in tanuku
-
87 సిలిండర్లు స్వాధీనం
తణుకు టౌన్: తణుకులో డివిజనల్ సివిల్ సప్లయీస్ అధికారులు నిర్వహించిన దాడుల్లో 87 గ్యాస్ సిలిండర్లు స్వాధీనం చేసుకున్నట్టు డీటీ డి.అశోక్‌వర్మ తెలిపారు. బుధవారం కొవ్వూరు డివిజనల్ ఏఎస్ఓ ఆనందబాబు ఆధ్వర్యంలో తణుకులోని వివిధ హోటళ్లు, రెస్టారెంట్లు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు, బడ్డీ వ్యాపారులు వినియోగిస్తున్న గ్యాస్ సిలిండర్లను తనిఖీ చేశామన్నారు. 87 గృహావసరాల సిలిండర్లను గుర్తించి 50 మందిపై కేసులు నమోదు చేశామని చెప్పారు. వీటిలో 38 ఇండేన్ గ్యాస్, 49 హెచ్‌పీ గ్యాస్ సిలిండర్లు ఉన్నాయని చెప్పారు. వీఆర్ఓలు ఉన్నారు. -
ఫ్లోఫుట్‌బాల్ మ్యాచ్ విజేత నరసాపురం
తణుకు టౌన్ : కోటగిరి విద్యాధరరావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఫ్లోఫుట్‌బాల్ టోర్నమెంటులో భాగంగా శుక్రవారం స్థానిక చిట్టూరి ఇంద్రయ్య మెమోరియల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో తణుకు–నరసాపురం జట్ల మధ్య పోటీ జరిగింది. ఆద్యంతం ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో 2–1 గోల్ తేడాతో నరసాపురం విజయం సాధించినట్లు ఫ్లో సీఈవో రాజేష్ రావూరి తెలిపారు. తొలుత ఈ మ్యాచ్‌ను మాజీ ఎమ్మెల్యే చిట్టూరి వెంకటేశ్వరరావు, వైఎస్సార్సీపీ నాయకుడు కడియాల సూర్యనారాయణ ప్రారంభించారు. శ్యామ్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచారు. ఈ సందర్భంగా లావా మొబైల్ సంస్థ నిర్వహించిన లక్కీడిప్‌లో జి. ఏసురాజు మొబైల్ ఫోన్ గెలుచుకున్నారు. మ్యాచ్ కో-ఆర్డినేటర్ డి. రంగారావు, కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం.శ్యాంబాబు, వైఎస్సార్ సీపీ పట్టణ అధ్యక్షుడు ములగాల శ్రీనివాస్, వైఎస్సార్ సీపీ ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు కౌరు వెంకటేశ్వర్లు, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆకులు వెంకటేశ్వరరావు, వైఎస్ సేవాదళ్ నాయకుడు అంబటి రాఘవ, లావా మొబైల్ ప్రతినిధులు, లయన్స్ క్లబ్ సభ్యులు, విద్యార్థులు మ్యాచ్‌ను తిలకించారు. ఫొటోరైటప్: 06టీఎన్కెసియూఎల్ 06– హోరాహోరీగా తలపడుతున్న నరసాపురం, తణుకు జట్లు -
టేబుల్ టెన్నిస్ పోటీల విజేతలు వీరే..!
తణుకు టౌన్ : ఎస్‌కేఎస్‌డీ మహిళా కళాశాలలో ఆదికవి నన్నయ యూనివర్సిటీ అంతర కళాశాలల టేబుల్ టెన్నిస్ పోటీలు మంగళవారంతో ముగిశాయి. బాలుర విభాగంలో అనపర్తికి చెందిన జీబీఆర్ కళాశాల విద్యార్థులు విజేతలుగా నిలవగా. గొల్లల మామిడాడకు చెందిన డీఎల్ఆర్ కళాశాల విద్యార్థులు రన్నర్స్‌గా నిలిచారు. రాజమండ్రి ఎస్‌కేవీటీ కళాశాల విద్యార్థులు తృతీయస్థానం, రామచంద్రాపురం వీఎస్ఎం కళాశాల విద్యార్థులు నాలుగోస్థానం పొందారు. బాలికల విభాగంలో రామచంద్రాపురం వీఎస్ఎం కళాశాల విద్యార్థినులు విన్నర్స్‌గా, తణుకు ఎస్‌కేఎస్‌డీ విద్యార్థినులు రన్నర్స్‌గా, రాజమండ్రి ఎస్‌కేవీటీ విద్యార్థినులు తృతీయస్థానం స్థానం పొందినట్టు చెప్పారు. ఈ సందర్భంగా మంగళవారం కళాశాలలో నిర్వహించిన కార్యక్రమంలో విజేతలకు కళాశాల కరస్పాండెంట్ చిట్టూరి సుబ్బారావు, ఏఎంసీ కళాశాల డైరెక్టర్ డాక్టర్ జె.చంద్రప్రసాద్, ఆదికవి నన్నయ స్పోర్ట్స్ బోర్డు కార్యదర్శి ఎ.సత్యనారాయణ, పీడీలు పాల్గొన్నారు. -
విజయం కోసం పోటాపోటీ..
