వర్సిటీల భౌగోళిక స్వరూపంలో మార్పులు!
Published Sat, Aug 19 2017 12:44 AM | Last Updated on Sun, Apr 7 2019 3:35 PM
- తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోకి నిర్మల్, ఆదిలాబాద్
- శాతవాహన వర్సిటీ పరిధిలోకి మంచిర్యాల, కుమ్రంభీం జిల్లాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పలు విశ్వవిద్యాలయాల భౌగోళిక స్వరూపాలు మారనున్నాయి. ఈ మేరకు ఉన్నత విద్యామండలి నేతృత్వంలోని కమిటీ ప్రభుత్వానికి ఓ నివేదికను అందజేసింది.మార్పులకు ప్రభుత్వం కూడా సుముఖత వ్యక్తం చేసినట్లు తెలిసింది. త్వరలోనే మార్పులతో కూడిన ఉత్తర్వులు వెలువడనున్నాయి. భవిష్యత్తులో మరిన్ని జిల్లాలను కూడా మార్పు చేసేలా కమిటీ సిఫారసు చేసినట్లు తెలిసింది. ప్రస్తుతం కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలు ఉన్నాయి. నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాలను తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోకి తీసుకురానుంది. కుమ్రం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలను శాతవాహన యూనివర్సిటీ పరిధిలోకి తేనుంది. స్థానిక ఎమ్మెల్యేలు దివాకర్‌రావు, నల్లాల ఓదెలు, చెన్నయ్య, సతీష్‌కుమార్, కోవా లక్ష్మి, కోనేరు కోనప్ప తదితరులు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు చేసిన విజ్ఞప్తుల మేరకు ఈ మార్పులు చేసింది.
యూనివర్సిటీల పరిధుల్లోని జిల్లాలు ఇవే..
కాకతీయ యూనివర్సిటీ: వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి, జనగాం, ఖమ్మం, భద్రాద్రి
శాతవాహన యూనివర్సిటీ: కరీంనగర్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల. కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల
తెలంగాణ యూనివర్సిటీ: నిజమాబాద్; కామారెడ్డి, నిర్మల్, ఆదిలాబాద్.
ఉస్మానియా యూనివర్సిటీ: హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్, సిద్దిపేట్, మెదక్, సంగారెడ్డి
మహాత్మాగాంధీ యూనివర్సిటీ: నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి.
పాలమూరు యూనివర్సిటీ: మహబూబ్‌నగర్, వనపర్తి, నాగర్‌కర్నూల్. గద్వాల జోగులాంబ
Advertisement
Advertisement