హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(హెచ్‌సీయూ) వైస్ చాన్సలర్ పొదెల అప్పారావు క్వాష్ పిటిషన్‌పై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది.
హైదరాబాద్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(హెచ్‌సీయూ) వైస్ చాన్సలర్ పొదెల అప్పారావు వేసిన క్వాష్ పిటిషన్‌పై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. వీసీ అప్పారావు క్వాష్ పిటిషన్ సవాల్ చేస్తూ విద్యార్థులు మరో పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో రోహిత్ సుసైడ్ నోట్ జిరాక్స్ కాపీని కోర్టుకు పోలీసులు సమర్పించారు.
అయితే రోహిత్ సూసైడ్ నోటు.. ఒరిజినల్ కాపీ ఎందుకు సమర్పించలేదని పోలీసులపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. దాంతో విచారణ బుధవారానికి హైకోర్టు వాయిదా వేసింది. కాగా, గతంలో సెంట్రల్ యూనివర్సిటీ పీహెచ్డీ విద్యార్థి రోహిత్ మనస్తాపంతో యూనివర్సిటీలో ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే.