15న డీసీసీబీ వైస్‌చైర్మన్ ఎన్నిక
Published Fri, Oct 28 2016 11:44 PM | Last Updated on Sat, Apr 6 2019 9:11 PM
– ఎన్నికల అధికారిగా శ్రీనివాసరెడ్డి నియామకం
కర్నూలు (అగ్రికల్చర్): జిల్లా సహకార కేంద్రబ్యాంకు వైస్ చైర్మన్ ఎన్నిక నవంబరు 15న నిర్వహించనున్నారు. ఈ మేరకు సహకార శాఖ రిజిస్ట్రార్ మురళి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్నికల అధికారిగా డీసీసీబీ ఓఎస్‌డీ శ్రీనివాసరెడ్డి వ్యవహరిస్తారు. ఇటీవలి వరకు డీసీసీబీ చైర్మన్‌గా గుండం సూర్యప్రకాష్‌రెడ్డి వ్యవహరించారు. ఆయన రాజీనామా తర్వాత ఈ పోస్టు ఖాళీగా ఉంది. గతంలో జరిగిన డీసీసీబీ బోర్డు సమావేశంలో వైస్ చైర్మన్ ఎన్నిక నిర్వహించేలా తీర్మానం చేసి సహకార శాఖకు పంపారు. ఈ మేరకు ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఒకే రోజు నామినేషన్లు, ఎన్నికల ప్రక్రియ జరుగుతాయి. ఈ పదవి కోసం ప్రస్తుత డైరెక్టర్లు సుధాకర్, శ్రీనివాసులు, అహ్మద్‌హుసేన్ పోటీ పడుతున్నారు.
Advertisement
Advertisement