శాతవాహన యూనివర్సిటీ (కరీంనగర్): కరీంనగర్ శాతవాహన వర్సిటీ ఇంకా శాంతించలేదు. రెండురోజుల క్రితం చెలరేగిన అల్ల ర్ల నేపథ్యంలో పోలీసు బలగాలు వర్సిటీ వద్ద పహారా కాస్తూనే ఉన్నాయి. బుధవారం వర్సిటీ పరిపాలన ఉద్యోగులు విధులు నిర్వర్తించారు.
జనవరి 2 నుంచి డిగ్రీ మొదటి, మూడో సెమిస్టర్ పరీక్షలు ప్రారంభం కానుండటంతో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులు, కళాశాలల ప్రతినిధులను పోలీసులు, వర్సిటీ సిబ్బంది వివరాలు తెలుసుకొని లోనికి పంపారు. వామపక్ష, బహుజన, దళిత విద్యార్థి సంఘాల బంద్ నేపథ్యంలో పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించారు. బంద్‌లో భాగంగా విద్యా సంస్థలను మూయించిన వారిని అరెస్ట్ చేశారు.
టీమాస్ ఆధ్వర్యంలో ర్యాలీ...
టీమాస్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించి, మనుధర్మశాస్త్రం ప్రతులను దహ నం చేశారు. పోలీసులు కలెక్టరేట్ ప్రాంతంలో డ్రోన్ కెమెరాలతో పర్యవేక్షించారు. టీమాస్ రాష్ట్ర కన్వీనర్ జాన్‌వెస్లీ, కేవీపీఎస్ రా ష్ట్ర అధ్యక్షుడు భాస్కర్, గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ధర్మనాయక్, దళిత బహుజన ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షులు శంకర్‌లు మాట్లాడారు.
డిగ్రీ పరీక్షలు యథాతథం
వర్సిటీలో జనవరి రెండు నుంచి జరగనున్న డిగ్రీ మొదటి, మూడో సెమిస్టర్ పరీక్షలు యథాతథంగా నిర్వహిస్తామని, షెడ్యూల్‌లో ఎలాంటి మార్పూ ఉండదని రిజిస్ట్రార్ ఎం.కోమల్‌రెడ్డి వెల్లడించారు. తరగతులు కూడా 2 నుంచి ప్రారంభిస్తామన్నారు. జనవరి 2న జరగాల్సిన పీజీ మొదటి సెమిస్టర్ సీబీసీఎస్ సప్లిమెంటరీ పరీక్షను 17కు వాయిదా వేశామని, మిగిలిన పరీక్షలు యథావిధిగా జరుగుతాయని వెల్లడించారు. ఎంబీఏ మూడో సెమిస్టర్ పరీక్షలు జనవరి 4 నుంచి జరుగుతాయని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment