సిబ్బంది లేకే ఇబ్బంది! | staff Shortage in Telangana University | Sakshi
Sakshi News home page

సిబ్బంది లేకే ఇబ్బంది!

Published Wed, Sep 13 2017 11:46 AM | Last Updated on Tue, Sep 19 2017 4:30 PM

సిబ్బంది లేకే ఇబ్బంది!

సిబ్బంది లేకే ఇబ్బంది!

సమస్యల వలయంలో తెలంగాణ యూనివర్సిటీ

 నిజామాబాద్‌ నుంచి పాత బాలప్రసాద్‌ :
తెలంగాణ యూనివర్సిటీలో బోధన, బోధ నేతర సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. ఏళ్ల తరబడి సిబ్బంది నియామకాలు చేపట్టక పోవడంతో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందడం లేదు. యూనివర్సిటీలో ప్రస్తుతం 18 విభాగాలు, 26 కోర్సులు నడుస్తున్నాయి. తెయూకు డిచ్‌పల్లిలో మెయిన్‌ క్యాంపస్, భిక్కనూర్‌లో సౌత్‌ క్యాంపస్, సారంగపూర్‌లో ఎడ్యుకేషన్‌ క్యాంపస్‌లు ఉన్నాయి. తెయూ టీచింగ్‌ విభాగంలో ప్రస్తుతం 71 మంది రెగ్యులర్‌ అధ్యాపకులు పనిచేస్తున్నారు. వీరితోపాటు 52 మంది అకాడమిక్‌ కన్స ల్టెంట్లు విధులు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం ఇటీవలే 59 పోస్టులను మంజూరు చేసింది. త్వరలోనే పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీచేసే అవకాశాలున్నాయి.

77లో ఆరుగురు మైనస్‌..
తెయూలో 77 మంది రెగ్యు లర్‌ ఫ్యాకల్టీ ఉండగా వారిలో ప్రస్తుతం 71 మంది విధులు నిర్వహిస్తున్నారు. ఒకరు  అనారోగ్యంతో మృతి చెందగా మరొకరు పదవీ విరమణ చేశారు. ఇద్దరు డిప్యుటేషన్‌పై ఇతర యూనివర్సిటీలకు వెళ్లగా, ఇద్దరు రాజీనామా చేశారు. 67 రెగ్యులర్‌ పోస్టులు ఖాళీగా ఉండగా, 52 మంది అకాడమిక్‌ కన్సల్టెంట్లు పనిచేస్తున్నారు. పెరిగిన కోర్సులకు మరో 63 అధ్యాపక పోస్టులు మంజూరు కావాల్సి ఉంది.

అన్ని కోర్సుల్లోనూ సిబ్బందిలేక ఇబ్బందులే..
పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్, మాథ్స్, బీఈడీ, ఎంఈడీ, ఎల్‌ఎల్‌ఎం, కెమిస్ట్రీ రెండేళ్ల పీజీ కోర్సులకు రెగ్యులర్‌ ఫ్యాకల్టీ లేక కేవలం అకాడమిక్‌ కన్సల్టెంట్లతోనే తరగ తులు నిర్వహిస్తున్నారు. అప్లయిడ్‌ స్టాటిస్టిక్స్‌ కోర్సు ఎనిమిదేళ్లుగా కేవలం ఒక్క అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌తోనే కొనసాగుతోంది. ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ కోర్సు ఐఎంబీఏ అకాడమిక్‌ కన్సల్టెంట్లతోనే కొనసాగుతున్నది. భిక్క నూర్‌ సౌత్‌ క్యాంపస్‌లో ఒకప్పుడు రాష్ట్రంలోనే పేరొం దిన ఆర్గానిక్‌ కెమిస్ట్రీ కోర్సును ఓయూ నుంచి తెయూ కు బదిలీ అయిన తర్వాత ఒక రెగ్యులర్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్, అకాడమిక్‌ కన్సల్టెంట్లతో నిర్వహిస్తున్నారు. గతంలో ఆర్గానిక్‌ కెమిస్ట్రీ పూర్తి చేసిన విద్యార్థులు 30కి 30 మంది  సీఎస్‌ఐఆర్‌ ఫెలోషిప్‌తోపాటు మంచి ఉద్యోగాలు సాధించేవారు. ప్రస్తుతం డిచ్‌పల్లి మెయిన్‌ క్యాంపస్‌లో ఆర్గానిక్‌ కెమిస్ట్రీ కోర్సును ప్రవేశపెట్టడంతో రెగ్యులర్‌ ఫ్యాకల్టీ మొత్తం ఇక్కడే ఉండి పోయారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement