Free medical services
-
జగనన్న ఆరోగ్య సురక్షజనాలకు రక్ష
గుంటూరు జిల్లా కాకుమాను మండలం అప్పాపురానికి చెందిన జి.సుబ్బారావుకు 69 ఏళ్లు. కొద్ది రోజులుగా కంటి చూపు సంబంధిత సమస్యతో బాధపడుతున్నాడు. వైద్య పరీక్షలు చేయించుకోవాలంటే సెకండరీ కేర్ ఆస్పత్రికి.. లేదంటే గుంటూరులోని పెద్దాస్పత్రికి వెళ్లాల్సి ఉంటుంది. ఆస్పత్రికి వెళ్లి రావడానికి ప్రయాణచార్జీలు, ప్రయాసల భారం తప్పనిసరి. అయితే ఇవేవీ లేకుండా ప్రభుత్వం అమలు చేస్తున్న జగనన్న ఆరోగ్య సురక్ష(జేఏఎస్) కార్యక్రమం ద్వారా గ్రామంలోనే సుబ్బారావుకు ప్రభుత్వం కంటి పరీక్షలు నిర్వహించింది. ఈ నెల ఐదో తేదీన రెండో దశ జేఏఎస్లో భాగంగా గ్రామంలో వైద్య శాఖ సురక్ష వైద్య శిబిరం నిర్వహించింది. ర్యాండమ్ బ్లడ్ షుగర్, రక్తపోటుతో పాటు, విజన్ టెస్ట్‌లను గ్రామంలోనే ఉచితంగా నిర్వహించారు. విజన్ టెస్ట్‌లో గుర్తించిన అంశాల ఆధారంగా చూపు సమస్య నివారణకు ప్రభుత్వమే ఉచితంగా చికిత్స అందించింది. సాక్షి, అమరావతి: సుబ్బారావు తరహాలోనే రాష్ట్రంలో అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి జేఏఎస్ కార్యక్రమం వరంగా మారింది. సమయం, ఓపిక లేని, ఆర్థిక పరిస్థితులు సహకరించని, అదే పనిగా ఆస్పత్రులకు వెళ్లి చికిత్సలు చేయించుకోలేని లక్షలాది మంది ఆరోగ్య సమస్యలను జేఏఎస్ పరిష్కరిస్తోంది. గ్రామ స్థాయిలోనే స్పెషలిస్ట్ వైద్యులు ప్రజల ఆరోగ్య సమస్యలను గుర్తిస్తున్నారు. మందులు అవసరమైతే అక్కడికక్కడే ఉచితంగా అందిస్తున్నారు. మెరుగైన చికిత్సలు అవసరమైతే ఆస్పత్రులకు రిఫర్ చేస్తున్నారు. రిఫరల్ కేసుల్లో వైఎస్సార్ ఆరోగ్యశ్రీ కింద ప్రభుత్వమే ఉచితంగా వైద్యం అందిస్తోంది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారికి ప్రభుత్వమే మందులను డోర్ డెలివరీ చేస్తోంది. 4.19 లక్షల మందికి ఉచిత వైద్యం రెండో దశ జేఏఎస్ కార్యక్రమాన్ని ఈ నెల రెండో తేదీ నుంచి ప్రభుత్వం ప్రారంభించింది. ఒక జిల్లాలోని మండలాలను రెండుగా విభజించి సగం మండలాల్లో మంగళవారం, మిగిలిన మండలాల్లో శుక్రవారం శిబిరాలు నిర్వహిస్తున్నారు. ఇక పట్టణ, నగరాల్లో బుధవారం శిబిరాలుంటాయి. ఆరు నెలల్లో రాష్ట్రం మొత్తం శిబిరాలు నిర్వహించేలా కార్యాచరణతో ముందుకెళుతున్నారు. కాగా, ఇప్పటి వరకూ రాష్ట్ర వ్యాప్తంగా 1,315 సురక్ష వైద్య శిబిరాలు నిర్వహించగా.. సగటున 319 మంది చొప్పున 4,19,249 మంది స్వగ్రామం, వార్డుల్లోనే చికిత్సలు అందుకున్నారు. నంద్యాల జిల్లాలో 56 శిబిరాలు నిర్వహించగా రాష్ట్రంలోనే అత్యధికంగా ఇక్కడ సగటున 458 ఓపీలు నమోదు కావడం విశేషం. ఇక ఇప్పటి వరకూ జేఏఎస్–2లో వైద్య సేవలు పొందిన వారిలో మహిళలే ఎక్కువగా ఉన్నారు. మొత్తంగా 4.19 లక్షల మంది సేవలు పొందగా.. వీరిలో 2.19 లక్షల మంది మహిళలు, 1.99 లక్షల మంది పురుషులున్నారు. మూడు వేల మంది స్పెçషలిస్ట్ వైద్యులతో ఆరు నెలల్లో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో రెండో దశ ఆరోగ్య సురక్ష నిర్వహించేలా వేగంగా అడుగులు వేస్తున్నారు. జనవరిలో 3,583 శిబిరాలను నిర్వహించాల్సి ఉండగా.. ఇప్పటికే 1,315 శిబిరాలు పూర్తయ్యాయి. ఇక షెడ్యూల్ ప్రకారం గ్రామం/వార్డులో సురక్ష శిబిరం ఏర్పాటుకు 15 రోజుల ముందు ఒకసారి, మూడు రోజుల ముందు రెండో సారి వలంటీర్లు, ప్రజాప్రతినిధులు ప్రతి ఇంటికీ వెళ్లి జేఏఎస్–2 పై అవగాహన కల్పిస్తున్నారు. ప్రతి శిబిరంలో స్థానిక మెడికల్ ఆఫీసర్‌తో పాటు, ఇద్దరు స్పెషలిస్టు వైద్యులు, పారామెడికల్ ఆప్తాల్మిక్ అసిస్టెంట్ ఉంటారు. ప్రజలకు సొంత ఊళ్లలోనే స్పెషలిస్ట్ వైద్య సేవలందించేందుకు 543 జనరల్ మెడిసిన్, 645 గైనకాలజిస్ట్, 349 జనరల్ సర్జన్, 345 ఆర్థోపెడిక్స్, 378 మంది చొప్పున ఇతర స్పెషలిస్ట్‌లు మూడు వేల మంది వరకూ వైద్యులను, కంటి సమస్యల గుర్తింపునకు స్క్రీనింగ్ చేపట్టడానికి 562 పారామెడికల్ ఆప్తాల్మిక్ ఆఫీసర్లను డిప్లాయ్ చేశారు. వైద్య పరీక్షల నిర్వహణకు ఏడు రకాల కిట్లను, ఈసీజీ, ఇతర పరికరాలను, వందల సంఖ్యలో మందులను శిబిరాల్లో అందుబాటులో ఉంచారు. 268 మందికి క్యాటరాక్ట్ సర్జరీలు చేయించాం తొలి ఆరోగ్య సురక్షలో మా పీహెచ్సీ పరిధిలో 111 మందిని తదుపరి వైద్యం కోసం ఆస్పత్రులకు రిఫర్ చేశాం. వారిలో 72 మందికి ఆరోగ్యశ్రీ పథకం కింద ఉచితంగా చికిత్సలు పూర్తయ్యాయి. ఇక 306 మందిలో కంటి సమస్యలను గుర్తించాం. వీరిలో 268 మందికి క్యాటరాక్ట్ సర్జరీలు పూర్తయ్యాయి. మిగిలిన వారు పొలం పనుల కారణంగా చికిత్సలు, క్యాటరాక్ట్ సర్జరీలను వాయిదా వేసుకున్నారు. వారికి కూడా వీలైనంత త్వరగా చికిత్సలు పూర్తి చేసేలా ఫాలోఅప్ చేస్తున్నాం. – డాక్టర్ సుశ్మప్రియదర్శిని, మెడికల్ ఆఫీసర్, వత్సవాయి పీహెచ్సీ, ఎన్టీఆర్ జిల్లా ఆరోగ్యశ్రీ కింద స్టంట్ వేశారు గతేడాది మా ఊళ్లో ప్రభుత్వం సురక్ష శిబిరం నిర్వహించింది. ఆయాసం, ఇతర సమస్యలతో బాధపడుతున్న నేను శిబిరంలో స్పెషలిస్ట్ వైద్యుడికి చూపించుకున్నాను. ఈసీజీ తీశారు. ఈ క్రమంలో గుండెకు సంబంధించి సమస్య ఉన్నట్టు గుర్తించారు. విజయవాడ ఆస్పత్రికి రిఫర్ చేశారు. అక్కడికి వెళ్లగా.. రక్తనాళాలు పూడుకుని పోయినట్టు గుర్తించి స్టంట్ వేశారు. – భారతీలక్ష్మి, దబ్బాకుపల్లి, ఎన్టీఆర్ జిల్లా చేయి పట్టి నడిపిస్తూ వైద్య శిబిరాల ద్వారా స్వగ్రామాల్లోనే వైద్య సేవలు అందించడమే కాకుండా అనంతరం కూడా అనారోగ్య బాధితులను వైద్య పరంగా ప్రభుత్వం చేయిపట్టి ముందుకు నడిపించనుంది. జేఏఎస్ శిబిరాల నుంచి మెరుగైన వైద్యం కోసం ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రులకు రిఫర్ చేసిన రోగులను ఫ్యామిలీ డాక్టర్, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్, ఏఎన్ఎంలు పర్యవేక్షిస్తున్నారు. వీరు ఆస్పత్రులకు వెళ్లి వైద్య సేవలు పొందడం కోసం ప్రభుత్వం ఇప్పటికే ప్రయాణ చార్జీల కింద రూ.500 చొప్పున పంపిణీ చేస్తోంది. ఈ క్రమంలో రిఫరల్ రోగులను ఆస్పత్రులకు తరలించి, అక్కడ ఉచితంగా అన్ని వైద్య సేవలు అందేలా సమన్వయం చేస్తారు. జీజీహెచ్‌లు, ప్రైవేట్ నెట్వర్క్ ఆస్పత్రుల్లో కూడా ఆరోగ్య సురక్ష రిఫరల్ కేసుల కోసం ప్రత్యేక కౌంటర్లు ఉంటాయి. దీర్ఘకాలిక జబ్బులతో బాధపడుతున్న వారికి ప్రభుత్వం అండగా నిలుస్తుంది. వీరికి ఉచిత కన్సల్టేషన్లతో పాటు కాలానుగుణంగా ఉచితంగా మందులు అందజేస్తోంది. జగనన్న ఆరోగ్య సురక్ష తొలి దశలో అందించిన సేవలు ఆరోగ్య సిబ్బంది సందర్శించిన గృహాలు 1,45,35,705 నిర్వహించిన వైద్య పరీక్షలు 6,45,06,018 నిర్వహించిన మొత్తం సురక్ష శిబిరాలు 12,423 (రూరల్–10,033, అర్బన్–2,390) శిబిరాల్లో నమోదైన ఓపీలు 60,27,843 తదుపరి వైద్యం కోసం నెట్వర్క్ ఆస్పత్రులకు రిఫరల్ 1,64,982 మంది -
రూ. 25 లక్షల వరకు ఆరోగ్య శ్రీ
సాక్షి, అమరావతి: ఓ మనిషి ప్రాణాన్ని కాపాడేందుకు వైద్యులు ఎంతో శ్రమిస్తారు.. అందుకే డాక్టర్ని దేవుడంటారు! మరి ఏకంగా కోటిన్నర కుటుంబాలకు ఆరోగ్యదాతను ఏమని పిలవాలి? నాలుగున్నరేళ్లలో దాదాపు నలభై లక్షల మందికి ఉచిత వైద్యంతో ప్రాణం పోసిన ‘డాక్టర్’ను ఎవరితో పోల్చాలి? ఆస్పత్రి నుంచి ఇంటికి వెళ్లాక జీవన భృతి కోసం ఆదుర్దా పడకుండా రోగికి డబ్బులిచ్చి మరీ చిరునవ్వుతో సాగనంపే మానవీయ కోణాన్ని ఎవరైనా ఎలా మరువగలరు? ప్రజారోగ్యానికి అత్యంత ప్రాధాన్యమిస్తూ డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీకి ఊపిరిలూదిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆరోగ్యశ్రీ పథకం ద్వారా రూ.25 లక్షల వరకు ఉచితంగా వైద్యం అందించాలని నిర్ణయించారు. తద్వారా గుండె, కిడ్నీ, న్యూరో లాంటి ఎంత పెద్ద జబ్బులకైనా చేతి నుంచి చిల్లి గవ్వ ఖర్చు చేయాల్సిన అవసరం లేకుండా నిరుపేద, మధ్య తరగతి కుటుంబాలకు ఖరీదైన వైద్యం అందనుంది. ఇప్పటికే ఆరోగ్యశ్రీ కింద అందించే చికిత్సల సంఖ్యను 1,059 నుంచి ఏకంగా మూడు రెట్లకుపైగా పెంచి 3,257కి చేర్చిన సీఎం జగన్ ఇక క్యాన్సర్ లాంటి ఖరీదైన జబ్బుల చికిత్సకు సైతం పరిమితి లేకుండా వ్యయాన్ని భరించేందుకు సిద్ధమయ్యారు. ఆరోగ్యశ్రీ సేవలను ప్రజలు అత్యంత సులభంగా పొందేలా ఆధునిక ఫీచర్లతో కొత్తగా కార్డులను రూపొందించిన రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 18వతేదీన నూతన మార్గదర్శకాలు జారీ చేయనుంది. ఈ సందర్భంగా అదే రోజు రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ (సీహెచ్‌వో), ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లు, వైఎస్సార్ విలేజ్ క్లినిక్స్, గృహ సారథులు, వలంటీర్లనుద్దేశించి సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడనున్నారు. ఆరోగ్యశ్రీ సేవలను ప్రజలు మరింత మెరుగ్గా వినియోగించుకునేలా విస్తృత ప్రచారం కల్పించడంపై దిశా నిర్దేశం చేస్తారు. అనంతరం 19వతేదీ నుంచి కొత్తగా రూపొందించిన 1.42 కోట్ల వైఎస్సార్ ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ ప్రారంభం కానుంది. దేశ ఆరోగ్య రంగంలో తొలిసారిగా... ఇటీవల జరిగిన వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పలు పార్టీలు ఆరోగ్యశ్రీ తరహాలో ఉచిత వైద్యం అందిస్తామని హామీలిచ్చాయి. తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ రూ.10 లక్షల వరకూ ఉచిత వైద్యం అందిస్తామని హామీ ఇవ్వగా బీఆర్ఎస్ రూ.15 లక్షల వరకూ ఉచిత వైద్యం సదుపాయం కల్పిస్తామని హామీ ఇచ్చింది. ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లో కూడా రాజకీయ పార్టీలు ఇలాంటి హామీలనే ఇచ్చాయి. అయితే దేశంలో ఎక్కడాలేని విధంగా ఆరోగ్యశ్రీ పథకం కింద రూ.25 లక్షల వరకూ ఉచితంగా వైద్యానికి ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వం భరోసా నివ్వడం గమనార్హం. గతంలో క్యాన్సర్ చికిత్సకు ఆరోగ్యశ్రీ కింద ఇచ్చే డబ్బులపై రూ.5 లక్షల వరకు పరిమితి ఉంది. ఆ తర్వాత ఎంత ఖర్చు అయినా రోగులే భరించాల్సి వచ్చేది. ఇప్పుడు ఈ పరిమితిని ఎత్తివేయడం ద్వారా పేద, మధ్య తరగతి ప్రజల ఆరోగ్యానికి పూర్తి భరోసానిస్తున్నారు. అందరికీ అభయం 2019లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఈ ఏడాది నవంబర్ నెలాఖరు నాటికి ఆరోగ్యశ్రీ పథకం కింద 37,40,525 మంది ఉచితంగా వైద్యం అందుకున్నారు. వీరి వైద్యం కోసం ప్రభుత్వం ఏకంగా రూ.11,859.96 కోట్లు ఖర్చు చేసింది. చికిత్స ఖర్చు రూ.వెయ్యి దాటితే ప్రభుత్వమే ఉచితంగా పథకం కింద వైద్యాన్ని అందిస్తోంది. మరోవైపు వైఎస్సార్ ఆరోగ్య ఆసరా కోసం రూ.1,309 కోట్లు వెచ్చించింది. ఇలా నాలుగున్నరేళ్లలో ఆరోగ్యశ్రీ, ఆసరా కోసం ఏకంగా రూ.13,168.96 కోట్లు వెచ్చించింది. గత సర్కారు 2014 – 19 మధ్య అరకొర ప్రొసీజర్లతో రూ.5,177.38 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. సీఎం జగన్ ప్రభుత్వం దేశంలోనే తొలిసారిగా కరోనాకు సంబంధించిన 10 రకాల చికిత్సలను 2021 మే, జూన్ నెలల్లో ఆరోగ్యశ్రీలోకి చేర్చింది. రెండు లక్షల మందికిపైగా బాధితులకు ఉచితంగా కోవిడ్ చికిత్స కోసం రూ.744 కోట్ల మేర ఖర్చు చేసింది. 2,198 ప్రొసీజర్స్ పథకంలోకి తెచ్చిన సీఎం జగన్ ప్రజారోగ్యానికి పెద్దపీట వేసిన సీఎం జగన్ వైద్య ఖర్చులు రూ.వెయ్యి దాటే ప్రతి చికిత్సకు ఆరోగ్యశ్రీ పథకాన్ని వర్తింపజేస్తామని 2019 ఎన్నికల సమయంలో మ్యానిఫెస్టో ద్వారా ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ మేరకు అధికారంలోకి వచ్చిన వెంటనే చర్యలు తీసుకున్నారు. 2020 జనవరిలో ప్రొసీజర్లను తొలుత 2059కి పెంచారు. అనంతరం అదే ఏడాది జూలైలో ప్రొసీజర్లను 2,200కి పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. దీనిద్వారా 54 క్యాన్సర్ చికిత్సలు పథకంలో అందుబాటులోకి వచ్చాయి. మరోవైపు 2020 నవంబర్‌లో బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్ లాంటి పలు పెద్ద చికిత్సలతో సహా 235 చికిత్సలతో ప్రొసీజర్స్ సంఖ్యను 2,436కి పెంచారు. పది రకాల కరోనా చికిత్సలను పథకంలోకి చేర్చడంతో ప్రొసీజర్స్ 2,446కి చేరాయి. గతేడాది మరో 809 చికిత్సలను చేర్చడంతో ఆరోగ్యశ్రీ పథకంలో 3,257 ప్రొసీజర్లు సమకూరాయి. గర్భిణులకు ఉచితంగా టిఫా స్కాన్ సేవలు అందించేందుకు ఇటీవలే మరో రెండు ప్రొసీజర్లను పథకంలో చేర్చారు. 2019లో వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చే నాటికి 1,059 ప్రొసీజర్లు మాత్రమే ఉండగా వీటికి అదనంగా 2,198 ప్రొసీజర్లను ఆరోగ్యశ్రీలో చేర్చి మొత్తం 3,257 ప్రొసీజర్లతో పథకాన్ని అమలు చేస్తూ సీఎం జగన్ చరిత్ర సృష్టించారు. ఇంటికి వెళ్లి యోగక్షేమాల ఆరా.. వైఎస్సార్ ఆరోగ్య ఆసరా ద్వారా 1,519 ప్రొసీజర్లకు సంబంధించి రోగి ఇంటివద్ద కోలుకుంటూ విశ్రాంతి తీసుకునే సమయంలో రోజుకు రూ.225 చొప్పున నెలకు గరిష్టంగా రూ.ఐదు వేలు వరకు ప్రభుత్వం అందిస్తోంది. రోగి ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన రోజే బ్యాంకు ఖాతాలో ఆసరా మొత్తాన్ని జమ చేస్తున్నారు. డిశ్చార్జి అనంతరం ఏఎన్ఎంలు రోగుల ఇళ్లకు వెళ్లి యోగక్షేమాలను తెలుసుకుంటున్నారు. ఆరోగ్యశ్రీ సేవల్లో ఏవైనా సమస్యలుంటే ఫిర్యాదు చేసేందుకు 104 కాల్ సెంటర్‌ను అందుబాటులోకి తెచ్చారు. 2019లో టీడీపీ సర్కారు దిగిపోయే నాటికి ఆరోగ్యశ్రీ కింద రూ.477.40 కోట్లు, ఈహెచ్ఎస్ కింద రూ.154.1 కోట్లు బకాయిలు పెట్టగా మొత్తంగా రూ.631.56 కోట్లను వైఎస్సార్ సీపీ ప్రభుత్వమే చెల్లించింది. -
మా లాంటి సామాన్యులకు జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ఒక వరం
-
ద్వారా రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ఉచితంగా వైద్య సేవలను అందిస్తోంది
-
గుండెకు నిబ్బరం! రూపాయి ఖర్చు లేకుండా చికిత్స.. బైపాస్ సర్జరీ కూడా..
సాక్షి, అమరావతి: గుండె జబ్బుల బారిన పడ్డ పేద, మధ్యతరగతి కుటుంబాలకు డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం కొండంత అండగా నిలుస్తోంది. చేతి నుంచి ఒక్క రూపాయి ఖర్చు చేయాల్సిన అవసరం లేకుండా బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయి. మన రాష్ట్రంతోపాటు చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌లోని కార్పొరేట్ ఆస్పత్రుల్లో సైతం హృద్రోగ బాధితులకు ఆరోగ్యశ్రీ పథకం కింద ఉచిత వైద్యసేవలు అందుతున్నాయి. 1.71 లక్షల మందికి వైద్యం 2019 నుంచి 1,71,829 మంది గుండె సంబంధిత జబ్బుల బాధితులు ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా వైద్య సేవలు పొందారు. బైపాస్ సర్జరీలు, స్టెంట్లు..యాంజియోగ్రామ్, గుండె మార్పిడి సహా వివిధ చికిత్సలను పథకం కింద ఉచితంగా నిర్వహిస్తున్నారు. హృద్రోగ బాధితులకు వైద్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.695.15 కోట్లు ఖర్చు చేసింది. మరోవైపు శస్త్ర చికిత్స అనంతరం విశ్రాంతి తీసుకునే సమయంలో వైఎస్సార్ ఆరోగ్య ఆసరా కింద ఆర్థిక సాయాన్ని కూడా అందించింది. నాలుగేళ్లలో 40 లక్షల మందికి ఉచిత వైద్యం కేవలం హృద్రోగ చికిత్సలే కాకుండా పలు రకాల ఆరోగ్య సమస్యలకు ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా వైద్యం అందుతోంది. టీడీపీ హయాంలో నిర్వీర్యమైన ఆరోగ్యశ్రీ పథకానికి ఊపిరిలూదుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న చర్యలతో పేద, మధ్యతరగతి ప్రజలకు భారీ మేలు చేకూరుతోంది. పొరుగు రాష్ట్రాల్లోని పెద్ద పెద్ద కార్పొరేట్ ఆస్పత్రుల్లో సైతం ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా చికిత్స అందుతోంది. వైద్యం పొందిన అనంతరం చిరునవ్వుతో ఇంటికి తిరిగొస్తున్నారు. గత సర్కారు హయాంలో పేదలకు ఏదైనా పెద్ద జబ్బు చేస్తే తల తాకట్టు పెట్టడం మినహా గత్యంతరం లేని దుస్థితి. దేవుడిపై భారం వేసి రోజులు లెక్కపెట్టుకోవాల్సిన దయనీయ పరిస్థితులు నాడు నెలకొన్నాయి. ఈ అవస్థలకు తెరదించుతూ ఆరోగ్యశ్రీలో ప్రొసీజర్లను 3,257కి పెంచి ఉచిత వైద్య సేవలను సీఎం జగన్ అందుబాటులోకి తెచ్చారు. ఆరోగ్యశ్రీకి గత సర్కారు బకాయిపెట్టిన రూ.630 కోట్లను చెల్లించడంతోపాటు ప్రభుత్వ వైద్య రంగాన్ని అన్ని సదుపాయాలతో బలోపేతం చేశారు. దీంతో సగటున రోజుకు 3,300 మంది నెట్వర్క్ ఆస్పత్రుల్లో ఉచిత చికిత్సలు పొందుతున్నారు. ఆరోగ్యశ్రీ పథకం కోసం గత నాలుగేళ్లలో ప్రభుత్వం ఏకంగా రూ.9,025 కోట్లు ఖర్చు చేయగా దాదాపు 40 లక్షల మంది వైద్య సేవలు పొందారు. రూపాయి ఖర్చు లేకుండా బైపాస్ రక్త నాళాలు దెబ్బతినడంతో బైపాస్ సర్జరీ చేయాలని వైద్యులు చెప్పారు. నిరుపేద కుటుంబం కావడంతో నాకు అంత స్థోమత లేదు. ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఆరోగ్యశ్రీ పథకం కింద ఉచితంగా సర్జరీ చేశారు. ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నా. ప్రభుత్వం చేసిన మేలు ఈ జన్మలో మరువలేను. – దొంతాల రాఘవయ్య, మామడూరు, నెల్లూరు జిల్లా ఆపద్బాంధవిలా ఆదుకుంది గుండె రక్తనాళాలు దెబ్బ తినడంతో బైపాస్ సర్జరీ చేయాలని వైద్యులు నిర్థారించారు. ఆ సమయంలో ఆరోగ్యశ్రీ ఆపద్బాంధవిలా ఆదుకుంది. ఒక్క రూపాయి ఖర్చు లేకుండా గత నెల 26న సర్జరీ జరిగింది. ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యా. కోలుకునే సమయంలో వైఎస్సార్ ఆరోగ్య ఆసరా ద్వారా ఆర్థిక సాయం అందుతుందని చెప్పారు. సీఎం జగన్ ప్రభుత్వం చేసిన మేలును ఈ జన్మకు మరువలేను. – కొరివి కిశోర్, గుంటూరు పెద్ద జబ్బులకు సైతం.. గుండె, కాలేయం, కిడ్నీ, క్యాన్సర్ సంబంధిత పెద్ద జబ్బులకు సైతం చికిత్సలు ఆరోగ్యశ్రీ పథకం పరిధిలో ఉన్నాయి. ప్రొసీజర్ల సంఖ్య భారీగా పెరిగాయి. వైద్యం కోసం ప్రజలు ఆర్థికంగా చితికిపోకూడదనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీకి అత్యంత ప్రాధాన్యం ఇస్తోంది. – హరేంధిరప్రసాద్, సీఈవో, వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ఆరోగ్యశ్రీ ద్వారా హృద్రోగ చికిత్సలు ఇలా సంవత్సరం రోగులు ప్రొసీజర్లు వ్యయం రూ.కోట్లలో 2019–2020 23,797 24,027 79.69 2020–2021 24,243 24,599 77.06 2021–2022 36,725 37,646 116.09 2022–2023 65,813 85,558 301.82 2023–2024 21,251 32,208 120.49 (ఇప్పటి వరకూ) మొత్తం 1,71,829 2,04,038 695.15 అన్నదాతకు ప్రాణదాత వ్యవసాయదారుడైన చిత్తూరు జిల్లా పుంగనూరుకు చెందిన కృష్ణారెడ్డి హృద్రోగం బారిన పడటంతో ఆ కుటుంబానికి గుండె ఆగినంత పనైంది! గుండె మార్పిడి శస్త్ర చికిత్స ఖర్చును భరించే స్థోమత లేకపోవడంతో ఏం చేయాలో పాలుపోలేదు. వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా గుండె ఆపరేషన్ చేస్తారని స్థానిక ఏఎన్ఎం చెప్పడంతో 2021 ఏప్రిల్‌లో బెంగళూరులోని నెట్వర్క్ ఆస్పత్రిని సంప్రదించారు. మైసూర్లో బ్రెయిన్ డెడ్ అయిన ఓ వ్యక్తి గుండెను కృష్ణారెడ్డికి అమర్చి ట్రాన్స్‌ప్లాంట్ సర్జరీ చేశారు. ఆరోగ్యశ్రీ ద్వారా రూ.11 లక్షలు చెల్లించి ఆ కుటుంబ పెద్దకు రాష్ట్ర ప్రభుత్వం పునర్జన్మ ప్రసాదించింది. ‘నేను ఇవాళ ప్రాణాలతో ఉన్నానంటే ఆరోగ్యశ్రీనే కారణం. ఒక్క రూపాయి ఖర్చు లేకుండా గుండె మార్పిడి ఆపరేషన్ చేశారు. కోలుకునే సమయంలో వైఎస్సార్ ఆరోగ్య ఆసరా కింద డబ్బులు కూడా అందచేశారు’ అని కృష్ణారెడ్డి చేతులు జోడించి చెబుతున్నారు. -
డాక్టర్లూ పదండి పల్లెకు పోదాం!
రాష్ట్రంలోని ప్రతి పల్లెలోనూ ఉచిత వైద్య సేవలు అందించేందుకు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) తెలంగాణ శాఖ ముందుకు వచ్చింది. తన సామాజిక బాధ్యతగా ప్రతి మారుమూల పల్లెకూ ఆరోగ్యభద్రత విషయంలో సంపూర్ణ సహకారం అందించాలన్న లక్ష్యంతో ‘ఆవో గావ్ చలే’ పేరిట వినూత్న కార్యక్రమం చేపట్టింది. ఈ మేరకు హైదరాబాద్ మినహా మిగిలిన అన్ని జిల్లాలనూ దత్తత తీసుకుంటారు. ముఖ్యంగా జిల్లా కేంద్రాలకు దూరంగా పల్లెల్లో వరుసగా ఉచిత వైద్యశిబిరాలు నిర్వహించి మందులు అందజేస్తారు. తీవ్రమైన, దీర్ఘకాలిక వ్యాధులు ఏమైనా బయటపడితే.. వాటిని నగరంలోని ఉస్మానియా, గాందీ, నిమ్స్ లేదా స్తోమతను బట్టి ఇతర ఆసుపత్రులకు సిఫారసు చేయడంతో పాటు ప్రైవేటు ఆసుపత్రుల్లో ఉచితంగా ఆపరేషన్లు చేసే వీలు కూడా ఐఎంఏ కల్పిస్తామంటోంది. ఇందుకోసం అయ్యే ఖర్చును భరిస్తామని చెబుతోంది. – సాక్షి ప్రతినిధి, కరీంనగర్ ప్రతి ఊరికీ నలుగురు వైద్యుల బృందం ఐఎంఏ ఇటీవల ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెంలోని చర్లలో ఇప్పటికే వైద్య సేవలు ప్రారంభించింది. ఐఎంఏలో మొత్తం 20వేలమందికి పైగా వైద్యులు అందుబాటులో ఉన్నారని, వీరంతా ప్రతిరెండు నెలలకోసారి పల్లెల్లో నిర్వహించే ఉచిత వైద్యశిబిరాలలో సేవలందించేందుకు సిద్ధంగా ఉన్నారని ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ బీఎన్ రావు వెల్లడించారు. ప్రతి పల్లెకూ నలుగురు వైద్యుల బృందం వెళ్తుంది. అందులో ఫిజీషియన్, గైనిక్, ఆర్థో, ఆప్తమాలజీ వైద్య నిపుణులు ఉంటారు. వీరు తమకు కేటాయించిన ఊరిలో సమగ్ర హెల్త్ సర్వే రూపొందిస్తారు. గ్రామస్తులకు హెల్త్ చెకప్, వైద్యపరీక్షలు, మందుల పంపిణీ నిర్వహిస్తారు. అంటువ్యాధులు, సీజనల్ వ్యాధులు రాకుండా అవగాహన కల్పిస్తారు. ఐఎంఏ లక్ష్యాలివే.. మెడికల్ షాపుల్లో వైద్యుల ప్రిస్కిప్షన్ లేకుండా ఇష్టానుసారంగా మందులు విక్రయిస్తున్నారని ఇలాంటి కౌంటర్ సేల్స్‌ను నిరోధించాలని ఐఎంఏ చాలాకాలంగా పోరాడుతోంది. దీనివల్ల ప్రజలు అనేక దీర్ఘకాలిక వ్యాధులు కొని తెచ్చుకుంటున్నారని వాపోతోంది. ప్రైవేటు ఆసుపత్రుల్లో దళారీ వ్యవస్థ (యాంటీ క్వాకరీ) పెరిగిపోతోంది. కొందరు దళారులు అవసరం ఉన్నా.. లేకుండా తమ కమీషన్ల కోసం పేషెంట్లను కొన్ని ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లి ఆపరేషన్లు చేయిస్తున్నారు. దీనివల్ల వారి శరీరాలపై అనేక దు్రష్పభావాలు కలుగుతున్నాయి. వీటికి అడ్డుకట్ట వేస్తామంటోంది. సరైన వైద్య అర్హతలు లేకుండా కొందరు వైద్యం ప్రాక్టీస్ చేస్తున్నారు. అలాంటి వారి వల్ల ప్రజల ఆరోగ్యానికి హాని కలుగుతోంది. ఇలాంటి అక్రమ ప్రాక్టీసులను అరికట్టాలని డిమాండ్ చేస్తోంది. రాష్ట్రంలో వైద్యకాలేజీల పెంపును ఆహ్వనించిన ఐఎంఏ చాలామంది పేద వైద్య విద్యార్థులకు ఆర్థిక సాయం చేసేందుకు స్కాలర్షిప్పులు ప్రకటిస్తోంది ఐఎంఏకు దరఖాస్తు చేసుకున్న పేద వైద్య విద్యార్థులకు ఏటా రూ.20 వేల చొప్పున ఆర్థిక సాయం చేస్తోంది. పల్లెల కోసం ‘ఆవో గావ్ చలే’ కార్యక్రమం చేపడుతున్న మాదిరిగానే.. పట్టణాల్లోని మురికివాడల్లోనూ ఇదే విధమైన సేవలు అందించాలని నిర్ణయించింది. పేదలపై భారం తప్పించేందుకే ప్రైవేటు కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్యఖర్చులు పెరిగిపోతున్నాయి. ప్రైవేటు డాక్టరుకు చూపించుకునే స్తోమతలేని వేలాదిమంది పల్లె వాసులు రోగాలను మౌనంగా భరిస్తున్నారు. రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో ఉన్న అలాంటి వారికి పూర్తి ఉచితంగా వైద్యసేవలు, పరీక్షలు, శస్త్రచికిత్సలు అందించడమే మా లక్ష్యం. – డాక్టర్ బీఎన్.రావు, ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షుడు -
ఉచిత వైద్య పథకం వర్తింపజేయాలి
సాక్షి,సిటీబ్యూరో: ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగులకు ఉచిత వైద్య ఆరోగ్య పథకం వర్తింప జేయాలని రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు సంఘం ప్రతినిధి బృందం శనివారం మంత్రి హరీష్ రావును కలిసి వివిధ సమస్యలపై వినతి పత్రం సమర్పించింది. ఈహెచ్ఎస్, టీఎస్జీఆర్ఈఏలలో సభ్యత్వం కల్పించాలని కోరగా అందుకు మంత్రి సానుకూలంగా స్పందించారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర అధ్యక్షులు జీ. దామోదర్ రెడ్డి, కార్యదర్శి చంద్రశేఖర్, కోశాధికారి ఎ గంగారెడ్డి, ఉపాధ్యక్షులు రావిళ్ల సీతారామయ్య, నల్గొండ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస రెడ్డి, సూర్యాపేట జిల్లా అధ్యక్షులు నాగిరెడ్డి సుదర్శన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఆరోగ్యశ్రీ కింద.. రూ.10 లక్షల వరకు ఉచిత వైద్యం
సాక్షి, హైదరాబాద్/ సుందరయ్య విజ్ఞానకేంద్రం: ఆరోగ్యశ్రీ కింద రూ.10 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తున్నామని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు. మొదటి ఏఎన్ఎం ఖాళీ పోస్టుల భర్తీకి నెలారెండు నెలల్లో నోటిఫికేషన్ ఇస్తామన్నారు. ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన రెండో ఏఎన్ఎం మహాసభల్లో మంత్రి మాట్లాడారు. అన్ని ఆసుపత్రుల్లో డయాలసిస్ సేవలను అందుబాటులోకి తెస్తున్నామని, రాబోయే రోజుల్లో కీమో, రెడియో థెరపీ కూడా అందుబాటులోకి వస్తాయని ప్రకటించారు. ప్రాథమిక వైద్యం అందించడంలో ఏఎన్ఎంలది కీలక పాత్ర అని కొనియాడారు. బీపీ, షుగర్, క్యాన్సర్ వంటి వ్యాధులు ఉన్నట్లు చాలా మందికి తెలియదని, అలాంటివారిని గుర్తించి ముందుగా చికిత్స అందిస్తే దీర్ఘకాలిక రోగాలు రావని అభిప్రాయపడ్డారు. హైదరాబాద్‌లో 350 బస్తీ దవాఖానాల ద్వారా ప్రజలకు మంచి వైద్యసేవలు అందుతున్నాయని, ఫలితంగా గాంధీ, ఉస్మానియా, ఫీవర్ ఆసుపత్రుల్లో ఓపీ తగ్గిందని పేర్కొన్నారు. జిల్లాలో మొత్తం 500 బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఏఎన్ఎం సెంటర్లను పల్లె దవాఖానాలుగా ఆధునీకరిస్తున్నామని చెప్పారు. ఈ నెలలో 2 వేల పల్లె దవాఖానాలను రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వాసుపత్రుల్లో పెరిగిన ప్రసవాలు 2014లో ప్రభుత్వ ఆసుపత్రుల్లో 30 శాతం ప్రసవాలు జరగగా, ఇప్పుడు అవి 67 శాతానికి పెరిగాయని మంత్రి హరీశ్ తెలిపారు. వైద్యసేవల్లో దేశంలోనే తెలంగాణ మూడోస్థానం దక్కించుకుందన్నారు. డబుల్ ఇంజిన్ సర్కారు చివరి స్థానంలో ఉందని, డబుల్ ఇంజిన్ ట్రబుల్ ఇంజినే తప్ప దాని వల్ల పేదలకు ఎలాంటి లాభం లేదని ఎద్దేవా చేశారు. రెండు, మూడు రోజుల్లో 58 టిఫా ప్రారంభం అవుతుందని తెలిపారు. జనవరి వరకు అన్ని జిల్లాల్లో టి–డయాగ్నొస్టిక్ కేంద్రాల ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. ఏఎన్ఎం పరిధిలో వందశాతం ప్రసవాలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో జరిగేటట్టు చూడాలన్నారు. మొదటి ఏఎన్ఎం పోస్టుల ఖాళీల భర్తీలో కరోనా తర్వాత వెయిటేజీ ఇస్తున్నామని, ఏడాదికి 2 మార్కుల చొప్పున కలుపుతున్నామని చెప్పారు. టీవీవీపీలో 228 ఉద్యోగాలు ఇస్తే, 200 పోస్టులు ఏఎన్‌ఎంలకే వచ్చాయన్నారు. పూర్తిస్థాయిలో వయో పరిమితి సడలింపు ఇచ్చామని హరీశ్ తెలిపారు. ఇదీ చదవండి: ఎల్ఆర్ఎస్.. గప్‌చుప్! చడీచప్పుడు లేకుండా వెంచర్ల క్రమబద్ధీకరణ -
ఆహార భద్రత కార్డుదారులకూ ఆరోగ్యశ్రీ
సాక్షి, హైదరాబాద్: ఆరోగ్యశ్రీ– ఆయుష్మాన్ భారత్ పథకం కింద అందించే ఉచిత వైద్య చికిత్సలు ఆహారభద్రత కార్డుపై కూడా చెల్లుబాటయ్యేలా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు తెలంగాణ ఆరోగ్యశ్రీ ట్రస్టు ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో తెల్లరేషన్ కార్డు ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీ పథకం కింద కుటుంబ సభ్యులందరికీ ఆరోగ్యశ్రీ కార్డులను అందజేశారు. అయితే తెలంగాణ ఏర్పాటయ్యాక రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కోసం తెల్లకార్డుల స్థానంలో 10లక్షల ఆహార భద్రత కార్డులను పంపిణీ చేసింది. వాటిని కేవలం రేషన్ సరుకుల కోసం మాత్రమే పరిమితం చేసింది. ఆరోగ్యశ్రీ–ఆయుష్మాన్ భారత్ కింద చికిత్సలు పొందాలంటే సంబంధిత కార్డుగానీ, లేదా తెల్ల రేషన్ కార్డుగానీ ఉండాలనే నిబంధన ఉంది. దీనివల్ల ఆహార భద్రత కార్డుదారులు ఆరోగ్యశ్రీ సేవలను పొందలేకపోతున్నారు. దీనిపై ప్రజల నుంచి వినతులు రావడంతో.. ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుంది. ఆహార భద్రత కార్డుదారులకు కూడా ఇక నుంచి ఆరోగ్యశ్రీ ఆయుష్మాన్ భారత్ పథకం కింద ఉచిత సేవలు లభిస్తాయి. -
తిరుపతిలో అత్యాధునిక క్యాన్సర్ ఆసుపత్రి
తిరుపతి తుడా: రాష్ట్రంలో క్యాన్సర్ రోగులకు అత్యాధునిక వైద్యం అందుబాటులోకి వచ్చింది. క్యాన్సర్ చికిత్స కోసం ఇకపై చెన్నై, హైదరాబాద్, బెంగళూరు వంటి మహానగరాలకు పరుగులు పెట్టాల్సిన పని లేదు. అంతకుమించిన అత్యాధునిక వైద్య పరిజ్ఞానంతో తిరుపతిలో క్యాన్సర్ ఆసుపత్రి అందుబాటులోకి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ సూచనలతో టాటా ట్రస్టు సౌజన్యంతో అలమేలు చారిటబుల్ ఫౌండేషన్ ద్వారా శ్రీవేంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్యాన్సర్ కేర్ అండ్ అడ్వాన్స్డ్ రీసెర్చ్ ఆసుపత్రిని శరవేగంగా నిర్మించారు. ఈ ఆసుపత్రిలో తక్కువ ఖర్చుతో అత్యాధునిక కార్పొరేట్ వైద్య సేవలు అందిస్తారు. క్యాన్సర్ కేర్‌కు చిరునామాగా నిలిచే ఈ ఆసుపత్రిని రూ.190 కోట్ల వ్యయంతో 92 పడకలతో నిర్మించారు. దశలవారీగా పడకలను 300కు పెంచనున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈనెల 5వ తేదిన ఈ అత్యాధునిక క్యాన్సర్ ఆసుపత్రిని ప్రారంభించి, ప్రజలకు అంకితం చేయనున్నారు. టీటీడీ, రాష్ట్ర ప్రభుత్వ సహకారం ఈ అత్యాధునిక ఆసుపత్రి నిర్మాణానికి టాటా సంస్థకు టీటీడీ, రాష్ట్ర ప్రభుత్వం సహకారాన్ని అందించాయి. ఇప్పటికే టీటీడీ సహకారంతో నిర్వహిస్తున్న స్విమ్స్ ఆసుపత్రిలో ఆంకాలజీ విభాగం ద్వారా క్యాన్సర్ రోగులకు వైద్య సేవలందిస్తోంది. ప్రత్యేకంగా క్యాన్సర్ వైద్యానికి అత్యాధునిక ఆసుపత్రి నిర్మాణానికి ముందుకు వచ్చిన టాటా సంస్థకు అలిపిరి వద్ద విలువైన 25 ఎకరాల స్థలాన్ని కేటాయించింది. కరోనా మహమ్మారి కారణంగా నిర్మాణానికి ఏడాదికిపైగా ఆటంకం ఏర్పడింది. దీని నిర్మాణానికి అవసరమైన అన్ని అనుమతులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందించడంతో ఆసుపత్రి అందుబాటులోకి వచ్చింది. ఆరోగ్యశ్రీ అమలుకు చర్యలు నూతన ఆసుపత్రిలో డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఉచితంగా క్యాన్సర్ చికిత్సను అందించడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రభుత్వ సూచనల మేరకు ఆసుపత్రి యాజమాన్యం ఆరోగ్యశ్రీకి అనుమతుల కోసం ప్రతిపాదనలను పంపింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతులు రాగానే టాటా క్యాన్సర్ ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీని అమలు చేస్తారు. విస్తృతంగా అవగాహన ఆసుపత్రికి పునాది వేసిన ఆరు నెలల నుంచే ట్రస్టు ద్వారా ఏడుగురు వైద్యుల బృందంతో జిల్లావ్యాప్తంగా క్యాన్సర్‌పై అవగాహన, స్క్రీనింగ్ క్యాంపులు నిర్వహిస్తోంది. మహిళల కోసం