![Delay in selection of Vice Chancellor of Veterinary University](/styles/webp/s3/article_images/2025/02/16/vc.jpg.webp?itok=fkDMRaEO)
సెర్చ్ కమిటీ సమావేశాలు రెండుసార్లు జరిగినా వెల్లడి కాని పేరు
ఓ కీలక వ్యక్తి చక్రం తిప్పుతున్నారంటూ వర్సిటీలో చర్చ
సాక్షి, హైదరాబాద్: పీవీ నరసింహారావు వెటర్నరీ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ ఎంపికలో ఎడతెగని జాప్యం జరుగుతోంది. రెండుసార్లు సెర్చ్ కమిటీలు భేటీ అయినా వీసీని ఎంపిక చేయలేదు. అయితే ప్రభుత్వంలో ఉన్నతస్థాయిలోని ఓ వ్యక్తి తన బంధువు కోసం చక్రం తిప్పుతున్నారా? వెటర్నరీ యూనివర్సిటీలో ఎవరిని కదిపినా ఇవే ప్రశ్నల పరంపర వెల్లువెత్తుతోంది. రాష్ట్రంలోని దాదాపు అన్ని యూనివర్సిటీలకు ఒకేరోజు వీసీలను ఎంపిక చేసి.. ఆ జాబితాను గవర్నర్ ఆమోదానికి సీఎం పంపిన విషయం తెలిసిందే. ఆ జాబితాలో వెటర్నరీ వర్సిటీ వీసీ పేరు లేదు.
» గత డిసెంబర్ 28న తొలిసారిగా సెర్చ్ కమిటీని ఏర్పాటు చేశారు. తమిళనాడు వెటర్నరీ వర్సిటీ వీసీ, పశుసంవర్థక శాఖ సంచాలకులు డాక్టర్ గోపీ, ఐసీఏఆర్ నుంచి డిప్యూటీ డైరెక్టర్ జనరల్ రాఘవేంద్ర భట్‌తో కూడిన ఈ కమిటీ అదే రోజు సమావేశమై వీసీ పోస్టుకు అర్హులైన ముగ్గురు ప్రొఫెసర్ల పేర్లను ప్రభుత్వానికి పంపించింది. కానీ ఆ సెర్చ్‌కమిటీ ప్రతిపాదించిన వారిలో ఒకరిని ఎంపిక చేయలేదు.
» ఈ ఏడాది ఫిబ్రవరి 5న మరోసారి వీసీ ఎంపిక కోసం సెర్చ్ కమిటీ సమావేశమైంది. ఆరోజు నుంచి ఇప్పటివరకు వీసీ ఎంపిక ఏమైందో ఎవరికీ తెలియని పరిస్థితి. రెండో విడత సమావేశమైన సెర్చ్ కమిటీ ఇచి్చన పేర్లలో ముఖ్యమంత్రి ఒకరిని ఎంపిక చేసి గవర్నర్‌కు పంపించాల్సి ఉంటుంది. గవర్నర్ ఆమోదముద్రతో వీసీ నియామకం అధికారికంగా జరుగుతుంది.
అయితే యూనివర్సిటీల చరిత్రలో రెండోసారి సెర్చ్ కమిటీ సమావేశమై అర్హుల జాబితాను ప్రభుత్వానికి పంపినా, వీసీ ఎంపికపై ఏ నిర్ణయమూ తీసుకోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వంలో కీలకమైన వ్యక్తి ఒకరు వీసీ నియామక విషయంలో జోక్యం చేసుకుంటున్నారని వెటర్నరీ వర్సిటీలో చర్చ జరుగుతోంది. వి శ్వసనీయ సమాచారం ప్రకారం వీసీ రేసు లో ప్రొఫెసర్లు చంద్రశేఖర్, పురుషోత్తం, కొండల్‌రెడ్డి, జ్ఞానప్రకాశ్ ఉన్నట్టు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment