సీఎం వద్దకు చేరిన విచారణ నివేదిక
డిచ్‌పల్లి: తెలంగాణ యూనివర్సిటీ మాజీ వీసీ అక్బర్ అలీఖాన్ మెడకు నియామకాల ఉచ్చు బిగిసింది. వర్సిటీలో చేపట్టిన టీచింగ్, నాన్‌టీచింగ్ నియామకాలకు సంబంధించి వీసీపై ఆరోపణలు రావడంతో గవర్నర్ నరసింహన్ విచారణకు ఆదేశించగా, హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ సీవీ రాములు విచారణ జరిపిన విషయం తెలిసిందే. ఈ విచారణలో.. నియామకాల నిలిపివేతకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చినా వీసీ పట్టించుకోలేదని తేలింది. రెండు, మూడు రోజులలో సీఎం ఈ విషయమై చర్యలు తీసుకోనున్నట్లు తెలిసింది.
ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ల ఎంపికలో అక్రమాలు చోటుచేసుకున్నట్లు జస్టిస్ సీవీ రాములు తన నివేదికలో నిర్ధారించినట్లు సమాచారం. నియామకాలు రద్దు చేయాలని, కొత్తగా నోటిఫికేషన్ ఇచ్చి నియామకాలు చేపట్టాలని ప్రభుత్వానికి సిఫార్సు చేసినట్లు తెలిసింది. మాజీ వీసీ అక్బర్ అలీఖాన్ రాష్ట్ర మంత్రుల చుట్టూ చక్కర్లు కొడుతున్నట్లు సమాచారం.
ఇన్‌చార్‌జ వీసీ శైలజా రామయ్యర్‌కు చెప్పించి వేతనాలందేలా చూస్తానని కొత్త అధ్యాపకులకు భరోసా ఇస్తున్నట్లు తెలిసింది. పదవీకాలం ముగిసినా, ప్రస్తుతం ఆయన ఉస్మానియా యూనివర్సిటీలో విధుల్లో ఉన్న విషయం తెలిసిందే.