తెలంగాణ యూనివర్సిటీలో బుధవారం ని ర్వహించిన తొలి స్నాతకోత్సవం వెలవెలబోయింది. వర్సిటీ చాన్స్‌లర్, రాష్ట్ర గవర్నర్ నరసింహన్ ఈ వేడుకకు దూరంగా ఉన్నారు. దీంతో గవర్నర్ చేతుల మీదుగా గోల్డ్‌మెడల్స్ అందుకోవడం గర్వకారణంగా ఉంటుందని భావించిన వారికి నిరాశే మిగిలింది. జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు సైతం స్నాతకోత్సవంలో పాల్గొనకపోవడంతో కార్యక్రమం కళావిహీనంగా మారింది. లక్షలు ఖర్చు చేసి నిర్వహించిన కార్యక్రమంలో వర్సిటీ విద్యార్థులను భాగస్వాములను చేయకపోవడం, టాపర్లకు మాత్రమే వేదికపై గోల్డ్‌మెడల్స్, కాన్వకేషన్స్ అందజేయడంతో మిగిలిన విద్యార్థులు ఆవేదనకు లోనయ్యారు. వర్సిటీ ఏర్పడిన నాటినుంచి ఇప్పటివరకు ఆరు బ్యాచులు పూర్తయ్యాయి. ఆయా కోర్సుల్లో టా పర్లుగా నిలిచిన వారందరినీ వేదికపైకి పిలిచి కాన్వకేషన్లు ఇవ్వాలని పూర్వ విద్యార్థులు పలుమార్లు వర్సిటీ అధికారులను కోరారు. అయితే దీనిని వీసీ పట్టించుకోకపోవడంతో చాలా మం ది కార్యక్రమానికి దూరంగా ఉన్నారు. దీంతో కుర్చీలు ఖాళీగా కనిపించాయి. స్నాతకోత్సవానికి హాజరైన అతిథులకు, విద్యార్థులకు కనీసం మంచినీళ్లు అందించే వారు కరువయ్యారు. చాలా మందికి భోజనం సైతం అందలేదు.
కార్యక్రమాన్ని విద్యార్థి సంఘాల నాయకులు అడ్డుకుంటారేమోననే అనుమానంతో భారీ స్థాయిలో ఏర్పాటు చేశారు. వర్సిటీలో ప్రస్తుతం చదువుతున్న విద్యార్థులను కార్యక్రమానికి అనుమతించకుండా భవనం బయట టెంటు వేసి ఒక ఎల్‌సీడీని ఏర్పాటు చేశారు. దీనిపై విద్యార్థులు తీవ్ర నిరసన తెలిపారు. కాన్వకేషన్ పేరు మీద విద్యార్థుల నుంచి వేలాది రూపాయలు వసూలు చేసి సరైన సౌకర్యాలు కల్పించలేదని పలువురు విద్యార్థులు వర్సిటీ ఉన్నతాధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. భవిష్యత్తు కార్యక్రమాల్లోనైనా తమను భాగస్వాములను చేయాలని విద్యార్థులు డిమాండ్ చేశారు.
స్నాతకోత్సవం వెలవెల
Published Thu, Nov 14 2013 3:41 AM | Last Updated on Sat, Sep 2 2017 12:34 AM
Advertisement
Advertisement