కేక్ కట్ చేసిన వర్సిటీ రిజిస్ట్రార్
తెయూ(డిచ్‌పల్లి): తెలంగాణ యూనివర్సిటీలో శుక్రవారం ఎంపీ కల్వకుంట్ల కవిత జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన తెయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ లింబాద్రి కేక్‌ను కట్ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎంపీ కవిత జిల్లాతో పాటు తెలంగాణ యూనివర్సిటీ అభివృద్ధికి కృషి చేస్తున్నారని అన్నారు.
టీఆర్‌ఎస్‌వీ జిల్లా అధ్యక్షుడు చింత మహేశ్ మాట్లాడుతూ ఎంపీ కవిత ఇలాంటి జన్మదిన వేడుకలను మరెన్నో జరుపుకోవాలని, తెలంగాణ ప్రజలకు సేవలందించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో తెయూ టీఆర్‌ఎస్‌వీ అధ్యక్షుడు మంత్రి మహేశ్, అర్బన్ ఇన్‌చార్జి లక్ష్మన్,వర్సిటీ నాయకులు నర్సింహా, జైపాల్, మహేశ్, రవి, ప్రశాంత్, విజయ్, మోహన్, అనిల్, శరత్ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో కార్యక్రమంలో ప్రిన్సిపాల్ కనకయ్య, అధ్యాపకులు ధర్మరాజు, ఘంటా చంద్రశేఖ ర్, తెలంగాణ జాగృతి నాయకులు సాయికుమార్, నవీన్, అనిల్, ప్రభాకర్, శ్రీకాంత్, నవీన్ తదితరులు పాల్గొన్నారు. వర్సిటీ విద్యార్థి జేఏసీ ఆధ్వర్వంలో కవిత జన్మ దిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. జేఏసీ చైర్మన్ యెండల ప్రదీప్, మాదిగ విద్యార్థి జేఏసీ చైర్మన్ బల్‌వీర్ ప్రసాద్, విద్యార్థి నాయకులు మధు, పెంటయ్య, రాజు, బాలాజీ, కిషోర్, రవినాయక్, భాను, రెడ్డి రాజు తదితరులు పాల్గొన్నారు.
క్యాంపస్‌లో ఎంపీ కవిత జన్మదిన వేడుకలు
Published Sat, Mar 14 2015 3:37 AM | Last Updated on Thu, Aug 9 2018 4:51 PM
Advertisement
Advertisement