కొత్తకు విజయం.. పాతకు పరాభవం | Victory for old | Sakshi
Sakshi News home page

కొత్తకు విజయం.. పాతకు పరాభవం

Published Wed, Jul 27 2016 1:12 AM | Last Updated on Sat, Apr 6 2019 9:11 PM

కొత్తకు విజయం.. పాతకు పరాభవం - Sakshi

కొత్తకు విజయం.. పాతకు పరాభవం

అందరూ ఉత్కంఠతో ఎదురు చూసిన పీడీసీసీబీ అవిశ్వాస తీర్మాన వ్యవహారం ఫిరాయింపు ఎమ్మెల్యేలకు తొలి విజయాన్ని అందింది.

 - ‘పీడీసీసీబీ అవిశ్వాçÜం’ అంశానికి తాత్కాలిక తెర
- బ్యాంకు చైర్మన్‌కు ఫిరాయింపుల ఎమ్మెల్యేల మద్దతు
- వైస్‌ చైర్మన్‌కు దామచర్ల, మంత్రి, కరణం, ఏలూరు మద్దతు
- మెజార్టీ డైరక్టర్ల మద్దతు చైర్మన్‌కే...S
- అధిష్టానానికి కొత్త ఎమ్మెల్యేల ఫిర్యాదు
- ఓడిపోయి పార్టీ పరువు బజారుకీడ్చద్దంటూ బాబు, లోకేష్‌ సూచన
- ఈదర మోహన్‌తో మంత్రి శిద్దా, ఎమ్మెల్యే దామచర్ల చర్చలు
- వైస్‌ చైర్మన్‌తో రాజీనామా చేయిస్తామంటూ వేడుకోలు
- ఎట్టకేలకు అంగీకారం తెలిపిన చైర్మన్‌
- అవిశ్వాస సమావేశానికి చైర్మన్‌ సహా డైరక్టర్లు డుమ్మా 
---------------------------------------
సాక్షి ప్రతినిధి,ఒంగోలు:
అందరూ ఉత్కంఠతో ఎదురు చూసిన పీడీసీసీబీ అవిశ్వాస తీర్మాన వ్యవహారం ఫిరాయింపు ఎమ్మెల్యేలకు తొలి విజయాన్ని అందింది. పార్టీ జిల్లా అధ్యక్షుడు దామచర్ల, మంత్రి శిద్దా రాఘవరావు, సీనియర్‌ నేత కరణం, పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావులతో కూడిన పాత నేతలకు పరాభవాన్ని మిగిల్చింది. టీడీపీ పాత, కొత్త నేతల మధ్య నెలకొన్న వర్గవిబేధాల నేపథ్యంలో పీడీసీసీబీ వివాదం శిఖరాగ్రానికి చేరింది. చివరకు ముఖ్యమంత్రి చంద్రబాబు, చినబాబు లోకేష్‌ల జోక్యంతో ఈ రచ్చకు తాత్కాలికంగా తెరపడింది. చైర్మన్‌ ఈదర మోహన్‌ విజయం సాధించగా... వైస్‌ చైర్మన్‌ మస్తానయ్యకు రాజీనామా గండం తప్పలేదు.  
రచ్చకెక్కిన విభేదాలు..
పీడీసీసీబీ చైర్మన్‌ ఈదర మోహన్, వైస్‌ చైర్మన్‌ మస్తానయ్యల మధ్య ఇటీవల విభేదాలు పొడచూపాయి. వీరి గొడవ పీడీసీసీబీకి పాకింది. పీడీసీసీబీలో అవినీతి జరిగిందంటూ వైస్‌ చైర్మన్‌ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో వివాదం ముదిరి పాకానపడింది. వైస్‌ చైర్మన్‌ మస్తానయ్యపై చైర్మన్‌ వర్గం అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది. గత నెల 10న అవిశ్వాస తీర్మానం జరగాల్సి ఉంది. మస్తానయ్యకు మద్దతు పలికిన టీడీపీ జిల్లా అధ్యక్షుడు దామచర్ల జనార్దన్, ఆ పార్టీ సీనియర్‌ నేత కరణం బలరాం, పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు, మంత్రి శిద్దా రాఘవరావుల వర్గం అవిశ్వాస తీర్మానాన్ని నిలిపివేయాలంటూ బ్యాంకు చైర్మన్‌పై ఒత్తిడి తెచ్చారు. అందుకు ఆయన ససేమిరా అనడంతో ఆగ్రహించిన అధికార పార్టీ నేతలు మస్తానయ్యకు గట్టి మద్దతు ప్రకటించారు. దీంతో అవిశ్వాస సమావేశం జరగకుండా సహకార శాఖ మంత్రి ద్వారా మినిస్టర్‌ స్టే తెచ్చుకున్నారు.
పాత నేతలపై ఈదర ధిక్కారం..
