తెయూ(డిచ్‌పల్లి) : తాను తెలంగాణ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ బాధ్యతలు స్వీకరించిన ఈ మూడేళ్లలో వర్సిటీ ఎంతో అభివృద్ధి సాధించిందని అక్బర్ అలీ ఖాన్ పేర్కొన్నారు. అందరి సహకారంతోనే ఈ అభివృద్ధి సాధ్యమైందన్నారు. అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బందితో పా టు మీడియా ప్రతినిధులు ఎంతో సహకరించారంటూ అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.
ఆయన గురువారం సాయంత్రం తన చాంబర్‌లో విలేకరులతో మాట్లాడా రు. తాను బాధ్యతలు స్వీకరించిన వెంటనే జిల్లాలోని కళాశాలల అఫిలియేషన్ లభించిందన్నారు. యూనివర్సిటీ అభివృద్ధిలో ఎంతో కీలకమైన యూజీసీ 12(బి) గుర్తింపును పొందగలిగామన్నారు. ప్రస్తుతం 195 మంది రీసెర్చ్ స్కాలర్లు పరిశోధనల కోసం నమోదు చేసుకున్నారని తెలిపారు. వీరిలో 25 మందికి ప్రతిష్టాత్మకమైన నెట్, సెట్ వంటి అర్హతలున్నాయన్నారు. యూనివర్సిటీలోని పలువురు అధ్యాపకులకు జాతీయ పరిశోధన సంస్థల ప్రాజెక్టులు లభించాయని తెలిపా రు. సైన్స్ విభాగాలకు ఎక్కువగా డిమాండ్ ఉందని, దీన్ని దృష్టిలో ఉంచుకుని సైన్స్ ప్రయోగశాలలను విస్తరించేందుకు కృషి చేశానని వివరించారు.
పరీక్షల నిర్వహణ రంగంలో ఎన్నో మార్పులను తీసుకుని వచ్చామని వీసీ తెలిపారు. కంప్యూటర్ ఆధారిత ఇంటర్నల్ పరీక్షలు, అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణ వంటివి ఇందుకు ఉదాహరణగా చె ప్పవచ్చన్నారు. విద్యాసంస్థల నాణ్యత ప్రమాణాలను నిర్ధారించే న్యాక్ పర్యవేక్షణ కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయని పేర్కొన్నారు. వర్సిటీ తొలి స్నాతకోత్సవాన్ని గతేడాది నవంబర్ 13వ తేదీన ఎంతో ఘనంగా నిర్వహించామని తెలిపారు.
తన హయాంలో 54 మంది శాశ్వత బోధన సిబ్బందిని ఎంపికయ్యారని, అందులో 48 మంది విధుల్లో చేరారని వివరించారు. నియామకాల విషయంలో వచ్చిన ఆరోపణల్లో ఎంత మాత్రం వాస్తవం లేదని, నిబంధనల మేరకే పోస్టులు భర్తీ చేశామని వివరణ ఇచ్చారు. యూనివర్సిటీకి ఉజ్వల మైన భవిష్యత్తు ఉందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. తెలంగాణ యూనివర్సిటీ భవిష్యత్తులో హార్వర్డ్ యూనివర్సిటీ స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు.
మూడేళ్లలో ఎంతో అభివృద్ధి
Published Fri, Jul 11 2014 2:59 AM | Last Updated on Sat, Sep 2 2017 10:06 AM
Advertisement
Advertisement