సాక్షి, నిజామాబాద్: తెలంగాణ యూనివర్సిటీలో (Telangana university) మంగళవారం విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సోదాలు కొనసాగుతున్నాయి. గత కొంతకాలంగా యూనివర్సిటీలో అక్రమాలు జరుగుతున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో అధికారులు సోదాలు నిర్వహిస్తుండడం చర్చనీయాంశంగా మారింది.
ఈసీ సభ్యులకు, వీసీకి మధ్య విబేధాలపై తనిఖీలు నిర్వహిస్తున్న అధికారులు దృష్టిసారించారు. ఇదిలా ఉంటే.. యూనివర్సిటీలో అక్రమ నియామకాలు, అక్రమ లావాదేవీలు జరిగాయని ఈసీ చర్యలకు దిగింది. వీసీ రవీందర్ గుప్తా అక్రమాలకు పాల్పడ్డారని రిజిస్ట్రార్‌ను మారుస్తామని ఈసీ ప్రకటించింది. దీనికి వ్యతిరేకంగా కొత్త రిజిస్ట్రార్‌ను నియమిస్తూ వీసీ నిర్ణయం తీసుకున్నారు.
దీంతో యూనివర్సిటీలో పాలన గందరగోళంగా మారింది. ఈసీ సభ్యులకు, వీసీకి మధ్య ప్రచ్చన్న యుద్ధం కొనసాగుతోంది. అక్రమ నియామకాలు, లావాదేవీలు జరిగాయనే ఆరోపణలు వెల్లువెత్తడంతో విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు రంగంలోకి దిగారు.
ఇదీ చదవండి: జాతీయ ర్యాంకుల్లో తెలంగాణ వర్సిటీలు డల్.. కారణం అదేనా!
Comments
Please login to add a commentAdd a comment