Nyak
-
ఉన్నత విద్యలో అధ్యాపకులేరీ?
సాక్షి, హైదరాబాద్; రాష్ట్రంలో ఉన్నత విద్యారంగం అధ్యాపకుల్లేక ఇబ్బందులు పడుతోంది. వేల పోస్టుల భర్తీ లేక కాలేజీల్లో నాణ్యతా ప్రమాణాలు దెబ్బతింటున్నాయి. పోస్టుల భర్తీకి ప్రభుత్వం నుంచి ఆమోదం లభించకపోవడంతో సంబంధిత శాఖలు ఉన్న కొద్ది మంది అధ్యాపకులు, కాంట్రాక్టు సిబ్బందితో బోధనను కొనసాగిస్తున్నాయి. దీంతో ఎంసెట్, నీట్, జేఈఈ మెయిన్, జేఈఈ అడ్వాన్స్డ్ వంటి పరీక్షల్లో ప్రభుత్వ కాలేజీల విద్యార్థులు వెనుకబడుతున్నారు. మరోవైపు అధ్యాపకులు లేని కారణంగానే డిగ్రీ కాలేజీలు, యూనివర్సిటీలకు ఆశించిన స్థాయిలో అభివృద్ధి నిధులు కేంద్రం నుంచి రావడం లేదు. నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రెడిటేషన్ (న్యాక్) గుర్తింపుగల విద్యా సంస్థలకే రాష్ట్రీయ ఉచ్చతర్ శిక్షా అభియాన్ (రూసా) నిధులిస్తామని కేంద్రం గత మూడేళ్లుగా మొత్తుకుంటున్నా అధ్యాపకుల నియామకంలో ఎడతెగని జాప్యం జరుగుతోంది. లేఖలు రాయడానికే పరిమితం.. రాష్ట్రంలోని 404 ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో దాదాపు 2 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. ఆయా కాలేజీల్లో 1,200 పోస్టులు దాదాపు ఏడేళ్లుగా ఖాళీగానే ఉంటున్నాయి. వాస్తవానికి 1,951 పోస్టులు ఖాళీగా ఉన్నప్పటికీ అందులో 751 పోస్టుల్లో గెస్ట్ లెక్చరర్లు పని చేస్తున్నందున కనీసం 1,200 పోస్టుల భర్తీకి అనుమతివ్వాలని ఇంటర్మీడియెట్ విద్యాశాఖ ప్రభుత్వాన్ని ఏళ్ల తరబడి కోరుతూనే ఉంది. ప్రభుత్వం నుంచి అనుమతి లభించకపోవడం, కొత్త జిల్లాల ఏర్పాటు, జోనల్ సమస్యల వంటి కారణాలతో ఆ పోస్టుల భర్తీ ఇప్పటికీ అమలుకు నోచుకోవడం లేదు. ప్రస్తుతం ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో మంజూరైన జూనియర్ లెక్చరర్ పోస్టులు 6,719 ఉండగా 1,040 మంది మాత్రమే రెగ్యులర్ లెక్చరర్లు ఉన్నారు. మిగతా 5,679 పోస్టులు ఖాళీగా ఉండగా, అందులో 3,728 పోస్టుల్లో కాంట్రాక్టు లెక్చరర్లు పనిచేస్తున్నారు. మిగిలిన 1,951 పోస్టుల్లో 1,200 పోస్టులు ఖాళీగా ఉండిపోయాయి. మిగతా 751 పోస్టుల్లో తాత్కాలిక పద్ధతిన గెస్ట్ లెక్చరర్లు (రిటైరైన వారు) బోధిస్తున్నారు. ఆ 1,200 పోస్టుల భర్తీకి అనుమతివ్వాలని ఇటీవల ఇంటర్ విద్యా కమిషనర్‌గా వచ్చిన సయ్యద్ ఉమర్ జలీల్ లేఖ రాసినా ప్రభుత్వం నుంచి సమాధానం రాలేదు. డిగ్రీ కాలేజీల్లోనూ అంతే.. రాష్ట్రంలోని 131 డిగ్రీ కాలేజీల్లోనూ పోస్టుల భర్తీ వ్యవహారం ఏడేళ్లుగా అచరణకు నోచుకోవడం లేదు. డిగ్రీ కాలేజీల్లో మొత్తంగా మంజూరైన పోస్టులు 4,099 ఉండగా అందులో 1,280 పోస్టుల్లోనే రెగ్యులర్ లెక్చరర్లు ఉన్నారు. మిగతా 2,819 పోస్టుల్లో కాంట్రాక్టు లెక్చరర్లు/గెస్ట్ ఫ్యాకల్టీ 1,883 పోస్టుల్లో పనిచేస్తుండగా 936 పోస్టులు ఇప్పటికీ ఖాళీగానే ఉన్నాయి. వాటి భర్తీకి అనుమతివ్వాలని గతంలోనే కోరినా ప్రభుత్వం నుంచి స్పందన రాలేదు. గతేడాది 31 కొత్త జిల్లాల పునర్వ్యవస్థీకరణ, కొత్త జోన్ల ఏర్పాటు, ఆ తరువాత వాటికి రాష్ట్రపతి ఆమోదం లభించినా పోస్టుల భర్తీకి సర్కారు చర్యలు చేపట్టలేదు. ఇక ఇటీవలి కాలంలో మరో 2 కొత్త జిల్లాలను ఏర్పాటు చేయడం, వాటిని కొత్తగా ఏర్పాటు చేసిన జోన్లలో చేరుస్తూ ఫైలు కేంద్రానికి పంపడంతో వాటి భర్తీ పెండింగ్‌లో పడిపోయింది. రాష్ట్రపతి ఆమోదం తరువాతనైనా పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టాలని విద్యార్థి సంఘాలు కోరుతున్నాయి. వర్సిటీల్లోనూ పడని అడుగులు రాష్ట్రంలోని యూనివర్సిటీల్లోనూ పోస్టుల భర్తీ వ్యవహారం ముందుకు కదలట్లేదు. 2016లో కొత్తగా వీసీలను నియమించినా పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టిన దాఖలాలు లేవు. ప్రభుత్వం పోస్టుల భర్తీకి అనుమతిచ్చినా వీసీలు పట్టించుకోలేదు. ఆ తరువాత కోర్టు కేసులు తదితరాలతో భర్తీని పక్కన పెట్టేశారు. ఇక ఇప్పుడైతే పోస్టులను భర్తీ చేసే పరిస్థితి లేదు. యూనివర్సిటీలకు పూర్తిగా ఎగ్జిక్యూటివ్ కౌన్సిళ్లు లేవు. పూర్తిస్థాయి వీసీలు లేరు. ప్రస్తుతం రాష్ట్రంలోని 11 యూనివర్సిటీల్లో మంజూరైన పోస్టులు 2,738 ఉండగా అందులో 1,528 పోస్టులు ఖాళీగానే ఉండిపోయాయి. అందులో 323 ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉండగా 687 అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు, 518 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 2016 నాటికి సేకరించిన లెక్కల ప్రకారమే ఈ ఖాళీలు ఉండగా ఇప్పుడు వాటి సంఖ్య మరింత పెరిగిందని ఉన్నత విద్యాశాఖ వర్గాలే చెబుతున్నాయి. ఖాళీగా ఉన్న 1,528 పోస్టుల్లోనూ మొదటి విడతలో కేవలం 1,061 పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం 2016లోనే నిర్ణయించింది. కనీసం వాటి భర్తీ అయినా ఇంతవరకు ఆచరణకు నోచుకోలేదు. -
‘సివిల్’ పట్టభద్రులకు ఉద్యోగ శిక్షణ
ఎస్సీ అభ్యర్థులకు ప్రభుత్వం కొత్త వరం ‘న్యాక్’ ఆధ్వర్యంలో ప్రత్యేక శిక్షణ సాక్షి, హైదరాబాద్: సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన ఎస్సీ అభ్యర్థుల కోసం ప్రభుత్వం కొత్త పథకాన్ని ప్రవేశ పెట్టింది. శిక్షణ ఇచ్చి, క్యాంపస్ ఇంటర్వూ్యల్లో ఉద్యోగం పొందేలా అభ్యర్థులను తీర్చిదిద్దే బాధ్యతలను నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ (న్యాక్)కు అప్పగించింది. ఈ మేరకు భవన నిర్మాణంలో ప్రతిభకు సాన పట్టి ప్రైవేటు నిర్మాణ సంస్థల్లో ఉద్యోగాలు పొందేలా అభ్యర్థులను న్యాక్ సిద్ధం చేస్తుంది. ఆయా నిర్మాణ సంస్థలను అభ్య ర్థుల ముంగిటకే రప్పించి ప్లేస్మెంట్ చూపిస్తుంది. ఈ కొత్త కార్యాచరణను తాజాగా న్యాక్ ప్రారంభించింది. సివిల్ ఇంజనీరింగ్‌లో బీఈ, బీటెక్ పూర్తి చేసిన ఎస్సీ అభ్యర్థుల్లో ఎక్కువ మంది నిరుద్యోగులుగా ఉన్నట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చింది. దీంతో వారికి ఉపాధి అవకా శాలు కల్పించే బాధ్యతను న్యాక్‌కు అప్పగించింది. ఈ నేపథ్యంలో న్యాక్ డైరెక్టర్ జనరల్ భిక్షపతి.. సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన కొంతమందితో చర్చించి సమస్యకు కారణాలను విశ్లేషించారు. ఇంజనీరింగ్‌లో ప్రాక్టికల్ అవగాహన అవసరమని, ఇందుకు కనీసం మూడు నెలలపాటు భవన నిర్మాణ రంగంలో శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వానికి నివేదించారు. దీనికి ప్రభుత్వం అంగీకరించటంతో బ్యాచ్‌లవారీ శిక్షణకు ప్రణాళిక రూ పొందించారు. భవన నిర్మాణానికి సంబంధించిన సర్వే, ఆటో క్యాడ్, మెటీరియల్ క్వాలిటీ పరీక్ష, ప్లంబింగ్, ఎలక్ట్రికల్ వైరింగ్, సిమెంట్ పని, రంగులు వేయటం వంటి అంశాలపై శిక్షణ ఇస్తారు. మూడు నెలల శిక్షణ తర్వాత నిర్మాణ సంస్థలతో క్యాంపస్ ఇంటర్వూ్యలు ఏర్పాటు చేయనున్నారు. శిక్షణ వ్యయాన్ని ఎస్సీ కార్పొరేషనే భరిస్తుంది. ఇందులో భాగంగా 30 మందితో తొలి శిక్షణ తరగతులు మొదలయ్యాయి. మరో నెల తర్వాత రెండో బ్యాచ్ శిక్షణ ప్రారంభించనున్నారు. -
తెలంగాణ వర్సిటీకి ‘న్యాక్’ గుర్తింపు
డిచ్పల్లి: నిజామాబాద్ జిల్లా డిచ్పల్లిలోని తెలంగాణ యూనివర్సిటీ ప్రతిష్టాత్మక న్యాక్ గుర్తింపు పొందింది. ‘బి ప్లస్’ గ్రేడ్‌తో 2.61 స్కోరింగ్ సాధించింది. జిల్లాకో యూనివర్సిటీ ఉండాలనే ఉద్దేశంతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి నిజామాబాద్ జిల్లాలో తెలంగాణ యూనివర్సిటీని ఏర్పాటు చేశారు. న్యాక్ వెబ్సైట్లో వర్సిటీకి మంచి గ్రేడింగ్‌తో గుర్తింపు ఇచ్చినట్లు బుధవారం సమాచారం అందుబాటులో ఉంచారు. విషయం తెలిసిన వెంటనే రిజిస్ట్రార్ చాంబర్లో రిజిస్ట్రార్ ఆర్.లింబాద్రిని కలసిన అధ్యాపకులు, బోధన, బోధనేతర, ఔట్సోర్సింగ్ సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు. నాన్-టీచింగ్ సిబ్బంది ఆధ్వర్యంలో పరిపాలనా భవనం ఎదుట పటాసులు కాల్చి, మిఠాయిలు పంచి పెట్టారు. న్యాక్ గుర్తింపు అందరి సమష్టి కృషి ఫలితమని రిజిస్ట్రార్ పేర్కొన్నారు. -
‘న్యాక్’ వివాదం కొత్త మలుపు
సీఎం చైర్మన్‌గా కొత్త పాలక మండలి ఏర్పాటు చేసిన తెలంగాణ ప్రభుత్వం రెండ్రోజుల క్రితం ఇదే తరహా ఉత్తర్వులిచ్చిన ఆంధ్రప్రదేశ్ సర్కారు ఇరు రాష్ట్రాల మధ్య మరింత ముదిరిన లొల్లి సాక్షి, హైదరాబాద్: తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల మధ్య నలుగుతున్న నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ (న్యాక్) వివాదం కొత్త మలుపు తిరిగింది. న్యాక్‌కు ఆంధప్రదే శ్ సీఎం చైర్మన్‌గా పాలక మండలిని ఏర్పాటు చేస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వు జారీ చేసిన 48 గంటల్లోనే... తెలంగాణ ప్రభుత్వం పాలక మం డలిని నియమించింది. ముఖ్యమంత్రి చైర్మన్‌గా, రోడ్లు భవనాల శాఖ మంత్రి వైస్ చైర్మన్‌గా, న్యాక్ డీజీ సభ్య కార్యదర్శిగా, మరో 23 మందిని సభ్యులుగా పేర్కొంటూ తెలంగాణ సర్కారు బుధవారం ఉత్తర్వు జారీ చేసింది. దీంతో న్యాక్ విషయంలో రెండు రాష్ట్రాల మధ్య అంతరం మరింత పెరిగింది. ఇప్పటికే పలు సమావేశాల పేరుతో తెలంగాణ సీఎం తరచూ న్యాక్‌కు వెళ్తున్నారు. ఏపీ సీఎం అక్కడికి వెళ్తే పరిస్థితి ఉద్రిక్తంగా మారటం ఖాయమని అధికారులు పేర్కొంటున్నా రు. సొసైటీ జాబితాలో ఉన్నందున న్యాక్ విభజన జరగలేదు. సొసైటీల చట్టాన్ని మార్చనందున న్యాక్ తమకే దక్కుతుందని ఏపీ వాదిస్తుండగా, తెలంగాణలో ఉన్నం దున మాకే చెందుతుందని ఈ ప్రభుత్వం పేర్కొంటోంది. పాలక మండలిలో సభ్యులు వీరే... తెలంగాణ ప్రభుత్వం న్యాక్‌కు ఏర్పాటు చేసిన పాలక మండలి సభ్యులు వీరే.. ముంబైలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్ అండ్ రీసెర్చ్ డీజీ, బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(ఢిల్లీ) అధ్యక్షుడు, ఆ అసోసియేషన్ తెలంగాణ చాప్టర్ చైర్మన్, కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ డెవలప్మెంట్ కౌన్సిల్ (ఢిల్లీ) చైర్మన్, స్ట్రక్చరల్ ఇంజనీర్స్ రీసెర్చ్ కౌన్సిల్ (ఢిల్లీ) డెరైక్టర్, నేషనల్ కౌన్సిల్ ఫర్ క న్‌స్ట్రక్షన్ అండ్ బిల్డింగ్ మెటీరియల్స్ డెరైక్టర్, జేఎన్టీయూ వీసీ, ఇండియన్ కాంక్రీట్ ఇన్స్టిట్యూట్ డెరైక్టర్, సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డీజీ, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ తెలంగాణ చాప్టర్ చైర్మన్, హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సీఎండీ, గృహ నిర్మాణం, ఆర్అండ్బీ, పురపాలక, నీటిపారుదల శాఖల ముఖ్య కార్యదర్శులు, తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ వీసీఎండీ, గృహ నిర్మాణ సంస్థ, పోలీసు గృహ నిర్మాణ సంస్థల ఎండీలు, ఆర్అండ్బీ ఈఎన్సీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ డెరైక్టర్, డీఆర్డీవో అడిషనల్ డీజీలు. చంద్రబాబు నోట నీతులు.. చేతల్లో రోతలు: మంత్రి హరీశ్‌రావు ఏపీ సీఎం చంద్రబాబు నోటితో నీతు లు చెబుతూ రోత పనులకు దిగజారుతున్నారని మంత్రి టి.హరీశ్‌రావు విమర్శించారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కలసి శాసనసభాపక్ష కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ హైదరాబాద్‌లోని ‘న్యాక్’ కేంద్ర గవర్నింగ్ బాడీకి చంద్రబాబే చైర్మన్‌గా నియమించుకోవడం దుర్మార్గానికి పరాకాష్ట అన్నారు. ఫిబ్రవరి దాకా గవర్నింగ్ బాడీకి కాలపరిమితి ఉన్నా ఇప్పటికిప్పుడే చంద్రబాబు స్వయంగా చైర్మన్‌గా నియమించుకోవడం దుర్మార్గం కాదా? అని ప్రశ్నించారు. కేవలం తెలంగాణతో వివాదాలు, గొడవలు పెట్టుకోవడానికే ఈ గవర్నింగ్ బాడీని ఏర్పాటుచేశారని హరీశ్‌రావు విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన నాటినుంచి చంద్రబాబు కుట్రలకు పాల్పడుతూనే ఉన్నాడన్నారు. ఎయిర్‌పోర్టుకు ఎన్టీఆర్ పేరును సమర్థించిన టీటీడీపీ నేతలు హైదరాబాద్ న్యాక్‌కు చంద్రబాబు ఉండాలని సమర్థిస్తరా.. వ్యతిరేకిస్తరా? అని హరీష్‌రావు ప్రశ్నించారు.