వైస్‌ చైర్మన్‌కు మద్దతు పలికిన పాత నేతలపై చైర్మన్‌ ఈదర మోహన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్థిక వ్యవస్థపై రాజకీయ జోక్యం తగదంటూ విమర్శలు గుప్పించారు. అంతటితో వదలక అవిశ్వాçÜం కోసం కోర్టును ఆశ్రయించారు. చివరకు కోర్టు అవిశ్వాస తీర్మానానికి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఇదే సమయంలో అధికార పార్టీ పాత నేతల వర్గం ఈదర మోహన్‌పై ఆగ్రహం పెంచుకుంది. గత నెలలో ఒంగోలులో జరిగిన ముఖ్యమంత్రి సమావేశానికి పీడీసీసీబీ చైర్మన్‌ హోదాలో మోహన్‌ హాజరుకాగా, పేరు లేదంటూ పోలీసులు ఆయనను బయటకు నెట్టి వేశారు. దీంతో ఆయన అవమానభారంతో వెనుతిరగాల్సి వచ్చింది. 
కలిసొచ్చిన అధికార పార్టీ వర్గవిభేదాలు
టీడీపీ వర్గవిభేదాల వ్యవహారం మోహన్‌కు కలిసొచ్చింది. పాత నేతలపై అక్కసుతో చీరాల ఎమ్మెల్యే ఆమంచితో పాటు ఫిరాయింపు ఎమ్మెల్యేలు గొట్టిపాటి రవికుమార్, ముత్తుముల అశోక్‌రెడ్డి, పోతుల రామారావులు తదితరుల కోటరీ తనకు మద్దతు పలకడంతో మోహన్‌ పాత నేతలతో అమీతుమీకి సిద్ధమయ్యారు. ఇదే సమయంలో అవిశ్వాçÜం నిర్వహించాలంటూ కోర్టు తీర్పునిచ్చింది. దీంతో 26న అవిశ్వాస తీర్మానానికి అధికారులు రంగం సిద్ధం చేశారు. 
ఈదర మోహన్‌కు మెజార్టీ..
20 మంది సభ్యులున్న పీడీసీసీబీలో మెజార్టీకి అవసరమైన 14 మంది సభ్యుల మద్దతు చైర్మన్‌కు ఉండగా, కేవలం ఆరుగురే వైస్‌ చైర్మన్‌ పక్కన నిలిచారు. దీంతో మస్తా¯Œæరావుకు మద్దతిచ్చిన పాత టీడీపీ వర్గం ఓటమి తప్పనిసరైంది. 
ఫిరాయింపు ఎమ్మెల్యేల ఫిర్యాదు
ఇదే సమయంలో ఫిరాయింపు ఎమ్మెల్యేల కోటరీ ముఖ్యమంత్రితో పాటు లోకేష్‌లకు అధికార పార్టీల్లో చిచ్చుపెడుతున్నారంటూ పాత నేతలపై ఫిర్యాదు చేసింది. అవిశ్వాçÜం ఓడినా... నెగ్గినా అధికార పార్టీ పరువు బజారున పడుతుందని, అందుకు కారణం పాత నేతలే అన్న వాదన వినిపించింది. దీంతో స్పందించిన సీఎం చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్‌లు అవిశ్వాస తీర్మాన సమావేశం జరగకుండా సర్దుబాటు చేయాలంటూ జిల్లా పార్టీ అధ్యక్షుడుతో పాటు మంత్రి శిద్దాను ఆదేశించినట్లు సమాచారం. 
పాత నేతలకు భంగపాటు..
అధిష్టానం ఆదేశాలతో పాత నేతల వర్గం చైర్మన్‌తో చర్చలు జరిపింది. తొలుత ఆయన ససేమిరా అన్నారు. దీంతో మరింత తగ్గిన పాత నేతలు మస్తానయ్యతో రాజీనామా చేయిస్తామంటూ ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. అయితే రాజీనామా చేసిన తర్వాతనే తాను రాజీకి వస్తానంటూ మోహన్‌ పట్టుపట్టారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఎమ్మెల్యే జనార్దన్‌ మస్తానయ్యతో రాజీనామా లేఖను తీసుకున్నారు. ఒకటిన్నర నెలలో రాజీనామాను తామే ఆమోదింపజేస్తామంటూ హామీ ఇచ్చారు. అనంతరం తనకు మద్దతు పలుకుతున్న ఫిరాయింపు ఎమ్మెల్యేలతో చర్చించిన ఈదర వారి సూచనల మేరకు సర్దుబాటుకు సిద్ధమయ్యారు.
 
ప్రత్యర్థిని రాజీనామా చేయించేందుకు అధికార పార్టీ పాత నేతలు హామీ సిద్ధపడటంతో అవిశ్వాస తీర్మాన సమావేశానికి గైర్హాజరయ్యేందుకు చైర్మన్‌వర్గం అంగీకారం తెలిపింది. దీంతో చైర్మన్‌తో సహా డైరెక్టర్లలెవరూ మంగళవారం జరగాల్సిన అవిశ్వాస తీర్మానానికి హాజరుకాలేదు. ఎట్టకేలకు మస్తానయ్యకు మద్దతు పలికిన పాత టీడీపీ వర్గానికి భంగపాటు తప్పకపోగా, తొలిసారిగా ఫిరాయింపు ఎమ్మెల్యేల వర్గం పీడీసీసీబీ వేదికగా పైచేయి సాధించడం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement