రుణం తీర్చుకుంటా | MP Kavitha in media conference | Sakshi
Sakshi News home page

రుణం తీర్చుకుంటా

Published Fri, Mar 6 2015 2:59 AM | Last Updated on Thu, Aug 9 2018 4:51 PM

రుణం తీర్చుకుంటా - Sakshi

రుణం తీర్చుకుంటా

ఆడబిడ్డగా, కోడలిగా ఆదరించారు
గద్దెనెక్కించిన గడ్డను అభివృద్ధి చేస్తాం
పార్లమెంటులో మాట్లాడే అవకాశం మీరిచ్చిందే
పెద్దపల్లి-నిజామాబాద్ లైన్‌కు రూ.141 కోట్లు
రూ.500 కోట్లతో నిజామాబాద్‌కు ఔటర్ రింగ్‌రోడ్
నిజాం షుగర్ ఫ్యాక్టరీ రైతులకు సీఎం కేసీఆర్ అండ
గోదావరి పుష్కరాలకు రూ.128 కోట్లతో ఏర్పాట్లు
తెలంగాణ యూనివర్సిటీకి అంతర్జాతీయ గుర్తింపు
ఇందూరు ప్రగతే టీఆర్‌ఎస్ ధ్యేయం

విలేకరుల సమావేశంలో ఎంపీ కవిత

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ ఆడబిడ్డగా, కోడలిగా ఆదరించిన ఇందూరు ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా అన్ని రంగాలలో అభివృద్ధి సాధించేందుకు నిరంతర కృషి చేస్తానని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధుల సహాయ, సహాకారాలతో అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు ద్వారా ప్రజల రుణం తీర్చుకుంటానన్నారు. గురువారం నిజామాబాద్‌లోని నిఖిల్‌సాయి ఇంటర్నేషనల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు.

‘‘రైల్వే బడ్జెట్‌లో జిల్లాకు రూ.141 కోట్లు మంజూరు చేయించుకునే అవకాశం కలిగింది. పార్లమెంటులో నా గళాన్ని వినిపించే అవకాశం కలిగించిన జిల్లా ప్రజల రుణం తీర్చుకుంటున్నట్లు భావిస్తున్నాను. ఇదే విధమైన అండదండలు ఉంటే ప్రతి అంశాన్ని ముందుకు తీసుకువెళ్తాను. నిజామాబాద్ కోడలిగా నా కర్తవ్యాన్ని నిర్వహిస్తాను’’ అని పేర్కొన్నారు. రైల్వే బ డ్జెట్‌లో జిల్లాకు రెండు ఆర్‌ఓబీలు సహా చిన్న చిన్న పనులు ఎన్నో మంజూరయినట్లు చెప్పారు.
 
రైతులను ఆదుకుంటాం..
నిజాం షుగర్ ఫ్యాక్టరీ రైతులను ఆదుకోడానికి సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారని ఎంపీ కవిత తెలిపారు చక్కెర రైతులకు ప్రభుత్వం తరపున దాదాపుగా రూ. 36 0 పైగా రుసుం చెల్లించి, మిగతాది ఆ కంపెనీ చెల్లించేటట్టుగా వాగ్దానం చేశారని పేర్కొన్నారు. రైతుల బకాయిలు రెండు మూడు రోజులలో ప్రభుత్వమే చెల్లించేలా చూ స్తున్నామన్నారు. రైతుల సమస్యలు యాజమాన్యం పట్టించుకోవటం లేదని ఇటీవల ఆ కంపెనీ ఎండీ దృష్టికి తీసుకెళ్లామన్నారు. దక్షిణాది ప్రాంతాలలో గల చక్కెర కార్మాగారాలు అనేక సమస్యల వలయంలో ఉన్నాయన్నారు. నిజాం షుగర్స్‌లో నిల్వ ఉన్న చక్కెరను ప్రభుత్వం రేషన్ దుకాణాలకు సరఫరా చేయించేలా ప్రయత్నం చేస్తున్నామన్నారు.

బీడీ కార్మికుల భృతిపై సీఎం మోర్తాడ్ పర్యటనకు వచ్చినప్పుడు మొదటిసారిగా చరిత్రాత్మక ప్రకటన చేశారని, ఈ మేరకు అర్హులైన అందరికీ భృతి కల్పి స్తున్నామన్నారు. 85 వేల మందిని గుర్తించామని, మరో 25 వేల మందికి ఇచ్చేందుకు కలెక్టర్ ప్రతిపాదనలు రూపొందిస్తున్నారని వివరించారు. సకల జనుల సర్వేలో 1. 63 లక్షల మంది కార్మికులు తాము బీడీ కార్మికులమని, ఇదే తమకు జీవనాధారమని నమోదు చేసుకున్నారని, ఈపీఎఫ్ ఖాతాలో 1.59 లక్షల మంది కార్మికులు ఉన్నట్లు గా రికార్డు అయి ఉందన్నారు. ‘‘ఎన్నికల ముందు బీడి కార్మికులకు ఇండ్లు ఇస్తామని చెప్పాం... ఈ విషయంలో నాతోపాటు కలెక్టర్ ఈ పనులో నిమగ్నమై ఉన్నాం’’ అ ని ఎంపీ చెప్పారు. జిల్లాలో మరో విధమైన బీడి కార్మికులు ఉన్నారని, వారందరినీ ఈ పథకంలోకి తెచ్చేందుకు ఆలోచన చేస్తున్నామన్నారు.
 
గోదారి తీరంలో అన్ని ఏర్పాట్లు
గోదావరి పుష్కరాల సందర్భంగా పుష్కర ఘాట్లకు ప్రభుత్వం రూ. 128 కోట్లు మంజూరు చేసిందని ఎంపీ కవిత పేర్కొన్నారు. గోదావరి తీర ప్రాంతాలలో ఎటువం టి లోటుపాట్లు లేకుండా తానే స్వయంగా పర్యవేక్షిస్తున్నట్లు కూడా చెప్పారు. నిజామాబాద్ చుట్టూ ఔటర్ రింగ్‌రోడ్డు గురించి సీఎం వాకబు చేయగా మూడు రోజుల క్రి తమే అధికారులు దీనికి సంబంధించి ప్రతిపాదనలు పంపారని, మొదటి దశలో రూ. 510 కోట్లు ఖర్చు అవుతాయని అంచానా కూడ వేశామన్నారు. అయితే ఇందులో భూ సేకరణకే ఎక్కువ మొత్తం ఖర్చు చేయవలసి వస్తుందని, దీనిని ఎలా తగ్గించాలో ఆలోచన చేస్తున్నామన్నారు. రెండవ దశ కింద  దాదాపు రూ. 600 కోట్ల నుంచి రూ.700 కోట్లు ఖర్చు అవుతాయని భావిస్తున్నట్లు చెప్పారు.
 
అన్నీ ఇక్కడి నుంచే ప్రారంభం
జిల్లా నుంచి చాల పథకాలు ప్రారంభం అవుతున్నాయని, మార్కెటింగ్ శాఖ మంత్రి హరీశ్‌రావు ఆధ్వర్యంలో ఈ ప్రొక్యూర్‌మెంట్‌ను తొలిసారిగా వ్యవసాయ మార్కెట్ నుంచే మొదలుపెట్టారని తెలిపారు. పసుపు రైతులకు దీని ద్వారా మేలు కలిగిందన్నారు. దళారుల బెడద తప్పిందన్నారు. పసుపు క్వింటాళుకు ఏడు వేల రూపాయలు వచ్చేలా చూశామన్నారు. నగరంలో మాస్టర్ ప్లాన్ అమలు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారని, టెండర్లు పిలవనున్నారని తెలిపారు. నగరంలో ఎటువంటి సౌకర్యాలు ఉండాలో ప్రముఖలతో ఈ మధ్యలోనే ఓ సమావేశాన్ని ఏర్పాటు చేసి పనులు ముమ్మరంగా జరిగేలా చూస్తామన్నారు.

సీఎం వాగ్దానం ప్రకారం, జనవరిలో 16 దళితులకు మూడెకరాల భూమి ఇచ్చామని, మిగతావారికి ఇచ్చేందుకు భూములు గుర్తించే ప్రక్రియ కొనసాగుతోందన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజల   కు ప్రభుత్వానికి వారధిగా పనిచేస్తున్నారని అన్నారు. తెలంగాణ యూనివర్సిటీని ఇతర దేశాలలోని యూ నివర్సిటీలతో అనుసంధానం చేయనున్నామన్నారు. ఇందులో భాగంగా ‘యూనివర్సిటీ ఆఫ్ చికాగో’ అధి కారులతో అధికార కమ్యూనికేషన్ ప్రారంభమైందని, ఇది విజయవంతమైతే ఏటా జిల్లాలో 75 మందికి అక్కడ అడ్మిషన్ ఇప్పించేందుకు అవకాశం ఉంటుం దన్నారు.

విలేకరుల సమావేశంలో టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు ఏఎస్ పోశెట్టి, నిజామాబాద్ అర్బ  న్ ఎమ్మెల్యే బిగాల గణేష్‌గుప్తా, మేయర్ ఆకుల సు  జాత, జడ్‌పీ వైస్ చైర్ పర్సన్ గడ్డం సుమనారెడ్డి, టీఆర్‌ఎస్ జిల్లా పరిశీలకులు రూప్‌సింగ్, టీఆర్‌ఎస్ నాయకులు డాక్టర్ భూపతిరెడ్డి, కార్పొరేటర్ సుదాం లక్ష్మీ, ఎస్‌ఏ అలీం, దాదన్నగారి విఠల్‌రావు, మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షులు తారిఖ్ అన్సారీ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement