తెయూ(డిచ్‌పల్లి): తెలంగాణ యూనివర్సిటీ అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది (టూటా)ఆధ్వర్యంలో వర్సిటీ పరిపాలనా భవనం ఎదుట గురువారం మహా ధర్నా నిర్వహించారు. రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల ఉద్యోగుల, అధ్యాపకుల జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపు మేరకు మహాధర్నా చేపట్టారు.
యూనివర్సిటీలకు ఏకమొత్తంలో విడుదల చేసే నిధులు(బ్లాక్ గాంట్స్) పెంచాలని, వర్సిటీ ఉద్యోగులందరికీ హెల్త్ కార్డులందించి ఉచిత వైద్య సదుపాయం కల్పించాలని, ఔట్ సోర్సింగ్ సిబ్బందిని రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. టూటా అధ్యక్షుడు ప్రొఫెసర్ శివశంకర్, ప్రధానకార్యదర్శి, వర్సిటీ ఇన్‌చార్జి రిజిస్ట్రార్ ప్రొఫెసర్ యాదగిరి మాట్లాడుతూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత యూనివర్సిటీలకు నిధు లు భారీగా పెరుగుతాయని ఆశించామన్నారు.
అయితే గత ప్రభుత్వాల వలనే అరకొర నిధులతో సరిపెట్టారని విమర్శించారు. రెగ్యులర్ వైస్ చాన్స్‌లర్‌లను నియమించాలన్నారు. నాన్-టీచింగ్ ఉద్యోగుల సం ఘం అధ్యక్షుడు మనోహర్‌గౌడ్ మాట్లాడుతూ.. ప్రభు త్వ ట్రెజరీ నుంచి వర్సిటీల ఉద్యోగులందరికీ జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల యూ నియన్ అధ్యక్షుడు శ్రీనివాస్ మాట్లాడు తూ.. ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. టూటా ఉపాధ్యక్షులు మమత, పున్నయ్య, జాన్సన్, ఇక్బాల్ ఖురేషీ, సాయాగౌడ్, విజ యలక్ష్మి, టీచింగ్, నాన్-టీచింగ్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
వర్సిటీలకు నిధులు పెంచాలి
Published Fri, Nov 14 2014 3:55 AM | Last Updated on Sat, Sep 2 2017 4:24 PM
Advertisement
Advertisement