Satavahana Varsity
-
చదువులమ్మ ఒడిలో ‘మావో’ల కలకలం!
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: కరీంనగర్‌లోని శాతవాహన వర్సిటీలో మావోయిస్టు కార్యక్రమాల పేరిట సామాజిక మాధ్యమాల్లో సాగిన ప్రచారం వివాదాస్పదమవుతోంది. ‘నక్సలైట్ కార్యకలాపాలపై శాతవాహన యూనివర్సిటీలో పోలీసుల ఆరా’శీర్షికన రాసిన లేఖ సోమవారం ఉదయం నుంచి వాట్సాప్ గ్రూపుల్లో వైరల్ అయింది. ‘నక్సలైట్ బాధిత కుటుంబాల సంక్షేమ సంఘం, కరీంనగర్’పేరిట ఈ లేఖ వాట్సాప్ గ్రూపుల్లో మీడియాతో పాటు విద్యార్థులు, యూనివర్సిటీ అధికారులు, ప్రొఫెసర్ల ఫోన్లలో చక్కర్లు కొట్టింది. అయితే మీడియా గ్రూపులకు స్వయంగా పోలీసుశాఖ పంపించడం గమనార్హం. దీంతో పోలీస్ శాఖ తరఫున అధికారికంగా నక్సలైట్ బాధితులు లేఖ విడుదల చేసినట్లు భావించారు. దీనిపై పోలీసు శాఖ అధికారులను ‘సాక్షి’సంప్రదించగా, యూనివర్సిటీలో రెండు విద్యార్థి సంఘాల మధ్య జరుగుతున్న గొడవల నేపథ్యంలో వచ్చిన పోస్టును సమాచారం కోసం షేర్ చేశామే తప్ప, అధికారికంగా కాదని వెల్లడించారు. కాగా సాయంత్రం ఇదే సంఘం తరఫున వచ్చిన మరో పోస్టును గ్రూపులో కాకుండా విడిగా జర్నలిస్టులకు పోస్టు చేశారు. తెలంగాణ విద్యార్థి వేదికకు తీవ్రవాదులతో సంబంధాలు ఉన్నాయనేందుకు సాక్ష్యాలుగా టీవీవీ అనుకూల విద్యార్థులు ప్రొఫెసర్ సాయిబాబా, వరవరరావుల అరెస్టును వ్యతిరేకిస్తూ నల్ల జెండాలు ప్రదర్శించిన ఫొటోను, విడుదల చేసిన పోస్టర్‌ను పంపించారు. టీవీవీ, ప్రొఫెసర్‌కు వ్యతిరేకంగా పోస్టు నిషేధిత మావోయిస్టు తీవ్రవాద సంస్థకు అనుబంధంగా పనిచేస్తున్న తెలంగాణ విద్యార్థి వేదిక (టీవీవీ) సంఘంలో సభ్యత్వాలు నమోదవుతున్నాయని ఆ పోస్టులో పేర్కొన్నారు. కొరివి సూర్యుడు, కరికె మహేశ్, దొగ్గల రాజు అనే టీవీవీ నాయకులు మరికొందరితో కలసి ఇటీవల ఛత్తీస్‌గఢ్ వెళ్లి మావోయిస్టు చంద్రన్నను కలసి తీవ్రవాదుల నుంచి పెద్ద ఎత్తున నిధులు తెచ్చారని ఆరోపించారు. ఇక్కడ అసోసియేట్ ప్రొఫెసర్‌గా ఉన్న సూరేపల్లి సుజాత స్టడీటూర్ల పేరుతో విద్యార్థులను ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లోని మారుమూల ప్రాంతాలకు తీసుకెళ్లి తీవ్రవాదులను కలిపిస్తూ, రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా తయారు చేయిస్తున్నట్లు ఆరోపించారు. తీవ్రవాద సంస్థలకు అనుకూలంగా పనిచేసే విద్యార్థి సంఘాల్లో చేరకుండా తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలని సూచించారు. ఈ వాట్సాప్ లేఖను పోలీస్ శాఖ మీడియా గ్రూపుల్లో పంపించింది. నక్సలైట్లకు వ్యతిరేకంగా ఏబీవీపీ ధర్నా యూనివర్సిటీలో మావోయిస్టు అనుకూల విద్యార్థి సంఘం కార్యకలాపాలు సాగిస్తుందని ఓ వైపు మీడియా, పోలీసు, ప్రొఫెసర్, విద్యార్థుల గ్రూపుల్లో వీడియో వైరల్ అవుతున్న సమయంలో మధ్యాహ్నం ఏబీవీపీ విద్యార్థి సంఘం స్పందించింది. యూనివర్సిటీ పరిపాలన విభాగంలోకి వెళ్లిన విద్యార్థి సంఘం నాయకులు తెలంగాణ విద్యార్థి వేదికకు, నక్సలైట్లకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రిజిస్ట్రార్ చాంబర్ ముందు బైఠాయించారు. రిజిస్ట్రార్ ఉమేష్ కుమార్‌కు వినతిపత్రం ఇచ్చి వెళ్లారు. తీవ్రవాద కార్యకలాపాలు లేవు యూనివర్సిటీలో చోటు చేసుకున్న పరిణామాలపై రిజిస్ట్రార్ ఉమేష్ కుమార్ ‘సాక్షి’తో మాట్లాడుతూ వర్సిటీలో ఎలాంటి తీవ్రవాద కార్యకలాపాలు సాగడం లేదని స్పష్టం చేశారు. ఒకటి రెండు విద్యార్థి సంఘాల తీరులోనే తెలంగాణ విద్యార్థి వేదిక అనేది కూడా ఉన్నట్లు పేర్కొన్నారు. అది నిషేధిత సంఘమో కాదో తనకు తెలియదని పేర్కొన్నారు. రెండు నెలల క్రితం స్టడీ టూర్ కింద యూనివర్సిటీ నుంచి అధికారికంగానే భద్రాచలం వెళ్లినట్లు తెలిపా రు. ప్రొఫెసర్ సూరెపల్లి సుజాతతోపాటు ఇతర స్టాఫ్ కూడా ఉందని, తనకు భద్రాచలం అనే చెప్పారని, ఛత్తీస్‌గఢ్ వెళ్లారో లేదో తెలియదని అన్నారు. పెంచల శ్రీనివాస్ అనే కాంట్రాక్టు లెక్చరర్ లైంగిక వేధింపుల ఆరోపణలపై కమిటీ నివేదిక ఇచ్చారని, వీసీ పరిధిలో ఉందని చెప్పారు. వాట్సాప్ పోస్టులో ఉన్నవన్నీ తప్పులేనని అంగీకరించారు. టీవీవీ మావోయిస్టు అనుబంధ సంస్థే: మరో ప్రకటన సోమవారం ఉదయమే తెలంగాణ విద్యార్థి వేదిక లక్ష్యంగా కరీంనగర్ నక్సలైట్ బాధిత కుటుంబాల సంక్షేమ సంఘం పేరుతో వాట్సాప్ పోస్టు రాగా, మధ్యాహ్నం మూడు గంటలకు మరో ప్రకటన వెలువడింది. టీవీవీ మావోయిస్టు అనుబంధ సంస్థ అని చెప్పడానికి ఆధారాలు ఇవి కావా? అంటూ కొన్ని సాక్ష్యాలను విడుదల చేశారు. ప్రొఫెసర్ జి.ఎన్.సాయిబాబా, వరవరరావుల అరెస్టుకు నిరసనగా తెలంగాణ విద్యార్థి వేదిక తరఫున మే 17న ఇందిరాపార్కు వద్ద చేపట్టిన ధర్నాకు సంబంధించిన పోస్టర్‌ను, శాతవాహన యూనివర్సిటీలో కొందరు విద్యార్థులు నల్లజెండాలు ప్రదర్శిస్తున్న ఫొటోలను విడుదల చేశారు. వీటిని కూడా పోలీస్ పీఆర్ఓ జర్నలిస్టులకు తన ఫోన్ ద్వారా పంపించడం గమనార్హం. -
శాంతించని ‘శాతవాహన’!
శాతవాహన యూనివర్సిటీ (కరీంనగర్): కరీంనగర్ శాతవాహన వర్సిటీ ఇంకా శాంతించలేదు. రెండురోజుల క్రితం చెలరేగిన అల్ల ర్ల నేపథ్యంలో పోలీసు బలగాలు వర్సిటీ వద్ద పహారా కాస్తూనే ఉన్నాయి. బుధవారం వర్సిటీ పరిపాలన ఉద్యోగులు విధులు నిర్వర్తించారు. జనవరి 2 నుంచి డిగ్రీ మొదటి, మూడో సెమిస్టర్ పరీక్షలు ప్రారంభం కానుండటంతో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులు, కళాశాలల ప్రతినిధులను పోలీసులు, వర్సిటీ సిబ్బంది వివరాలు తెలుసుకొని లోనికి పంపారు. వామపక్ష, బహుజన, దళిత విద్యార్థి సంఘాల బంద్ నేపథ్యంలో పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించారు. బంద్‌లో భాగంగా విద్యా సంస్థలను మూయించిన వారిని అరెస్ట్ చేశారు. టీమాస్ ఆధ్వర్యంలో ర్యాలీ... టీమాస్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించి, మనుధర్మశాస్త్రం ప్రతులను దహ నం చేశారు. పోలీసులు కలెక్టరేట్ ప్రాంతంలో డ్రోన్ కెమెరాలతో పర్యవేక్షించారు. టీమాస్ రాష్ట్ర కన్వీనర్ జాన్‌వెస్లీ, కేవీపీఎస్ రా ష్ట్ర అధ్యక్షుడు భాస్కర్, గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ధర్మనాయక్, దళిత బహుజన ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షులు శంకర్లు మాట్లాడారు. డిగ్రీ పరీక్షలు యథాతథం వర్సిటీలో జనవరి రెండు నుంచి జరగనున్న డిగ్రీ మొదటి, మూడో సెమిస్టర్ పరీక్షలు యథాతథంగా నిర్వహిస్తామని, షెడ్యూల్లో ఎలాంటి మార్పూ ఉండదని రిజిస్ట్రార్ ఎం.కోమల్‌రెడ్డి వెల్లడించారు. తరగతులు కూడా 2 నుంచి ప్రారంభిస్తామన్నారు. జనవరి 2న జరగాల్సిన పీజీ మొదటి సెమిస్టర్ సీబీసీఎస్ సప్లిమెంటరీ పరీక్షను 17కు వాయిదా వేశామని, మిగిలిన పరీక్షలు యథావిధిగా జరుగుతాయని వెల్లడించారు. ఎంబీఏ మూడో సెమిస్టర్ పరీక్షలు జనవరి 4 నుంచి జరుగుతాయని తెలిపారు. -
వర్సిటీల భౌగోళిక స్వరూపంలో మార్పులు!
- తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోకి నిర్మల్, ఆదిలాబాద్ - శాతవాహన వర్సిటీ పరిధిలోకి మంచిర్యాల, కుమ్రంభీం జిల్లాలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పలు విశ్వవిద్యాలయాల భౌగోళిక స్వరూపాలు మారనున్నాయి. ఈ మేరకు ఉన్నత విద్యామండలి నేతృత్వంలోని కమిటీ ప్రభుత్వానికి ఓ నివేదికను అందజేసింది.మార్పులకు ప్రభుత్వం కూడా సుముఖత వ్యక్తం చేసినట్లు తెలిసింది. త్వరలోనే మార్పులతో కూడిన ఉత్తర్వులు వెలువడనున్నాయి. భవిష్యత్తులో మరిన్ని జిల్లాలను కూడా మార్పు చేసేలా కమిటీ సిఫారసు చేసినట్లు తెలిసింది. ప్రస్తుతం కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలు ఉన్నాయి. నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాలను తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోకి తీసుకురానుంది. కుమ్రం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలను శాతవాహన యూనివర్సిటీ పరిధిలోకి తేనుంది. స్థానిక ఎమ్మెల్యేలు దివాకర్‌రావు, నల్లాల ఓదెలు, చెన్నయ్య, సతీష్‌కుమార్, కోవా లక్ష్మి, కోనేరు కోనప్ప తదితరులు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు చేసిన విజ్ఞప్తుల మేరకు ఈ మార్పులు చేసింది. యూనివర్సిటీల పరిధుల్లోని జిల్లాలు ఇవే.. కాకతీయ యూనివర్సిటీ: వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి, జనగాం, ఖమ్మం, భద్రాద్రి శాతవాహన యూనివర్సిటీ: కరీంనగర్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల. కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల తెలంగాణ యూనివర్సిటీ: నిజమాబాద్; కామారెడ్డి, నిర్మల్, ఆదిలాబాద్. ఉస్మానియా యూనివర్సిటీ: హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్, సిద్దిపేట్, మెదక్, సంగారెడ్డి మహాత్మాగాంధీ యూనివర్సిటీ: నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి. పాలమూరు యూనివర్సిటీ: మహబూబ్‌నగర్, వనపర్తి, నాగర్‌కర్నూల్. గద్వాల జోగులాంబ