పురపాలక సంఘాలు ఆదాయాన్ని పెంచుకోవాలి
Published Sat, Sep 24 2016 11:50 PM | Last Updated on Mon, Sep 4 2017 2:48 PM
తణుకు : తణుకు మునిసిపల్ కార్యాలయాన్ని డైరెక్టర్ ఆఫ్ మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ కె.కన్నబాబు శనివారం సందర్శించారు. ఈ సందదర్భంగా పలు రికార్డులను పరిశీలించిన ఆయన పురపాలక సంఘం ఆదాయ వనరులను పెంచుకోవాలని సూచించారు. దీనిపై మునిసిపల్ అధికారులతో చర్చించారు. ముఖ్యంగా మునిసిపల్ షాపింగ్ కాంప్లెక్స్‌ల నిర్మాణం చేపట్టాలన్నారు. కంపోస్టు యార్డు ఆధునికీకరణ, విద్యుత్ ఉత్పత్తికి తీసుకునే చర్యలు, సంతమార్కెట్ ఆధునికీకరణ, గోస్తనీ బండ్ రోడ్డు నిర్మాణం వంటి అంశాలను చర్చించారు. ఈ సందర్భంగా పెండింగ్ పనుల నిర్మాణానికి సంబం«ధించిన ని««దlుల మంజూరు అంశాన్ని మునిసిపల్ చైర్మన్ డాక్టర్ దొమ్మేటి వెంకట సుధాకర్, వైస్ చైర్మన్ మంత్రిరావు వెంకటరత్నం, కౌన్సిలర్లు పరిమి వెంకన్నబాబు, కలగర వెంకటకృష్ణ తదితరులు ఆయన దృíష్టికి తీసుకువచ్చారు. అనంతరం పట్టణంలోని తాగునీటి ప్రాజెక్టును పరిశీలించారు. మునిసిపల్ కమిషనర్ ఎన్.అమరయ్య, డీఈఈ సీహెచ్ శ్రీనివాస్ పాల్గొన్నారు.
Advertisement