
త్వరలో కొత్త పార్టీ!
ప్రజా గాయకుడు గద్దర్
డిచ్‌పల్లి (నిజామాబాద్ రూరల్): రాష్ట్రంలో త్వరలో త్యాగాలు చేసినవారంతా ఏకమవుతారు.. త్యాగాల తెలంగాణ లాంటి ఒక పార్టీ ఏర్పడుతుందని ప్రజా గాయకుడు గద్దర్ అన్నారు. బుధవారం రాత్రి తెలంగాణ యూనివర్సిటీలో అంబేడ్కర్ స్టూడెంట్ అసోసియేషన్ ఆధ్వ ర్యంలో నిర్వహించిన మహనీయుల జయంతి కార్యక్రమంలో గద్దర్ ప్రసంగించారు.
ప్రస్తుతం భౌగోళిక తెలంగాణ వచ్చిందని, పాలన పైనుంచి జరుగుతుందనీ, అది ఉన్నత వర్గాల వారికే ఉపయోగ పడుతుందన్నారు. త్యాగాల తెలంగాణ రావాలన్నారు.