి
మచిలీపట్నం : టీడీపీ సర్కారు రైతు మెడపై కత్తి పెట్టింది. ఇంతకాలంగా భూమినే నమ్ముకుని జీవనం సాగిస్తున్న వేలాది కుటుంబాలు ప్రభుత్వం ఉత్తర్వులతో రోడ్డున పడే ప్రమాదం ఏర్పడింది. ఏ పరిశ్రమలు ఏర్పాటు చేస్తారో, వీటికి ఎంత భూమి కావాలో తెలియజేయకుండానే మచిలీపట్నం ఏరియా డెవలప్మెంట్ అధారిటీ పేరుతో భూసమీకరణకు ప్రభుత్వం పూనుకుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆర్ కరికాల్వాలవెన్ శనివారం జీవో నంబరు 185ను జారీ చేశారు. ఈ జీవో రైతుల పాలిట పిడుగుపాటుగా మారింది. ప్రభుత్వం భూసమీకరణకు జీవో విడుదల చేసిందనే విషయం తెలుసుకున్న రైతుల్లో కలకలం ప్రారంభమైంది. ఇంత కాలంగా తమకు అన్నం పెట్టిన భూమిపై హక్కు కోల్పోతామనే భయం ప్రతి ఒక్క రైతును వెంటాడుతోంది. ప్రభుత్వం విడుదల చేసిన జీవో కారణంగా రైతుకు ఇష్టం ఉన్నా లేకున్నా భూమిని ప్రభుత్వం సమీకరించే అవకాశం ఉందనే వాదన రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. భూసేకరణ ముసుగులో గతేడాది ఆగస్టు 31వ తేదీన మచిలీపట్నం పోర్టు, పరిశ్రమల స్థాపన నిమిత్తం 30 వేల ఎకరాల భూమిని సేకరించేందుకు ప్రభుత్వం భూసేకరణ నోటిఫికేషన్‌ను జారీ చేసింది. భూసేకరణపై 4,800లకు పైగా అభ్యంతరాలను ఆర్డీవో కార్యాలయంలో రైతులు దాఖలు చేశారు. పోర్టు, అనుబంధ పరిశ్రమలకు భూములు ఇవ్వాలని రైతులను కోరేందుకు గ్రామాలకు వెళ్లిన మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ కొనకళ్ల నారాయణరావు అధికారులను ఆయా గ్రామాల్లో రైతులు తరిమి కొట్టినంత పనిచేశారు. భూసేకరణ నోటిఫికేషన్‌తో భూముల రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. రైతులకు పంట రుణాలు బ్యాంకులు ఇవ్వని పరిస్థితి. రైతుల నుంచి ఒత్తిడి తీవ్రతరం కావటంతో భూసేకరణ నోటిఫికేషన్‌ను రద్దు చేస్తామని ప్రకటించినా ఆ పని చేయలేదు. మాట మార్చారు భూసేకరణ నోటిఫికేషన్ రద్దు చేయకుండానే పోర్టు, అనుబంధ పరిశ్రమల స్థాపన పేరుతో భూసమీకరణ అంశాన్ని ప్రభుత్వం తెరపైకి తెచ్చింది. ఈ ఏడాది ఫిబ్రవరి 1వ తేదీన మచిలీపట్నం ఏరియా డెవలప్మెంట్ అధారిటీ (ఎంఏడీఏ)ను ఏర్పాటు చేసింది. 16 మంది డెప్యూటీ కలెక్టర్లను నియమించింది. వైస్‌చైర్మన్‌గా ఐఏఎస్ అధికారి శోభని నియమించారు. ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో ఎంఏడీఏ పరిధి 426.16 చదరపు కిలోమీటర్లుగా నిర్ణయించారు. 1.05 లక్షల ఎకరాలను పోర్టు, అనుబంధ పరిశ్రమల స్థాపన నిమిత్తం సమీకరించనున్నట్లు మంత్రి పల్లె రఘునాథరెడ్డి ప్రకటించారు. మంత్రి ప్రకటనపై అటు ముఖ్యమంత్రి గాని, ఇటు జిల్లా మంత్రులుగాని స్పందించలేదు. శనివారం విడుదల చేసిన జీవో 185లోనూ పోర్టు, అనుబంధ పరిశ్రమల స్థాపన కోసం ఎంత భూమిని సేకరిస్తారో స్పష్టం చేయలేదు. ఎంఏడీఏ పరిధిలో మచిలీపట్నం పురపాలక సంఘంతో పాటు మచిలీపట్నం మండలంలోని 27 రెవెన్యూ గ్రామాలు, పెడన మండలంలోని కాకర్లమూడి రెవెన్యూ గ్రామాన్ని చేర్చారు. భూసమీకరణకు సంబంధించిన సర్వాధికారాలను జిల్లా కలెక్టర్‌కు అప్పగించారు. భూసమీకరణ నోటిఫికేషన్ జారీ అయిన 15 రోజుల్లోగా రైతులు తమ అభ్యంతరాలను 6(2) ఫార్మాట్లో తెలియజేసేందుకు అవకాశం ఇచ్చారు. ప్రభుత్వంపై న్యాయపోరాటం చేస్తాం ప్రభుత్వం జారీ చేసిన భూసమీకరణ నోటిఫికేషన్‌పై న్యాయ నిపుణుల సలహాలు తీసుకోవటంతోపాటు సీఆర్డీఏలో భూసమీకరణపై న్యాయపోరాటం చేస్తున్న వారిని, జడ్జిలుగా పదవీ విరమణ చేసిన వారిని తీసుకువచ్చి రైతులకు అవగాహన కల్పిస్తాం. – పేర్ని నాని, వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి -
భూసమీకరణా.. భూదందానా..?
విశ్లేషణ చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటుతున్నా ఇంతవరకూ దుగరాజపట్నం లేక రామాయ పట్నం మేజరు పోర్టు పనులే ప్రారంభానికి నోచుకోలేదు. పోర్టుల అభివృద్ధే నత్తనడకన సాగుతుండగా రైతులకు చెందిన వేలాది ఎకరాల పట్టాభూములపై ప్రభుత్వం ఎందుకు కన్నేస్తున్నట్లు? రాష్ట్ర ప్రభుత్వ భూసమీకరణ వ్యవహారం భూదం దాకు అచ్చమైన నిదర్శనంగా రూపొందుతోంది. రాజధాని కోసం ముక్కారు పంటలు పండే ప్రాంతంలో 30 వేలకుపైగా మాగాణి భూములను సమీకరించిన చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు పారిశ్రామిక రంగ చరిత్రలోనే కనీవినీ ఎరుగని రీతిలో ఒక్క మచిలీపట్నం ఓడరేవు, పారిశ్రామిక కారిడార్ సాకుతో వేలాది ఎకరాల భూమిని కైవసం చేసు కోవడానికి శరవే గంగా పావులు కదుపుతోంది. దీంట్లో రైతుల పట్టాభూములే 12 వేల ఎకరాలకు పైబడి ఉన్నాయంటే అభివృద్ధి పేరిట ప్రభుత్వం సాగించనున్న భూదందా వ్యవహారం ఎంత తీవ్రస్థాయిలో ఉంటోందో అర్థం చేసుకోవచ్చు. రైతుకు స్వాంతన కలిగిస్తున్న భూ సేకరణ చట్టం కింద కాకుండా ల్యాండ్ పూలింగ్ కింద భూములను లాక్కోవాలని ప్రభు త్వం చూస్తుండటం వేలాది రైతుల జీవితాలను అస్తవ్యస్థతకు గురిచేయనుంది. మచిలీపట్నం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ పరిధిలో 1.05 లక్షల ఎక రాలలోని 36,559 ఎకరాల భూమి మచిలీ పట్నం ఓడరేవు, పారిశ్రామిక కారిడార్ కోసం అవసరమని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో ఓడరేవు కోసం 2,282 ఎకరాలు, అనుబంధ పరిశ్రమల కోసం 12,144 ఎకరాల రైతువారి పట్టా భూములను ల్యాండ్ పూలింగ్ విధానంలో తీసుకోవాలని ప్రభుత్వం సంక ల్పించింది. అమరావతి తరహాలో ఎకరా ఇచ్చిన వారికి 1000 గజముల నివాస స్థలం, 250 గజాల వాణిజ్య స్థలం ఇవ్వాలని, ఏడాదికి లీజు క్రింద రైతుకు రూ. 30,000లు ఇచ్చేం దుకు వ్యవసాయ కూలీ కుటుంబానికి నెలకు రూ. 2,500లు పింఛను ఇచ్చేం దుకు అవకాశం ఉంటుంది. అనేక దశాబ్దాల తర్వాత రైతులు, భూములపై ఆధారపడ్డ ఇతర ప్రజల ప్రయోజనాలను పరిరక్షించడానికి కేంద్ర ప్రభుత్వం, పార్లమెంట్ ఆమోదం పొందిన 2013 భూసేకరణ చట్టం ఇప్పుడు అమలులో ఉంది. దీని ప్రకారం నిపుణుల బృందంతో సామాజిక ప్రభావం అంచనా, పర్యావరణ అంచనాలు వేసిన తదుపరి నూటికి 70 మంది రైతులు, ప్రజలు భూసేకరణకు ఆమోదించ వలసి ఉంటుంది. మార్కెట్ వాల్యూ (రిజిస్ట్రేషన్ విలువ)కు పట్టణ ప్రాంతంలో 2 రెట్లు, గ్రామీణ ప్రాంతంలో 4 రెట్లు చొప్పున రైతులకు నష్ట పరిహారం ఇవ్వవలసి ఉంటుంది. దీని ప్రకారమే ఇటీవల భోగాపురం ఎయిర్‌పోర్టు కొరకు తీసుకోనున్న భూములకు రూ. 25 నుండి 33 లక్షల రూపాయల నష్ట పరిహారం రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పుడు మచిలీపట్నం పోర్టు కొరకు 4,800 ఎకరాలు అవసరమని, ప్రభుత్వ భూమి సుమారు 2,300 ఎకరాలు కాక రైతుల నుంచి 2,282 ఎకరాలు భూసమీకరణలో తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించటం ఎంతమాత్రం సరి కాదు. మచిలీపట్నంలో సముద్రంలోతు (డ్రాఫ్ట్) 13 మీటర్లు, 3 బెర్తులు నిర్మిం చాలని పోర్టు డెవలపర్ ప్రతిపాదన, ఇందుకు ప్రభుత్వ భూమి 2,300 ఎకరాలు సరిపోతుంది. 21 మీటర్ల లోతుతో, 5 బెర్తులతో 14 మిలియన్ మెట్రిక్ టన్నుల సరుకును ఇప్పటికే హ్యాండిల్ చేస్తూ ఉన్న గంగవరం పోర్టునకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది 1800 ఎకరాలు మాత్రమే. అంతేకాక మన దేశంలో మేజరు పోర్టులు అయిన చెన్నై పోర్టు 500 ఎకరాలు, ఎన్నూరు పోర్టు 2,000 ఎకరాలు, ట్యుటుకో రిన్ పోర్టు 2,150 ఎకరాలు, కొచ్చిన్ పోర్టు 2,000 ఎకరాలు, న్యూమంగళూరు పోర్టు 1,908 ఎకరాలు, మార్మగోవా 530 ఎకరాల విస్తీర్ణంతోనే తమ కార్యకలా పాలు నిర్వహిస్తున్నాయి. మన రాష్ట్ర ప్రభుత్వానికి అత్యంత ఆదర్శప్రాయమైన సింగపూర్‌లో పి.ఎస్.ఎ. సింగపూర్ రేవు 1,500 ఎకరాలలో 52 బెర్తులతో పనిచేస్తూ ఉంది. అలాగే జురాంగ్ పోర్టు 400 ఎకరాలలో 32 బెర్తులతో పనిచేస్తూ ఉంది. అనగా కేవలం 1,900 ఎకరాలలో 84 బెర్తులతో కోట్లాది టన్నుల సరుకులను హ్యాండిల్ చేస్తూ, ఈ రెండు పోర్టులు పని చేస్తున్నాయి. ఇక్కడ మచిలీపట్నం పోర్టునకు అవసరమని చెబుతూ ఉన్న 4,800 ఎకరాలలో ఒక మినీ స్టీల్ ప్లాంట్, ఒక థర్మల్ పవర్ ప్రాజెక్టు, ఒక సెజ్, డీశాలినేషన్ ప్లాంట్ మున్నగునవి ఉంటాయని పోర్టు డెవలపర్ సమర్పించిన డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టులో (డి.పి.ఆర్.) ఉంది కావున ఎట్టి పరిస్థితులలోను పోర్టు కోసం రైతుల భూమి ఒక ఎకరా కూడా తీసుకోవలసిన అవసరం లేదు. ఒకవేళ ఉంది అని భావించితే 2013 భూసేక రణ చట్టంను అనుసరించి న్యాయమైన నష్ట పరిహారమును చెల్లించి భూసేకరణ ద్వారా తీసుకొన వచ్చును. మన దేశంలో అనేక రాష్ట్రాలలో రహదారుల కొరకు, పరిశ్రమల కొరకు, ప్రాజెక్టుల కొరకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు 2013 భూసేకరణ చట్టంను అను సరించి రైతులకు నష్టపరిహారం ఇచ్చి భూములను తీసుకొంటున్నాయి. ఇక్కడ మన రాష్ట్ర ప్రభుత్వానికి రాజధాని అమరావతి ప్రాంతంలో రైతులు భూసమీ కరణ క్రింద భూములు ఇచ్చివున్నారు, కాబట్టి మచిలీపట్నంలో కూడా అదే తరహాలో భూములు ఇస్తారని భావించటం ఎంతమాత్రమూ తగదు. అది రాజ ధాని ప్రాంతం కాబట్టి కొంతకాలం తర్వాతైనా తమ భూములకు మంచి ధరలు వస్తాయని మెట్ట గ్రామాలలోని రైతులు ఆశించారు. కొందరు మంత్రులు, పార్ల మెంట్ సభ్యులు రైతుల భూములకు భవిష్యత్తులో కోట్లకు కోట్ల రూపాయలు వస్తాయని భ్రమలు కల్పించారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వమే కొన్ని ప్రైవేటు సంస్థలకు వందల ఎకరాల భూములను ఎకరాకు రూ. 50 లక్షల చొప్పున భూ సంతర్పణ చేస్తూ ఉంటే ఆ మెట్ట గ్రామాలలోని రైతుల ఆశలు రానున్న కాలంలో అడియాశలు అయ్యే పరిస్థితి ఉంది. మన బందరు పట్టణంలో ప్రధానమైన రహదారి, కలెక్టరేట్ వంటి కొద్ది రహదారులు మినహా ఏ మాత్రం అభివృద్ధి జరిగినదో ప్రజ లందరికీ ఎరుకే. ఇలాంటి పరిస్థితులలో ఎకరా భూమి (4,840 చదరపు గజాల)ని ఏమాత్రం నష్ట పరిహారం తీసుకోకుండా ప్రభుత్వానికి ఇచ్చి, దానికి బదులుగా ప్రభుత్వం ఇచ్చే 1,250 చదరపు గజాలను మాత్రమే తీసుకోవటానికి రైతులు ఏమన్నా బిచ్చగాళ్ళా! దాదాపు 18 నుండి 20 వేల ఎకరాల మేరకు ప్రభుత్వ భూమి పెట్రో కెమికల్ కాంప్లెక్స్, పారిశ్రామిక కారిడార్ కొరకు అందుబాటులో ఉందని మంత్రులే చెబుతున్నారు. కావున ఏ ఏ పరిశ్రమలు వస్తాయి? వాటికి వాస్త వంగా ఎంత భూమి అవసరం? అని అంచనాలు రూపొందించుకొని రైతుల నుంచి అవసరం అయ్యే భూములకు 2013 చట్టంను అనుసరించి నష్ట పరి హారం చెల్లించి తీసుకోవాలి. ముఖ్యమంత్రి మన రాష్ట్రంలో 13 పోర్టులు ఉన్నాయని బ్రహ్మాండంగా అభివృద్ధి చెందేందుకు ఆస్కారం ఉన్నదని పదే పదే మాట్లాడుతూ ఉంటారు. కానీ ఈ రెండు సంవత్సరాలలో ఒక్క పోర్టు పనిని కూడా ప్రారంభించలేదు. పొరుగున ఉన్న ఒరిస్సా రాష్ట్రములో పారాదీప్ మేజర్ పోర్టే కాక నవీన్ పట్నాయక్ ప్రభుత్వం దమ్రా, కిరిటానియా, గోపాల్పూర్ మున్నగు పలు పోర్టుల అభివృద్ధికి చక్కగా కృషి చేస్తూ గణనీయమైన ఆదాయాన్ని కూడా పొందుతూ ఉంది. తమిళనాడు రాష్ట్రంలో ఇప్పటికే 3 మేజర్ పోర్టులు ఉండగా ఇప్పుడు కొత్తగా 4వ మేజర్ పోర్టును కొలాచల్ సమీపంలో ఎనైమ్ వద్ద రూ. 21 వేల కోట్లు ఖర్చుతో కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి చేసేందుకు కేంద్ర మంత్రి వర్గం ఇటీవల ఆమోదించింది. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు దాటిపోతూ ఉన్నా ఇంత వరకూ దుగరాజపట్నం లేక రామాయపట్నం మేజరు పోర్టు పనులు ప్రారం భానికి నోచుకోలేదు. 2,300 ఎకరాలలో బందరు పోర్టు పనిని చేపట్టేందుకు నవయుగ ఇంజనీరింగ్ కంపెనీ ముందుకు రాని పక్షంలో విశాఖపట్నం పోర్టు ట్రస్టువారు మన రాష్ట్రంలో ఒక పోర్టును చేపట్టి అభివృద్ధి చేసేందుకు ముందుకు వచ్చిన నేపథ్యంలో.. మచిలీపట్నంలో 2,300 ఎకరాలు ప్రభుత్వ భూమిని ఇచ్చి విశాఖపట్నం పోర్టు ట్రస్టు వారిచే మచిలీపట్నం పోర్టును అభివృద్ధి చేసేలా రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపాలి. రాష్ట్ర ప్రభుత్వం ‘‘మడ’’ ఏరియాలో తలపెట్టిన భూసమీకరణ ప్రయత్నాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని రైతాంగం కోరుతూ ఉంది. - వడ్డే శోభనాద్రీశ్వరరావు వ్యాసకర్త మాజీ మంత్రి, వ్యవసాయ రంగ నిపుణులు మొబైల్ : 93929 59999 -
పునరావాస పాట్లు
సాక్షి, ముంబై: నగరంలో శిథిలావస్థకు చేరుకున్న భవనాల్లో నివసిస్తున్న వారిని ఖాళీ చెయ్యించాలంటే మహారాష్ట్ర హౌసింగ్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ(మాడా)కు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ట్రాన్సిట్ క్యాంపుల్లో తగినన్ని ఇళ్లు ఖాళీగా లేకపోవడంతో అక్కడకు వెళ్లేందుకు అనేక మంది నిరాకరిస్తుండటంతో అధికారులకు ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. నగరంలో గత కొన్నిరోజులుగా పాత భవనాలు పేకమేడల్లా కూలుతున్న సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఇందులో ప్రాణ, ఆస్తి నష్టం పెద్ద మొత్తంలోనే వాటిల్లుతోంది. నగరంలో వందలాది భవనాలు ప్రమాదకర స్థితిలో ఉన్నాయని ఇటీవల ఓ అధ్యయనంలో వెల్లడైంది. ప్రాణ, ఆస్తి నష్టాన్ని నివారించేందుకు సాధమైనంత త్వరగా వాటిని ఖాళీ చేయించాలని మాడా, బీఎంసీలను ప్రభుత్వం అదేశించింది. అయితే ప్రమాదకర భవనాల్లో నివాసముంటున్న సదరు వేలాది కుటుంబాలకు పునరావాసం ఎక్కడ కల్పించాలనేది అధికారులకు సమస్యగా మారింది. ఇందుకోసం మాడా ప్రత్యామ్నాయ మార్గాలను వెతుకుతోంది. నగరంలో మూత పడిన మిల్లు స్థలాల్లో మాడా వాటాలోకి వచ్చిన స్థలంలో నిర్మిస్తున్న, నిర్మించనున్న భవనాల్లో ట్రాన్సిట్ క్యాంపుల కోసం కొన్ని ఇళ్లను కేటాయించింది. ఇటీవల కాళా చౌకి ప్రాంతంలో ఓ మిల్లు స్థలంలో మాడా దాదాపు 10 వేల ఇళ్లు నిర్మించింది. ఇందులో 6,925 ఇళ్లు మిల్లు కార్మికులకు కేటాయించగా, మిగతా 3,075 ఇళ్లు ట్రాన్సిట్ క్యాంపుల కోసం కేటాయించింది. అయితే ముంబైలో 15 మిల్లులకు చెందిన 62,507 చదరపు మీటర్ల స్థలం కార్మికులకు ఇళ్లు నిర్మించేందుకు మాడా ఆధీనంలో ఉంది. ఈ స్థలంలో భవన నిర్మాణం పనులు చేపడితే కార్మికులకు ఇళ్లు లభించడంతోపాటు ట్రాన్సిట్ క్యాంపుల కోసం 3,283 ఇళ్లు అందుబాటులోకి వస్తాయి. అందుకు ప్రభుత్వం, మాడా సమన్వయంతో సకాలంలో పనులు ప్రారంభించాల్సిన అవసరం ఉంది. ఇలాంటి ఇళ్లు మాడా ఆధీనంలో ఉంటే అత్యవసర సమయంలో బాధితులకు పునరావాసం కల్పించడానికి ఎంతో దోహదపడతాయి. అయితే ఇప్పుడు మాడా వద్ద ఇళ్లు ఖాళీ లేకపోవడంతో పురాతన భవనవాసుల తరలింపు తలనొప్పిగా మారింది. ట్రాన్సిట్ క్యాంపుల భవనాల నిర్మాణం కోసం ప్రత్యేకంగా స్థలం వెతకాల్సిన పని లేదని,అందుబాటులో ఉన్న మిల్లు స్థలాల్లోనే ఇళ్లు నిర్మిస్తే చాలు పునరావాస సమస్య పరిష్కరమవుతుందని మాడా గృహనిర్మాణ శాఖ అధికారులు అంటున్నారు. ఇవి అందుబాటులోకి రావాలంటే ముందు మిల్లు కార్మికుల కోసం ఇళ్లు నిర్మించాలి. వాటిని కార్మికులకు చౌక ధరకు విక్రయించాలి. వీటి ద్వారా వచ్చే నిధులతో ట్రాన్సిట్ క్యాంపు భవనాలు నిర్మించేందుకు సాధ్యపడుతుందని ఓ అధికారి వెల్లడించారు. నగరం, పశ్చిమ, తూర్పు శివారు ప్రాంతాల్లో సుమారు 58 మిల్లులు ఉన్నాయి. ప్రస్తుతం అవన్నీ మూతపడడంతో నియమాల ప్రకారం మిల్లు స్థలాన్ని మూడు భాగాలు చే యాలి. ఇందులో ఒక భాగం మిల్లు యజమానికి, రెండో భాగం ప్రభుత్వానికి, మూడో భాగం మాడాకు అందజేయాల్సి ఉంటుంది. మాడా వాటాలోకి వచ్చిన మొత్తం స్థలంలో కార్మికుల ఇళ్లకు పోనూ మిగతా స్థలంలో మాడా తమ ట్రాన్సిట్ క్యాంపులకు వినియోగించుకుంటుంది. ఇలా నిర్మించిన ఇళ్లు ప్రస్తుతం కాళాచౌకిలో మాత్రమే అందుబాటులోకి వచ్చాయి. మిగతా మిల్లు స్థలాలు మాడా అధీనంలోకి వస్తే ఇక్కడ వేలాది ఇళ్లు నిర్మించి పునరావాస గృహాలుగా వినియోగించుకునేందుకు వీలు కలగనుంది.