nanayya university
-
దేశంలో యువశక్తి అపారం
రాష్ట్ర ఉన్నత విద్యా శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి ఆదిత్యనా«థ్ దాస్ నన్నయలో ముగిసిన యూత్ ఫెస్టివల్ రాజరాజనరేంద్రనగర్ (రాజానగరం) : ప్రపంచంలో ఏ దేశానికి లేని యువశక్తి దేశంలోనే ఉందని రాష్ట్ర ఉన్నత విద్యా శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ అన్నారు. ఆదికవి నన్నయ యూనివర్సిటీలో ఎ¯ŒSఎస్ఎస్ ఆధ్వర్యంలో రెండు రోజులపాటు జరిగిన యువజనోత్సవాలు మంగళవారం ముగిశాయి. ముగింపు సమావేశంలో ఆదిత్యనాథ్ మాట్లాడుతూ విపత్తు సమయాలలో ఎ¯ŒSఎస్ఎస్ వలంటీర్లు ‘మానవసేవయే పరమావధి’గా సేవలందిస్తారన్నారు. అటువంటి వారి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని కొత్త ఉత్తేజాన్ని, శక్తిని పొందాలనే స్వార్థం కూడా ఉందన్నారు. వైద్యుని తరువాత స్థానం గురువుదే... తల్లిదండ్రులకు, భగవంతునికి మధ్య వారధిగా గురువే నిలుస్తాడని ప్రముఖ సినీనటి, డబ్బింగ్ ఆర్టిస్టు రోజారమణి అన్నారు. విద్యార్థులకు క్రమశిక్షణను అలవర్చి సమాజానికి మంచి పౌరులను అందించేందుకు తాపత్రయపడతాడన్నారు. సంఘ సేవ చేసే వారంటే అభిమానంతో ఈ కార్యక్రమానికి వచ్చానని యువ హీరో తరుణ్ అన్నారు. చేసే పనిపై శ్రద్ధ ఉండాలని, మనసు పెట్టి చేస్తే ఏపనికైనా విజయం లభిస్తుందన్నారు. తల్లిదండ్రులను గౌరవించడంలో తరుణ్ ఆదర్శనీయుడని కార్యక్రమానికి అధ్యక్షత వహించిన నన్నయ వీసీ ఆచార్య ఎం. ముత్యాలునాయుడు అన్నారు. ఈయనను తరుణ్ వ్యక్తిత్వాన్ని ఆదర్శంగా తీసుకోవాలని విద్యార్థులకు సూచించారు. విజేతలకు బహుమతి ప్రదానం యువజనోత్సవాలలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని 19 యూనివర్సిటీల నుంచి వచ్చిన సుమారు 500 మంది విద్యార్థుల హాజరైనట్టు ఎ¯ŒSఎస్ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ ఎ¯ŒS.కిరణ్‌చంద్ర తెలిపారు. వీరికి రంగోళి, మోనో యాక్షన్, డ్రమ్స్, తబళా, మిమిక్రీ, క్విజ్, జానపద, సాంప్రదాయ నృత్యాలు, సినీ డాన్సులు, గ్రూప్ డా¯Œ్స, చిత్రలేఖనం, పాటలు, డిబేట్ తదితర 14 విభాగాలలో పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో నన్నయ వర్సిటీ విద్యార్థులు ఓవరాల్ ఛాంపియ¯ŒS షిప్‌ని కైవసం చేసుకున్నారు. విజేతలకు అతిథులు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆదిత్యనాథ్‌ను ఘనంగా సత్కరించారు. వర్సిటీ రిజిస్టార్ ఆచార్య ఎ. నరసింహారావు, రాష్ట్ర ఎ¯ŒSఎస్ఎస్ అధికారి పి. రామచంద్రరావు, ఏయూ అధికారి ఎ¯ŒSడీ పాల్, ప్రిన్సిపాల్స్ ఆచార్య కేఎస్ రమేష్, ఆచార్య పి. సురేష్‌వర్మ, డాక్టర్ పి.సుబ్బారావు, డాక్టర్ ఎ.మట్టారెడ్డి, డీ¯Œ్స ఆచార్య ఎస్.టేకి, డాక్టర్ వై.శ్రీనివాసరావు, డాక్టర్ పి.వెంకటేశ్వర్రావు, సహాయ అధ్యాపకులు డాక్టర్ కేవీఎ¯ŒSడీ ప్రసాద్, డాక్టర్ ఆర్వీఎస్ దొర, డాక్టర్ ఎలీషాబాబు తదితరులు పాల్గొన్నారు. -
నటనకు శ్రీకారం చుట్టింది ఇక్కడే..
గోదారి గడ్డ అంటే అందుకే అభిమానం సినీ నటుడు రాజేంద్రప్రసాద్ రాజరాజనరేంద్రనగర్ (రాజానగరం) : తూర్పు గోదావరి జిల్లా అంటే తనకు ఎంతో అభిమానమని, ముఖ్యంగా నటుడిగాను, హీరోగాను శ్రీకారం చుట్టింది రాజమహేంద్రవరంలోనేనని ప్రముఖ సినీ నటుడు, మూవీ ఆర్టిస్టŠస్ అసోసియేష¯ŒS (మా) అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ అన్నారు. అందుకే తనకు ఈ జిల్లా అన్నా, ఈ ప్రాంతమన్నా అభిమానమని చెప్పారు. ఆదికవి నన్నయ యూనివర్సిటీలో ప్రారంభమైన ఎ¯ŒSఎస్ఎస్యూత్ ఫెస్టివల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన విలేకర్లతో మాట్లాడారు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే.. ∙‘లేడీస్ టైలర్’ షూటింగ్ పూర్తయి హైదరాబాద్ వెళ్లిన తరువాత కూడా ఎవరైనా పిలిస్తే ‘ఆయ్’ అంటూ.. ఇక్కడి మాండలీక ప్రభావం నుంచి కొన్ని రోజులు బయటపడలేదు. గ్రామీణ ప్రాంతాల్లో ఎవరిని పలకరించినా వారి మాటల్లో కూడా ‘ఎటకారం’ ఉండేది. ∙‘క్విక్ గ¯ŒS మురుగ¯ŒS’ చిత్రం ద్వారా హాలీవుడ్ సినిమాలో హీరోగా నటించిన తొలి తెలుగు నటుడుగా గుర్తింపు లభించడం ఒకింత గర్వంగా ఉంది. నిజానికి మన తెలుగు సినిమా స్థాయి నేడు అంతర్జాతీయ స్థాయి వెళ్తోంది. బాహుబలి, శాతకర్ణి సినిమాలు అందుకు మార్గం చూపాయి. ∙మా అబ్బాయిని హీరోను చేద్దామనుకున్నాను. కానీ, అతడికి వ్యాపారాలపైనే ఎక్కువ ఆసక్తి ఉండటంతో ఫోర్స్ చేయలేదు. ∙మా ద్వారా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నవారి గురించి సర్వే చేసి కంప్యూటరీకరిస్తాం. వీరిని రెడ్, ఎల్లో, గ్రీ¯ŒS అనే మూడు కేటగిరీలుగా విభజించి, వారి అవసరాలు ఏమిటో తెలుసుకుని తదనుగుణంగా చర్యలు తీసుకుంటాం. రెడ్ కేటగిరీలో ఉన్న వారందరికీ నా హయాం పూర్తయ్యేలోగా బైకులు కొనిస్తాం. ఈ పని ఇంతవరకూ ఎవ్వరూ చేయలేదు. ∙మన చరిత్ర, సంస్కృతుల గురించి పౌరాణిక చిత్రాల ద్వారా నేటి తరాలకు తెలియజేయవలసిన అవసరం ఉంది. బాహుబలి, శాతకర్ణి సినిమాలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్న తరుణంలో పౌరాణిక చిత్రాలను కూడా ఆదరిస్తారనే నమ్మకం కలుగుతోంది. అయితే వీటిని చిత్రీకరించడం గతంలో మాదిరిగా తేలికైన విషయం కాదు. ఎంతో ఖర్చుతో కూడిన వ్యవహారం. ప్రత్యేక హోదాపై నో కామెంట్ ఏపీకి ప్రత్యేక హోదా విషయమై స్పందించేందుకు రాజేంద్రప్రసాద్ నిరాకరించారు. ‘నో కామెంట్’ అంటూ తప్పించుకున్నారు. తమిళనాడులో జల్లికట్టు కోసం అక్కడి సినీ పరిశ్రమ అంతా ఏకమై స్పందించిన విషయాన్ని ప్రస్తావించగా.. ‘తాను వివాదాలకు దూరంగా ఉంటానని, అందుకే ప్రత్యేక హోదాపై మాట్లాడలేకపోతున్నానని అన్నారు. అయినా ఆలోచిస్తానని చెప్పారు. -
రవీంద్రుడు గొప్ప తత్వవేత్త
ఎందరికో స్ఫూర్తి ప్రదాత ‘విశ్వకవి’ పదానికి నిజమైన అర్థం ప్రముఖ సాహితీవేత్త, సినీనటుడు గొల్లపూడి మారుతీరావు రాజరాజనరేంద్రనగర్ (రాజానగరం) : విశ్వకవి రవీంద్రనా«థ్ ఠాగూర్ గొప్ప తత్వవేత్తని ప్రముఖ సాహితీవేత్త, సినీనటుడు గొల్లపూడి మారుతీరావు తెలిపారు. ఆయన రచనల్లో భాషా భేదం లేకుండా ఎందరో కవులను ప్రభావితం చేస్తూ ‘విశ్వకవి’ పదానికి నిజమైన అర్థంగా నిలిచారని కొనియాడారు. ఆదికవి నన్నయ యూనివర్సిటీలో తెలుగు శాఖ ఆధ్వర్యంలో ఏపీ ఉన్నత విద్యా మండలి, ఎన్టీఆర్ ట్రస్టుల సహకారంతో ఏర్పాటు చేసిన రెండు రోజుల జాతీయ సదస్సును శనివారం ఆయన జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించారు. తాను 13వ ఏట నుంచే కథలు రాయడం ప్రారంభించానని గొల్లపూడి చెబుతూ తన రచనలపై రవీంద్రుని ప్రభావం ఏ విధంగా పడిందో తెలియజేశారు. చిన్న వయస్సు కావడంతో కొత్త కథలు రాయడానికి సరైన అంశం దొరికేది కాదన్నారు. ఈ తరుణంలో రవీంద్రుని రచనలతో పరిచయం ఏర్పడి, రచనలు చేసేందుకు సబ్జెక్టు కోసం వెదుకులాడవలసిన పరిస్థితి లేకుండా పోయిందన్నారు. ఈ విధంగా ఆయన రచనల ప్రభావం ఏపీలోనే కాకుండా విశ్వమంతా వ్యాపించిం దని తెలిపారు. వాస్తవికతకు అద్దం పట్టే విధంగా ఆయన రచనలు ఉంటాయన్నారు. ఏన్నో రచనల ద్వారా ఎందరికో చైతన్యదీప్తిగా నిలిచిన ఆయనకు 52వ ఏట వచ్చిన ‘నోబుల్ బహుమతి’తోనే గుర్తింపు వచ్చిందన్నారు. అప్పటి వరకూ బెంగాల్లో ఆయనను, ఆయన రచనలను తిట్టని వారు లేరన్నారు. మన ఇంట్లో వారి గొప్పతనం మనకు తెలియదు, పొరుగు వారు పొగిడినప్పుడే అన్నట్టు ఆసియాలో నోబుల్ బహుమతి అందుకున్న తొలి రచయితగా గుర్తింపు వచ్చిన తరువాతే రవీంద్రుడిని, ఆయన రచనలను జగమంతా గుర్తించిందన్నారు. చలం, కృష్ణశాస్త్రి వంటి రచయితలు కూడా ఆయనను అనుసరించేవారని తెలిపారు. నేనింకా పేషెంట్‌నే! జాతీయ సదస్సుగా నిర్వహిస్తున్న ఇక్కడ చిన్న పొరబాటు జరిగిందంటూ గొల్లపూడి అందరినీ ఆశ్చర్యపరిచారు. ‘ఆహ్వాన పత్రం, బ్యానర్లలో తన పేరుకు ముందు డాక్టర్ అని పెట్టారు కానీ, నేను ఇంకా పేషెంట్‌నే’ నంటూ చమత్కరించి, నవ్వించారు. తెలుగు సాహిత్యంపై రవీంద్రుని రచనల ప్రభావం ఎక్కువగానే ఉంటుందని ముఖ్యఅతిథి నన్నయ వర్సిటీ వీసీ ఆచార్య ఎం.ముత్యాలునాయుడు అన్నారు. సదస్సు ప్రత్యేక సంచికను ఆవిష్కరించారు. అనంతరం రవీంద్రుడు రచించి, స్వయంగా ఆలపించిన జాతీయ గీతం వీడియోను ప్రదర్శించారు. ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య కె.ఎస్.రమేష్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో బెనారస్ హిందూ యూనివర్సిటీ రిటైర్డ్ ఆచార్యులు జోశ్యుల సూర్యప్రకాశరావును ఘనంగా సన్మానించారు. రిజిస్ట్రార్ ఆచార్య ఎ. నరసింహారావు, బెనారస్ హిందూ యూనివర్సిటీ ఆచార్యులు బూదాటి వెంకటేశ్వర్లు, పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ రిటైర్డ్ ఆచార్యులు సి.మృణాళిని, బీఈడీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె.సుబ్బారావు, డీ¯ŒS ఆచార్య ఎస్.టేకి, సదస్సు కన్వీనర్ డాక్టర్ కె.వి.ఎ¯ŒS.డి.వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. పద్యాలు చదవడం వల్లే రచయితనయ్యా : గొల్లపూడి రాజరాజనరేంద్రనగర్ (రాజానగరం) : ‘చిన్నతనంలో పద్యాలు చదవమని నా తల్లి చెబుతూ ఉండేది, నేను అలాగే చేసేవాడిని, అందుకనే 13వ ఏటే రచయితను కాగలిగాను’ అని ప్రముఖ సాహితీవేత్త, సినీ నటుడు గొల్లపూడి మారుతీరావు అన్నారు. ఆదికవి నన్నయ యూనివర్సిటీకి వచ్చిన ఆయన శనివారం స్థానిక విలేకరులతో మాట్లాడారు. నేడు పాఠశాలల్లో విద్యార్థులకు పద్యాలు గురించి చెప్పడం మానేసి, ఆంగ్ల భాష రుద్దుడు కార్యక్రమం ఎక్కువగా జరుగుతోందని వ్యాఖ్యానించారు. తెలుగు పద్యం పదికాలాల పాటు గుర్తుండిపోతుందని, పద్యం ద్వారానే భాష మాధుర్యం తెలుస్తుందన్నారు. తెలుగు భాష ఎంతో మధురమైనదని, ఆ మాధుర్యాన్ని పిల్లలకు బాల్యం నుంచే అందించవలసిన అవసరం ఉందన్నారు. నేడు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంను తప్పనిసరి చేయాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రస్తావిస్తూ... చిరుప్రాయం నుంచి తెలుగు భాషను అభ్యసన చేయడం వల్ల వారి హృదయాలలో అది చెరగని ముద్రగా నిలిచిపోతుందన్నారు. ప్రస్తుతం తెలుగు మీడియం లేకుండా చేసే పరిస్థితులు తలెత్తాయంటూ గొల్లపూడి ఆవేదన చెందారు. -
పర్యాటకానికి దేశం ఎంతో అనువైనది
రాజరాజనరేంద్రనగర్ (రాజానగరం) : పర్యాటకరంగానికి మన దేశం ఎంతో అనువైనదని, ఇక్కడ ప్రకృతి సంపదకు కొదవే లేదని ఆదికవి నన్నయ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య ఎ.నరసింహరావు అన్నారు. యూనివర్సిటీలో డిపార్టుమెంట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఆధ్వర్యాన మంగళవారం నిర్వహించిన ప్రపంచ పర్యాటక దినోత్సవ కార్యక్రమాన్ని ఆయన జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించారు. విదేశాలను తలదన్నే రీతిలో పర్యాటకరంగాన్ని అభివృద్ధి చేయడానికి అవసరమైన అన్ని వనరులూ మన దేశంలో ఉన్నాయని ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కేఎస్ రమేష్ అన్నారు. పర్యాటకరంగం ఆవశ్యకత, ప్రాముఖ్యం, అభివృద్ధి తదితర అంశాల గురించి విభాగాధిపతి డాక్టర్ ఎన్.ఉదయ్‌భాస్కర్ వివరించారు. ఈ సందర్భంగా పర్యాటక రంగంపై విద్యార్థులకు క్విజ్, చిత్రలేఖనం, పోస్టర్ ప్రజెంటేషన్లు నిర్వహించి, విజేతలకు బహుమతులు, సర్టిఫికెట్స్ అందజేశారు. ఫొటో ప్రదర్శన కూడా ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో పర్యాటకరంగ అధ్యాపకులు కె.సాయిబాబా, ఐఎస్ఎన్ రాజు తదితరులు పాల్గొన్నారు. -
ఉద్యోగ కల్పన లక్ష్యంగా కేంద్రాలు
తణుకు టౌన్: యూనివర్సిటీ పరిధిలోని కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఉద్యోగం కల్పించాలనే లక్ష్యంతో ప్లేస్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నట్టు ఆదికవి నన్నయ వర్సిటీ వీసీ ఎం.ముత్యాలనాయుడు తెలిపారు. తణుకు ఎస్‌కేఎస్‌డీ మహిళా కళాశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన మానవ వనరుల అభివద్ధి కేంద్రాన్ని బుధవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మాట్లాడుతూ ఏటా యూనివర్సిటీ పరిధిలోని కళాశాలల నుంచి 30 వేల మంది డిగ్రీలు చదివి బయటకు వస్తున్నారని, వారందరికీ చదువుతో పాటు నైపుణ్యాలు అందించాలనే లక్ష్యంతో కాకినాడకు చెందిన వికాస సంస్థ ఆధ్వర్యంలో ప్లేస్మెంట్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. యూనివర్సిటీ పరిధిలో తొలి మానవ వనరుల అభివద్ధి కేంద్రాన్ని తణుకులో ప్రారంభిస్తున్నామని, ఇది విజయవంతమైతే మరో 20 కేంద్రాలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇవి నిరుద్యోగులకు సమాచార, శిక్షణ కేంద్రాలుగా పనిచేస్తాయన్నారు. నైపుణ్య శిక్షణ.. కాకినాడ వికాస కేంద్రం ప్లేస్మెంట్ అధికారి పి.శ్రీకాంత్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ స్కిల్ డెవలప్మెంట్ సొసైటీ ద్వారా నిరుద్యోగులకు నైపుణ్య శిక్షణ అందిస్తామన్నారు. కళాశాల కరస్పాండెంట్ చిట్టూరి సుబ్బారావు మాట్లాడుతూ చదువుతో నైపుణ్యాలు ఒడిసిపట్టుకుంటే yì గ్రీ పూర్తి కాగానే ఉద్యోగం సాధించవచ్చన్నారు. ప్రిన్సిపాల్ పి.అరుణ, కోశాధికారి నందిగం సుధాకర్, చిట్టూరి సత్య ఉషారాణి, ఏవో డాక్టర్ డి.సుబ్బారావు, డాక్టర్ జె.చంద్రప్రసాద్, నన్నయ వర్సిటీ ప్లేస్మెంట్ అధికారి డాక్టర్ డి.జగన్మోహన్రెడ్డి, కార్పొరేట్ ట్రెయినీ రవి, కళాశాల ప్లేస్మెంట్ అధికారి డాక్టర్ కె.రాధాపుష్పావతి, ట్రై నర్ సంతోష్‌కుమార్, వి.వెంకటేశ్వరరావు, యూ.లక్ష్మీసుందరిబాయి పాల్గొన్నారు.