తణుకు అర్బన్ : జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో 62వ అంతర జిల్లాల క్రీడా పోటీలు తణుకు జెడ్పీ బాయ్స్ హైస్కూలులో శనివారం ప్రారంభమయ్యాయి. డీవైఈవో జంగం స్వామిరాజు అధ్యక్షతన జరిగిన ప్రారంభ సభకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. విద్యతోపాటు క్రీడలకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. విద్యార్థులు క్రీడల ద్వారా కూడా ఉన్నత స్థానాలకు చేరుకోవచ్చని అన్నారు. ఈ పోటీలకు 13 జిల్లాలకు చెందిన క్రీడాకారులు హాజరయ్యారు. తొలిరోజు అండర్–14 బాస్కెట్‌బాల్, అండర్–17 టేబుల్ టెన్నిస్ విభాగాల్లో బాలురు, బాలికల మ్యాచ్‌లు ఉత్కంఠ భరితంగా సాగాయి. కార్యక్రమంలో మునిసిపల్ చైర్మన్ డాక్టర్ దొమ్మేటి వెంకట సుధాకర్, వైస్ చైర్మన్ మంత్రిరావు వెంకటరత్నం, కౌన్సిలర్లు మల్లిన రాధాకృష్ణ, పరిమి వెంకన్నబాబు, జెడ్పీటీసీ ఆత్మకూరి బులి దొరరాజు, పాఠశాల ఎస్ఎంసీ చైర్మన్ మునుకుట్ల రామారావు, జాతీయ బాస్కెట్ బాల్ క్రీడాకారులు నల్లజర్ల వెంకన్న, ఎంఈవో ఎస్.శ్రీనివాసరావు, రాష్ట్ర క్రీడాధికారి పేరం రవీంద్రనాథ్, ఎస్జీఎఫ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎ.శ్రీనివాస్, హెచ్ఎం నారగాని రమేష్, ప్రాంతీయ క్రీడాధికారి పీఎస్ సుధాకర్ పాల్గొన్నారు. లీగ్ విజేతలు వీరే... తొలిరోజు బాస్కెట్ బాల్ అండర్ 14 బాలుర విభాగంలో శ్రీకాకుళం జట్టుపై 22–1 తేడాతో విశాఖపట్నం జట్టు, గుంటూరుపై 25–13 తేడాతో అనంతపురం, విజయనగరంపై 26–3 తేడాతో కృష్ణా జిల్లా జట్లు గెలుపొందాయి. బాలికల విభాగంలో కర్నూలుపై 11–6 తేడాతో పశ్చిమ గోదావరి, విశాఖపై 18–4 తేడాతో తూర్పుగోదావరి గెలిచినట్లు తెలిపారు. టేబుల్ టెన్నిస్ విభాగంలో.. టేబుల్ టెన్నిస్ అండర్–17 బాలికల విభాగంలో కృష్ణా, అనంతరపురం, విశాఖ, తూర్పు గోదావరి జిల్లా జట్లు వరుసగా విజయం సాధించాయి. బాలుర విభాగంలో అనంతపురం, విశాఖపట్నం, కృష్ణా, తూర్పు గోదావరి జట్లు విజయం సాధించినట్టు నిర్వాహకులు తెలిపారు. -
పురపాలక సంఘాలు ఆదాయాన్ని పెంచుకోవాలి
తణుకు : తణుకు మునిసిపల్ కార్యాలయాన్ని డైరెక్టర్ ఆఫ్ మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ కె.కన్నబాబు శనివారం సందర్శించారు. ఈ సందదర్భంగా పలు రికార్డులను పరిశీలించిన ఆయన పురపాలక సంఘం ఆదాయ వనరులను పెంచుకోవాలని సూచించారు. దీనిపై మునిసిపల్ అధికారులతో చర్చించారు. ముఖ్యంగా మునిసిపల్ షాపింగ్ కాంప్లెక్స్‌ల నిర్మాణం చేపట్టాలన్నారు. కంపోస్టు యార్డు ఆధునికీకరణ, విద్యుత్ ఉత్పత్తికి తీసుకునే చర్యలు, సంతమార్కెట్ ఆధునికీకరణ, గోస్తనీ బండ్ రోడ్డు నిర్మాణం వంటి అంశాలను చర్చించారు. ఈ సందర్భంగా పెండింగ్ పనుల నిర్మాణానికి సంబం«ధించిన ని««దlుల మంజూరు అంశాన్ని మునిసిపల్ చైర్మన్ డాక్టర్ దొమ్మేటి వెంకట సుధాకర్, వైస్ చైర్మన్ మంత్రిరావు వెంకటరత్నం, కౌన్సిలర్లు పరిమి వెంకన్నబాబు, కలగర వెంకటకృష్ణ తదితరులు ఆయన దృíష్టికి తీసుకువచ్చారు. అనంతరం పట్టణంలోని తాగునీటి ప్రాజెక్టును పరిశీలించారు. మునిసిపల్ కమిషనర్ ఎన్.అమరయ్య, డీఈఈ సీహెచ్ శ్రీనివాస్ పాల్గొన్నారు. -
ఉద్యోగ కల్పన లక్ష్యంగా కేంద్రాలు
తణుకు టౌన్: యూనివర్సిటీ పరిధిలోని కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఉద్యోగం కల్పించాలనే లక్ష్యంతో ప్లేస్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నట్టు ఆదికవి నన్నయ వర్సిటీ వీసీ ఎం.ముత్యాలనాయుడు తెలిపారు. తణుకు ఎస్‌కేఎస్‌డీ మహిళా కళాశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన మానవ వనరుల అభివద్ధి కేంద్రాన్ని బుధవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మాట్లాడుతూ ఏటా యూనివర్సిటీ పరిధిలోని కళాశాలల నుంచి 30 వేల మంది డిగ్రీలు చదివి బయటకు వస్తున్నారని, వారందరికీ చదువుతో పాటు నైపుణ్యాలు అందించాలనే లక్ష్యంతో కాకినాడకు చెందిన వికాస సంస్థ ఆధ్వర్యంలో ప్లేస్మెంట్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. యూనివర్సిటీ పరిధిలో తొలి మానవ వనరుల అభివద్ధి కేంద్రాన్ని తణుకులో ప్రారంభిస్తున్నామని, ఇది విజయవంతమైతే మరో 20 కేంద్రాలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇవి నిరుద్యోగులకు సమాచార, శిక్షణ కేంద్రాలుగా పనిచేస్తాయన్నారు. నైపుణ్య శిక్షణ.. కాకినాడ వికాస కేంద్రం ప్లేస్మెంట్ అధికారి పి.శ్రీకాంత్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ స్కిల్ డెవలప్మెంట్ సొసైటీ ద్వారా నిరుద్యోగులకు నైపుణ్య శిక్షణ అందిస్తామన్నారు. కళాశాల కరస్పాండెంట్ చిట్టూరి సుబ్బారావు మాట్లాడుతూ చదువుతో నైపుణ్యాలు ఒడిసిపట్టుకుంటే yì గ్రీ పూర్తి కాగానే ఉద్యోగం సాధించవచ్చన్నారు. ప్రిన్సిపాల్ పి.అరుణ, కోశాధికారి నందిగం సుధాకర్, చిట్టూరి సత్య ఉషారాణి, ఏవో డాక్టర్ డి.సుబ్బారావు, డాక్టర్ జె.చంద్రప్రసాద్, నన్నయ వర్సిటీ ప్లేస్మెంట్ అధికారి డాక్టర్ డి.జగన్మోహన్రెడ్డి, కార్పొరేట్ ట్రెయినీ రవి, కళాశాల ప్లేస్మెంట్ అధికారి డాక్టర్ కె.రాధాపుష్పావతి, ట్రై నర్ సంతోష్‌కుమార్, వి.వెంకటేశ్వరరావు, యూ.లక్ష్మీసుందరిబాయి పాల్గొన్నారు.