హైకోర్టు విభజన ఆలస్యంపై విద్యార్థుల ఆందోళన
డిచ్పల్లి: తెలంగాణ హైకోర్టు ఏర్పాటులో ఆలస్యాన్ని నిరసిస్తూ నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లిలోని తెలంగాణ యూనివర్సిటీ విద్యార్థులు బుధవారం తరగతులను బహిష్కరించారు. రాష్ట్ర విభజన జరిగి నెలలు గడుస్తున్నా... ఉమ్మడి హైకోర్టును విభజించకపోవడం సరికాదన్నారు.
దీనిపై హైకోర్టు, జిల్లా కోర్టు, స్థానిక కోర్టుల న్యాయవాదులు రిలే దీక్షలు చేపట్టినా... కేంద్రం పట్టించుకున్న పాపాన పోలేదని విమర్శించారు. లా కళాశాలకు చెందిన దాదాపు 200 మంది విద్యార్థులు యూనివర్సిటీలో ర్యాలీ నిర్వహించారు. కళాశాల ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.