ఉద్యోగ కల్పన లక్ష్యంగా కేంద్రాలు
ఉద్యోగ కల్పన లక్ష్యంగా కేంద్రాలు
Published Wed, Aug 3 2016 7:40 PM | Last Updated on Sat, Apr 6 2019 9:11 PM
తణుకు టౌన్: యూనివర్సిటీ పరిధిలోని కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఉద్యోగం కల్పించాలనే లక్ష్యంతో ప్లేస్‌మెంట్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నట్టు ఆదికవి నన్నయ వర్సిటీ వీసీ ఎం.ముత్యాలనాయుడు తెలిపారు. తణుకు ఎస్‌కేఎస్‌డీ మహిళా కళాశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన మానవ వనరుల అభివద్ధి కేంద్రాన్ని బుధవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మాట్లాడుతూ ఏటా యూనివర్సిటీ పరిధిలోని కళాశాలల నుంచి 30 వేల మంది డిగ్రీలు చదివి బయటకు వస్తున్నారని, వారందరికీ చదువుతో పాటు నైపుణ్యాలు అందించాలనే లక్ష్యంతో కాకినాడకు చెందిన వికాస సంస్థ ఆధ్వర్యంలో ప్లేస్‌మెంట్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. యూనివర్సిటీ పరిధిలో తొలి మానవ వనరుల అభివద్ధి కేంద్రాన్ని తణుకులో ప్రారంభిస్తున్నామని, ఇది విజయవంతమైతే మరో 20 కేంద్రాలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇవి నిరుద్యోగులకు సమాచార, శిక్షణ కేంద్రాలుగా పనిచేస్తాయన్నారు.
నైపుణ్య శిక్షణ..
కాకినాడ వికాస కేంద్రం ప్లేస్‌మెంట్ అధికారి పి.శ్రీకాంత్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ స్కిల్ డెవలప్‌మెంట్ సొసైటీ ద్వారా నిరుద్యోగులకు నైపుణ్య శిక్షణ అందిస్తామన్నారు. కళాశాల కరస్పాండెంట్ చిట్టూరి సుబ్బారావు మాట్లాడుతూ చదువుతో నైపుణ్యాలు ఒడిసిపట్టుకుంటే yì గ్రీ పూర్తి కాగానే ఉద్యోగం సాధించవచ్చన్నారు. ప్రిన్సిపాల్ పి.అరుణ, కోశాధికారి నందిగం సుధాకర్, చిట్టూరి సత్య ఉషారాణి, ఏవో డాక్టర్ డి.సుబ్బారావు, డాక్టర్ జె.చంద్రప్రసాద్, నన్నయ వర్సిటీ ప్లేస్‌మెంట్ అధికారి డాక్టర్ డి.జగన్మోహన్‌రెడ్డి, కార్పొరేట్ ట్రెయినీ రవి, కళాశాల ప్లేస్‌మెంట్ అధికారి డాక్టర్ కె.రాధాపుష్పావతి, ట్రై నర్ సంతోష్‌కుమార్, వి.వెంకటేశ్వరరావు, యూ.లక్ష్మీసుందరిబాయి పాల్గొన్నారు.
Advertisement
Advertisement