పరీక్షలు రాసింది 69 మందే..
Published Wed, Dec 11 2013 4:37 AM | Last Updated on Sat, Sep 2 2017 1:27 AM
తెయూ(డిచ్‌పల్లి), న్యూస్‌లైన్ : తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని పీజీ సెమిస్టర్ పరీక్షలకు మంగళవారం రెండోరోజు 69 మంది విద్యార్థులు మాత్రమే హాజరయ్యారు. డిచ్‌పల్లి మెయిన్ క్యాంపస్ లో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశా రు. సెమిస్టర్ పరీక్షలు జరుగుతున్న మెయిన్ క్యాంపస్, భిక్కనూర్ సౌత్‌క్యాంపస్‌తో పా టు బాన్సువాడ, కామారెడ్డి, బోధన్, ఆర్మూ ర్, నిజామాబాద్ కేంద్రాల్లో 1,316 మంది విద్యార్థులున్నారు. మెయిన్ క్యాంపస్‌లో 25 మంది, ఆర్మూర్‌లో 42 మంది, నిజామాబాద్‌లోని ప్రభుత్వ గిరిరాజ్ పీజీ కళాశాల కేంద్రంలో ఇద్దరు విద్యార్థులు పరీక్షలు రాశారని వర్సిటీ అధికారులు తెలిపారు.
పరీక్షలు వాయిదా వేయాలి
పరీక్షలను వాయిదా వేయాలని కోరుతూ ఆర్మూర్ నరేంద్ర కళాశాలకు చెందిన పలువు రు విద్యార్థులు వర్సిటీ రిజిస్ట్రార్ లింబాద్రిని కలిశారు. అయితే పరీక్షలను వాయిదా వేసే ప్రసక్తే లేదని రిజిస్ట్రార్ తేల్చిచెప్పడంతో వారు వెనుదిరిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పరీక్షలు బహిష్కరించాలని పిలుపునిచ్చినవారిలో కొందరు పరీక్షలు రాస్తున్నారని, వారు తమను తప్పుదారి పట్టించారని పేర్కొన్నారు.
సౌత్ క్యాంపస్‌లో..
భిక్కనూరు : వర్సిటీ సౌత్‌క్యాంపస్‌లో మంగళవారం పీజీ ద్వితీయ సంవత్సరం మూడో సెమిస్టర్ పరీక్షలను విద్యార్థులు బహిష్కరిం చారు. పరీక్షలు వాయిదా వేయాలని వర్సిటీ ఉన్నతాధికారులకు విన్నవించినా పట్టించుకోలేదని విద్యార్థులు ఆరోపించారు.
‘గిరిరాజ్’లో...
నిజామాబాద్ అర్బన్ : పరీక్షలను వాయిదా వేయాలని డీవైఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు శ్యాం బాబు డిమాండ్ చేశారు. ఎస్‌ఎఫ్‌ఐ కార్యకర్త లు మంగళవారం జిల్లాకేంద్రంలోని ప్రభు త్వ గిరిరాజ్ కళాశాలలో పీజీ పరీక్షలను బహిష్కరించారు. ఈ సందర్భంగా శ్యాంబాబు మాట్లాడుతూ వీసీ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. పరీక్షలను వాయిదా వేస్తామని చెప్పిన ఆయన తర్వాతి రోజే మాట మార్చారని విమర్శించారు. పరీక్షలను వాయిదా వేయకపోతే ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.
వాయిదా వేసే ప్రసక్తే లేదు
సెమిస్టర్ పరీక్షలను ఎట్టి పరిస్థితుల్లోనూ వాయిదా వేయబోమని తెలంగాణ యూనివర్సిటీ వీసీ అక్బర్ అలీఖాన్ స్పష్టం చేశారు. మంగళవారం సాయంత్రం తన చాంబర్‌లో విలేకరులతో మాట్లాడారు. విద్యార్థులతో సంప్రదించిన తర్వాతే పరీక్ష తేదీలను ప్రకటించామన్నారు. నవంబర్ 25న ప్రారంభం కావాల్సిన పరీక్షలను విద్యార్థుల వినతి మేరకు డిసెంబర్ 3 వ తేదీకి, తర్వాత డిసెంబర్ 9వ తేఈదకి వాయిదా వేశామన్నారు. వచ్చేనెల 2వ తేదీకి వాయిదా వేయాలని విద్యార్థులు మళ్లీ కోరారని, అయితే ఈనెల 16వ తేదీకి వాయిదా వేయడానికి తాను అంగీకరించినా విద్యార్థులు వినలేదని పేర్కొన్నారు. జనవరిలో సంక్రాంతి సెలవులు ఉంటాయని, అందుకే ఈ నెలలోనే పరీక్షలు నిర్వహిస్తున్నామని అన్నారు. భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకొని అందరూ పరీక్షలు రాయాలని సూచించారు. బుధవారం నుంచి పరీక్షలు రాస్తే, మొదటి రెండు రోజులు గైర్హాజరైనవారికి మరో తేదీన పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. సమావేశంలో రిజిస్ట్రార్ లింబాద్రి, అకడమిక్ ఆడిట్ సెల్ డెరైక్టర్ యాదగిరి పాల్గొన్నారు.
Advertisement
Advertisement