మనమే హీరోలం | Senior IAS officer C. Parthasarathi | Sakshi
Sakshi News home page

మనమే హీరోలం

Published Sun, Jan 25 2015 3:11 AM | Last Updated on Sat, Sep 2 2017 8:12 PM

మనమే హీరోలం

మనమే హీరోలం

తెయూ(డిచ్‌పల్లి) : సినిమా హీరోలు కేవలం నటులు మాత్రమే. వారిని అభిమానిస్తూ, అనుకరిస్తూ సమయం వృథా చేసుకోవద్దు. మీ జీవితంలో మీరే హీరోలుగా ఎదగాలంటూ తెలంగాణ యూనివర్సిటీ ఇన్‌చార్జి వైస్ చాన్స్‌లర్, సీనియర్ ఐఏఎస్ అధికారి సి. పార్థసారథి విద్యార్థులకు సూచించారు. విద్యార్థులు, యువత కేవలం చరిత్ర చదివే వారిలా మిగలకుండా, చరిత్ర సృష్టించే వారిగా ఎదగాలన్నారు.

తెలంగాణ యూనివర్సిటీ, జిల్లా బీసీ స్టడీ సర్కిల్ సంయుక్త ఆధ్వర్యంలో వర్సిటీలోని కంప్యూటర్ అండ్ ఇంజినీరింగ్ కాలేజీ ఆవరణలో శనివారం ‘పెయింట్ యువర్ డ్రీమ్స్(కలలకు రూపమిద్దాం)’ రెండో విడత కార్యక్రమానికి వీసీ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. బుద్ధి, మనస్సు రె ండింటి మధ్య నిరంతరం సంఘర్షణ జరుగుతుందని, బుద్ధి గెలిస్తే మని షి జీవితంలో విజయం సాధించినట్లేనని ఆయన అన్నారు. జీవితంలో నిద్దిష్ట లక్ష్యాలు ఉండాలని, విజయానికి సంబంధించి పక్కా విజన్ ఏర్పరుచుకుని అందుకనుగుణంగా పాజిటీవ్ ఆలోచనలతో ముందుకు సాగాలన్నారు.

నా జీవితానికి నాదే బాధ్యత అన్న విధంగా ఉండాలన్నారు. మన్నుతిన్న పాముల్లాగా, కుక్కిన పేనుల్లాగా ఉండొద్దన్నారు. ప్రతి వ్యక్తికి తన విధిని తానే లిఖించుకునే అవకాశం ఉందని, జీవితంలో ప్రతిదాన్ని ఎంచుకునే అవకా శం మనిషికి ఉంటుందన్నారు. తన భవిష్యత్తును తానే తీర్చిదిద్దుకోవాలన్నారు. గొప్ప వ్యక్తులైన మార్టిన్ లూథర్‌కింగ్, మదర్ థెరిస్సా, డాక్టర్ బీఆర్ అంబేద్కర్, స్వామి వివేకానంద, స్టీఫెన్ హాకింగ్ లాంటి వారి జీవితాల నుంచి పాఠాలు నేర్చుకోవాలన్నారు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం చెప్పిన  విధంగా కలలు కనండి.. వాటిని సాకారం చేసుకోండని అన్నారు.

పార్థసారథి తనదైన శైలిలో విద్యార్థుల మధ్య కలియ తిరుగుతూ వారిలో స్ఫూర్తిని నింపే ప్రసంగం చే శారు. భారత దేశం 2020 సంవత్సరానికి ప్రపంచ దేశాల్లో అత్యధిక శాతం యువకులు ఉన్న దేశంగా ఎదుగుతుందని పార్థసారథి అన్నారు. ప్రపంచ దేశాల చూపంతా భారత్ పైనే ఉందన్నారు. యువత సరైన నైపుణ్యాలు పెంపొం దించుకుంటే  ప్రపంచంలో భారత్ సూపర్ పవర్‌గా ఎదుగుతుందన్నారు. అగ్రరాజ్యంగా ఎదగాలంటే యువత చోదక శక్తిగా ఉండాలన్నారు. మనకు చైనా నుండి గట్టి పోటీ ఉంటుందని, నైపుణ్యాల పెంపుతో అధిగమించే అకాశాలుంటాయన్నారు.

యువత తమ స్నేహాలను, స్నేహితులను మంచిగా ఎంచుకోవాలని, జీవితంలో ఉన్నత స్థాయికి చేరాలంటే తమకున్న కొన్ని దురలవాట్లను వదిలించుకోవాలని సూచించారు. తాను అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పిన విద్యార్థులకు బహుమతులను అందజేసి వీసీ వారిని ప్రోత్సహించారు. తెయూ ఇన్‌చార్జి రిజిస్ట్రార్ ప్రొఫెసర్ లింబాద్రి  ప్రారంభోపన్యాసం చేశారు. విద్యార్థులలో ప్రేరణ, మానసిక స్థైర్యం, నైపుణ్యాల పెంపు, పోటీ పరీక్షలపై అవగాహన కల్పించడానికే ‘పెయింట్ యువర్ డ్రీమ్స్’ కార్యక్రమం చేపట్టినట్లు వివరించారు. బీసీ స్టడీ సర్కిల్ రాష్ట్ర డెరైక్టర్ అలోక్‌కుమార్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో 9 బీసీ స్టడీ సర్కిళ్లు ఉన్నాయన్నారు. వీటి ద్వారా విద్యార్థులకు గ్రూప్-1, గ్రూప్-2, సివిల్స్, ఇతర పోటీ పరీక్షలకు సంబంధించిన ఉచిత శిక్షణ ఇస్తున్నామన్నారు.
 
జిల్లా బీసీ సంక్షేమాధికారిణి విమల దేవి మాట్లాడుతూ.. జిల్లా కేంద్రంలోని నాగారం స్టేడియంలో బీసీ స్టడీ సర్కిల్ ఉందని తెలిపారు. పోటీ పరీక్షలపై విద్యార్థులకు 45 రోజుల పాటు ఉచిత శిక్షణ ఇస్తామని తెలిపారు. భోజన వసతి సౌకర్యాల తో పాటు ఉపకార వేతనం, స్టడీ మెటీరియల్‌ను అందజేస్తామని, విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా అదనపు సంయుక్త కలె క్టర్ శేషాద్రి, వర్సిటీ బీసీ సెల్ డెరైక్టర్ శ్రీనివాస్, సమాన అవకాశాల సెల్ డెరైక్టర్ అపర్ణ,  పోటీ పరీక్షల సెల్ డెరైక్టర్ బాల శ్రీనివాసమూర్తి, లక్ష్మణ చక్రవర్తి, పీఆర్‌ఓ రాజారాం, ఏపీఆర్‌ఓ అబ్దు ల్ ఖవి, అధ్యాపకులు, క్యాంపస్ విద్యార్థులతో పాటు వివిధ కళాశాలల విద్యార్థులు పాల్గొన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement