Dichpalle
-
ధర్మారం(బి)లో చిన్నారిపై హత్యాచారం..?
సాక్షి, డిచ్పల్లి (నిజామాబాద్‌రూరల్): డిచ్పల్లి మండలం ధర్మారం(బి) గ్రామంలో ఆరేళ్ల చిన్నారి హత్యాచారానికి గురైన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. వారం కిందట జరిగినా పోలీసులు గోప్యంగా ఉంచడంపై పలు అనుమానాలకు తావిస్తోందని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తోన్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. కామారెడ్డి జిల్లా బిచ్కుంద ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి, భర్తతో విడిపోయి ఇద్దరు పిల్లలు ఉన్న మహిళను వెంటతీసుకుని ధర్మారం(బి) గ్రామానికి నాలుగు నెలల క్రితం వలసవచ్చాడు. తామిద్దరం భార్యాభర్తలమని చెప్పి ఒకరి వద్ద కూలీ పనికి చేరాడు. ఆ మహిళకు మొదటి భర్త ద్వారా పుట్టిన ఇద్దరు ఆడ పిల్లలు తమకు అడ్డుగా భావించాడు. వారం క్రితం రాత్రి పూట ఆరేళ్ల వయస్సున్న పెద్ద కూతురు పై అత్యాచారానికి పాల్పడ్డాడు. చిన్నారి తీవ్ర రక్తస్రావంతో అపస్మారక స్థితికి చేరుకుంది. ఆపై ఆమె తలపై రాయితో కొట్టి గాయపర్చాడు. అనంతరం చిన్నారికి ఫిట్స్ వచ్చాయని మహిళతో చెప్పి హడావిడి చేసి, చికిత్స పేరిట జిల్లా కేంద్రంలోని ఆస్పత్రికి తరలించాడు. చిన్నారి పరిస్థితి విషమంగా ఉండటంతో డాక్టర్ల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది. అనంతరం అతడు వారిని వదిలి పరారయ్యాడు. అనుమానం వచ్చిన చిన్నారి తల్లి తనతో సహజీవనం చేస్తున్న వ్యక్తే తన కూతురుపై అత్యాచారం చేశాడని డిచ్పల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు నిందితుడిని శనివారం అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. అయితే ఈ విషయమై డిచ్పల్లి పోలీసులు స్పందించలేదు. -
కార్డన్ సెర్చ్‌లో..నోరెళ్లబెట్టిన పోలీసులు
డిచ్పల్లి(నిజామాబాద్): మండలంలోని అమృతాపూర్ పంచాతీయ పరిధిలో గల ఒడ్డెర కాలనీ, దేవునగర్ లెప్రసీ క్యాంపులో పోలీసులు మంగళవారం కార్డన్ సెర్చ్ నిర్వహించారు. తెల్లవారుజామున 4 గంటలకు మొదలైన తనిఖీలు ఉదయం 10 గంటల వరకు కొనసాగాయి. నిజామాబా ద్ డీఎస్పీ ఆనంద్‌కుమార్ నేతృత్వంలో డిచ్పల్లి సీఐ తిరుపతి, ఎస్సైలు కట్టా నరేందర్‌రెడ్డి, శ్రీదర్‌గౌడ్, ము రళి, ప్రొబేషనరీ ఎస్సై నవీన్‌కుమార్, ఏఎస్సై గంగారాం, సిబ్బంది ఇంటింటికి తిరుగుతూ సోదాలు చేశారు. ఈ సందర్భంగా లభించిన సామగ్రిని చూసి పోలీసులు నోరెళ్లబెట్టారు. దాదాపు ప్రతి ఇంట్లో క్రిస్టియన్ మెడికల్ కళాశాల (సీఎంసీ)కు చెందిన సామగ్రి లభించడంతో విస్తుబోయారు. కళాశాలలోని మంచాలు, టేబుళ్లు, బెంచీలు, ఫ్రిజ్‌లు, బీరువాలు, సీలింగ్‌ఫ్యాన్లు ఆ ఖరికి పేషెంట్ల కోసం ఏర్పాటు చేసిన బెడ్లు లభించడంతో సిబ్బంది విస్మయానికి గురయ్యారు. కొందరైతే అవసరం లేకున్నా గదులకు ఉన్న తలుపులు ఎత్తుకొచ్చి ఇళ్లల్లో దాచుకున్నారు. సామగ్రిని ఐదు ట్రాక్టర్లలో తరలించి విక్టోరియా హాస్పిటల్ ఆవరణలోని భవనంలో ఉంచారు. పత్రాలు లేని నాలుగు ద్విచక్ర వాహనాలు, ప్యాసింజర్ ఆటోను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం డీఎస్పీ ఆనంద్‌కుమార్ మాట్లాడుతూ.. సంఘ విద్రోహ శక్తులను అరికట్టేందుకు కార్డన్ సెర్చ్ నిర్వహించామని తెలిపారు. ప్రతి ఇంట్లో సీఎంసీ కళాశాలకు చెందిన సామాగ్రి లభించడం తమను ఆశ్చర్యానికి గురి చేసిందన్నారు. త్వరలో మరోసారి కార్డన్ సెర్చ్ నిర్వహిస్తామని, చోరీ చేసిన సామాగ్రి లభిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. స్వాధీనం చేసుకున్న సామగ్రి వివరాలు నమోదు చేసుకుని సీఎంసీ ప్రతినిధులకు అప్పగిస్తామని తెలిపారు. -
క్యాంపస్‌లో ఎంపీ కవిత జన్మదిన వేడుకలు
కేక్ కట్ చేసిన వర్సిటీ రిజిస్ట్రార్ తెయూ(డిచ్పల్లి): తెలంగాణ యూనివర్సిటీలో శుక్రవారం ఎంపీ కల్వకుంట్ల కవిత జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన తెయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ లింబాద్రి కేక్‌ను కట్ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎంపీ కవిత జిల్లాతో పాటు తెలంగాణ యూనివర్సిటీ అభివృద్ధికి కృషి చేస్తున్నారని అన్నారు. టీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షుడు చింత మహేశ్ మాట్లాడుతూ ఎంపీ కవిత ఇలాంటి జన్మదిన వేడుకలను మరెన్నో జరుపుకోవాలని, తెలంగాణ ప్రజలకు సేవలందించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో తెయూ టీఆర్ఎస్వీ అధ్యక్షుడు మంత్రి మహేశ్, అర్బన్ ఇన్చార్జి లక్ష్మన్,వర్సిటీ నాయకులు నర్సింహా, జైపాల్, మహేశ్, రవి, ప్రశాంత్, విజయ్, మోహన్, అనిల్, శరత్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో కార్యక్రమంలో ప్రిన్సిపాల్ కనకయ్య, అధ్యాపకులు ధర్మరాజు, ఘంటా చంద్రశేఖ ర్, తెలంగాణ జాగృతి నాయకులు సాయికుమార్, నవీన్, అనిల్, ప్రభాకర్, శ్రీకాంత్, నవీన్ తదితరులు పాల్గొన్నారు. వర్సిటీ విద్యార్థి జేఏసీ ఆధ్వర్వంలో కవిత జన్మ దిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. జేఏసీ చైర్మన్ యెండల ప్రదీప్, మాదిగ విద్యార్థి జేఏసీ చైర్మన్ బల్వీర్ ప్రసాద్, విద్యార్థి నాయకులు మధు, పెంటయ్య, రాజు, బాలాజీ, కిషోర్, రవినాయక్, భాను, రెడ్డి రాజు తదితరులు పాల్గొన్నారు. -
హైకోర్టు విభజన ఆలస్యంపై విద్యార్థుల ఆందోళన
డిచ్పల్లి: తెలంగాణ హైకోర్టు ఏర్పాటులో ఆలస్యాన్ని నిరసిస్తూ నిజామాబాద్ జిల్లా డిచ్పల్లిలోని తెలంగాణ యూనివర్సిటీ విద్యార్థులు బుధవారం తరగతులను బహిష్కరించారు. రాష్ట్ర విభజన జరిగి నెలలు గడుస్తున్నా... ఉమ్మడి హైకోర్టును విభజించకపోవడం సరికాదన్నారు. దీనిపై హైకోర్టు, జిల్లా కోర్టు, స్థానిక కోర్టుల న్యాయవాదులు రిలే దీక్షలు చేపట్టినా... కేంద్రం పట్టించుకున్న పాపాన పోలేదని విమర్శించారు. లా కళాశాలకు చెందిన దాదాపు 200 మంది విద్యార్థులు యూనివర్సిటీలో ర్యాలీ నిర్వహించారు. కళాశాల ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. -
నీటి పరీక్షలు.. నిర్వహిస్తే ఒట్టు
డిచ్పల్లి, న్యూస్‌లైన్ : వ్యాధుల బారిన పడి పల్లెలు తల్లడిల్లుతున్నా నీటి పరీక్షల జాడ కరువైంది. క్లోరినేషన్ చేసిన నీటిని ప్రజలకు తాగునీరుగా అందించాలన్న ప్రభుత్వ లక్ష్యం పక్కదారి పట్టింది. గ్రామాల్లో రక్షిత నీటి నిర్ధారణ పరీ క్షల కోసం రెండేళ్ల కిందట పంపిణీ చేసిన కిట్లు పంచాయతీ కార్యాలయాల్లోని స్టోర్ రూముల్లో మూలుగుతున్నాయి. పల్లె ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటిని అందించాలన్న సంకల్పంతో ఆర్డబ్ల్యూఎస్ అధికారులు కిట్లను పంపిణీ చేశారు. అయితే పంచాయతీ అధికారులు, వైద్య సిబ్బంది తాగునీటి పరీక్షలను విస్మరించా రు. జిల్లావ్యాప్తంగా ఏ ఒక్క గ్రామ పంచాయతీలో కూడా తాగునీటి పరీక్షలు జరిపిన దాఖలాలు లేవంటే అతిశయోక్తి కాదు. నీటి పరీక్షల నిర్వహణ కోసం గతం లో మండల స్థాయిలో పంచాయతీ సిబ్బందికి నామ్‌కే వాస్తేగా శిక్షణ తరగతులను నిర్వహించారు. ఒకటి రెండు రోజులు పంచాయతీ సిబ్బందికి నీటి పరీక్షలపై అవగాహన కల్పించి వేలాది రూపాయల విలువ చేసే కిట్లు, సామగ్రిని అందజేసి చేతులు దులుపుకున్నారు. గ్రామ పంచాయతీల్లో రక్షిత మంచినీటి ట్యాంకుల శుభ్రం, క్లోరినేషన్ పనుల నిర్వహణను వాటర్మెన్లు చూస్తుంటారు. వారికి నీటి పరీక్షలపై సరైన అవగాహన లేకపోవడంతో ప్రభుత్వం ద్వారా వచ్చిన పరీక్షల కిట్లను పట్టించుకోలేదు. దీంతో కిట్లు పంచాయతీ కా ర్యాలయాల్లో వృథాగా పడి ఉన్నాయి. సిబ్బంది చేపట్టి న క్లోరినేషన్ పనులను పంచాయతీల కార్యదర్శులు, కారోబార్లు, స్థానిక వైద్య సిబ్బంది నీటి పరీక్షలను ని ర్వహించాలి. గ్రామాల్లో తాగునీటి సరఫరా పనుల నిర్వహణ వాటర్మెన్లపై వదిలేయడంతో వారు పట్టించుకోవడం మానేశారు. గ్రామంలోని రక్షిత ట్యాంకు శుభ్రత, బ్లీచింగ్ పౌడర్ వాడకం క్లోరినేషన్ మోతాదును కిట్ల ద్వారా గుర్తించి, స్థానిక పంచాయతీ రికార్డుల్లో నమోదు చేయాల్సి ఉంటుంది. అయితే గ్రా మ పంచాయతీల్లో నీటి నిర్ధారణ పరీక్షల జాడ కరువైం ది. ఆర్‌డబ్ల్యూస్ శాఖ వారు పంపిణీ చేసిన కిట్లు కొన్ని పంచాయతీల్లో స్టోర్‌రూమ్‌ల్లో మూలుగుతుండగా.. మిగతా పంచాయతీల్లో వాటి ఆచూకీ కన్పించని దుస్థితి ఉంది. వారోత్సవాలకే పరిమితం.. ప్రభుత్వం ఏటా పారిశుద్ధ వారోత్సవాలను నిర్వహిస్తోంది. అధికారులు ఆ సమయంలో చూపిన శ్రద్ధ, త ర్వాత కాలంలో తాగునీటి సరఫరాపై చూపడం లేదని విమర్శలు విన్పిస్తున్నాయి. గ్రామాల్లో తాగునీటి ట్యాం కుల క్లోరినేషన్ పనులను పట్టించుకోవడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గ్రామాల్లో రక్షిత మం చి నీటి ట్యాంకులను శుభ్రపర్చడానికి, నీటి క్లోరినేషన్‌కు ఉపయోగపడే బ్లీచింగ్ పౌడర్ సైతం మైనర్ గ్రా మపంచాయతీల్లో అందుబాటులో ఉండడం లేదు. కొ న్ని గ్రామాల్లో పైపులైన్ల లీకేజీల వల్ల రక్షిత మంచినీరు కలుషితమవుతోంది. ట్యాంకు నుంచి నీటిని వదిలి మొదటి కుళాయి, మధ్యభాగం, చివరి కుళాయి నీటిని పట్టుకొని పంచాయతీ సిబ్బంది పరీక్షలను చేపట్టాలి. కాని పంచాయతీల్లో నీటి పరీక్షల మాటే మరిచారు. నీటిలోని క్రి మి కీటకాలు ప్రజలకు హాని కల్గిస్తున్నాయి. పల్లె ప్రజలు వ్యాధుల బారిన పడి మంచాన పడుతున్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి పంచాయతీల్లో నీటి పరీక్షలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని పల్లె ప్రజలు కోరుతున్నారు. -
రైలొచ్చినా.. గేటు వేయలేదు
డిచ్పల్లి, న్యూస్‌లైన్ : రైల్వే గేటు వేయకపోవడాన్ని గమనించిన రైలు డ్రైవర్ అప్రమత్తతతో రైలును నిలిపి వేయడంతో పట్టాలు దాటుతున్న వాహనదారులు, ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. రై లు నిలుపకుండా అలాగే వచ్చుంటే ప్రమాదం జరిగి ఉండేదని గేట్ మన్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం మధ్యాహ్నం సికింద్రాబాద్ నుంచి ముంబయి వెళ్లే దేవగిరి ఎక్స్‌ప్రెస్ రైలు నిజామాబాద్ జిల్లాలోని డిచ్పల్లికి చే రుకునే సమయానికి గేటు వేయలేదు. విధుల్లో ఉండాల్సిన గేట్‌మన్ గదికి తాళం వేసి ఎక్కడికో వెళ్లాడు. గేటు తెరిచి ఉండటంతో రైలు వస్తున్న విషయం గమనించని వాహనదారులు, పాదచారులు పట్టాలు దాటుతున్నారు. అదే సమయంలో రైలు కూత విన్పించి చూసేసరికి సమీపంలోనే ఆగిన ఎక్స్‌ప్రెస్ రైలు కన్పించడంతో అందోళనకు గురయ్యారు. రైలు కూతతో అక్కడికి చేరుకున్న గేట్‌మన్ హడావుడిగా గేటు వేశాడు. గేటు ఎందుకు మూయలేదని ప్రశ్నించిన ప్రజలతో ‘ఏం ప్రమాదం జరగలేదు కదా.. ’అంటూ దురుసుగా మాట్లాడినట్లు న్యూడెమొక్రసీ మండల కార్యదర్శి అంబట్ల రాజేశ్వర్ విలేకరులతో తెలిపారు. గేట్‌మన్ నిర్లక్ష్యంపై రైల్వే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు ఆయన తెలిపారు.