పింక్ బస్సు ఏర్పాటు చేసి గ్రామాల్లో పరీక్షలు చేస్తోంది. రోగ లక్షణాలను గుర్తించిన వారికి తక్కువ ఖర్చుతో ఖరీదైన వైద్యాన్ని అందిస్తోంది. అలానే క్యాన్సర్ మహమ్మారిని గుర్తించేందుకు పాఠశాలలు, కళాశాలల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. మెడికల్ హబ్‌గా తిరుపతి రాష్ట్ర ప్రభుత్వం వైద్య రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తోంది. తిరుపతిని మెడికల్ హబ్‌గా చేస్తోంది. నాడు–నేడు ద్వారా రాయలసీమ పెద్దాసుపత్రి రుయాను రూ.450 కోట్లతో ఆధునీకరిస్తోంది. స్విమ్స్, బర్డ్ ఆసుపత్రులను మరింత ఆధునీకరించి మెరుగైన వైద్యం అందిస్తోంది. గత ఏడాది అక్టోబర్ 11న టీటీడీ శ్రీపద్మావతి చిన్న పిల్లల గుండె చికిత్సల ఆసుపత్రిని అందుబాటులోకి తెచ్చింది. ఇప్పుడు తిరుపతిలో అత్యాధునిక క్యాన్సర్ ఆసుపత్రి అందుబాటులోకి వస్తోంది. అత్యాధునిక వైద్యం ఈ ఆసుపత్రిలో అత్యాధునిక వైద్య పరికరాలు, సౌకర్యాలు కల్పించారు. సర్జికల్ ఆంకాలజీ, మెడికల్ ఆంకాలజీ, రేడియేషన్ ఆంకాలజీ విభాగాలతో పాటు అనస్థీషియా అండ్ క్రిటికల్ కేర్, పెయిన్ అండ్ పాలియేటివ్, రేడియాలజి, పాథాలజి, మైక్రో బయాలజి, బయో కెమిస్ట్రి, నాణ్యమైన ఫార్మసీ, బ్లడ్‌బ్యాంక్‌ను ఇక్కడ ఏర్పాటు చేశారు. మొత్తం 120 మంది నిపుణులైన వైద్యులు, వైద్య సిబ్బంది ఉంటారు. అత్యాధునిక అల్ట్రాసౌండ్, మమోగ్రామ్, ఎక్స్‌రే, సీటీ, ఎంఆర్ఐ, లీనాట్, బ్రాకీథెరపీ, కీమోథెరపీ డేకేర్తో పాటు ఆధునిక ఆపరేషన్ థియేటర్లు అందుబాటులోకి తీసుకొచ్చారు. ‘టాటా’ సామాజిక స్పృహ దిగ్గజ కార్పొరేట్ కంపెనీల్లో టాటా ఒకటి. ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన టాటా సంస్థ వ్యాపారమేగాక సామాజిక స్పృహలోనూ ముందుంది. స్వాతంత్య్రం రాక ముందే 1941లో ముంబై పట్టణంలో టాటా మెమోరియల్ ఆసుపత్రిని నిర్మించింది. 2011లో అతిపెద్ద క్యాన్సర్ ఆసుపత్రిని కోల్‌కతాలో అందుబాటులోకి తెచ్చింది. ఆ తర్వాత అలమేలు మంగ చారిటబుల్ ఫౌండేషన్ ఏర్పాటు చేసి తిరుపతిలో ఆసుపత్రిని నిర్మించింది. టాటా ట్రస్టు చైర్మన్‌గా రతన్‌టాటా, అలమేలు చారిటబుల్ ఫౌండేషన్‌కు సీఈగా సంజయ్‌చోప్రా వ్యవహరిస్తున్నారు. క్యాన్సర్ ఆసుపత్రికి మెడికల్ డైరెక్టర్‌గా విఆర్ రమణన్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇది అత్యాధునిక ఆసుపత్రి అలమేలు చారిటబుల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అత్యాధునిక వైద్య సేవలతో క్యాన్సర్ ఆసుపత్రిని నిర్మించాం. దీని నిర్మాణానికి టీటీడీ, రాష్ట్ర ప్రభుత్వ సహకారం మరువలేనిది. లాభాపేక్ష లేకుండా ఖరీదైన కార్పొరేట్ వైద్యాన్ని సాధారణ ఖర్చుతో అందించడమే టాటా సంస్థ లక్ష్యం. ఇప్పటివరకు స్విమ్స్‌తో మాత్రమే ఎంవోయూ కుదిరింది. ఆసుపత్రి సేవలను జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వం, డిఫెన్స్ సంస్థలతో ఎంవోయూ చేసుకుంటాం. – డాక్టర్ విఆర్ రమణన్, మెడికల్ డైరెక్టర్, క్యాన్సర్ ఆసుపత్రి వైద్య సేవలు పొందడం ఇలా ► ఆసుపత్రి టోల్ ఫ్రీ నెం: 18001036123 ► ప్రతిరోజు రేడియో ఆంకాలజీ, మెడికల్ ఆంకాలజీ, సర్జికల్ ఆంకాలజీ వైద్య సేవలు ► నేరుగా ఆసుపత్రి రిసెప్షన్లో సంప్రదించి ఓపీ పొందవచ్చు ► ఆసుపత్రి ఓపీ సమయం: ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ► ఓపీ టిక్కెట్ రుసుము: రూ.30 ► పేషెంట్‌తో పాటు వచ్చే అటెండెంట్స్ విశ్రమించేందుకు ప్రత్యేకంగా ధర్మశాల నిర్మించారు. ఇందుకోసం రోజుకు రూ.100 (ఒక్కరికి) వసూలు చేస్తారు. ► అతి తక్కువ ధరలతో క్యాంటీన్ కూడా ఉంది. -
ఆర్టీసీ ఉద్యోగులకు ఉచిత వైద్య సేవలు
సాక్షి, అమరావతి: ప్రముఖ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులకు చెందిన నిపుణులు విజయవాడ విద్యాధరపురంలోని ఏపీఎస్ఆర్టీసీ సెంట్రల్ హాస్పిటల్లో ఉచిత వైద్య సేవలు అందించేందుకు ముందుకొచ్చారని ఏపీఎస్ఆర్టీసీ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డీవీఎస్ అప్పారావు తెలిపారు. ఈ వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఆర్టీసీ కార్మికులకు ఆయన విజ్ఞప్తి చేశారు. ఇందుకు సంబంధించిన వైద్య సేవల సమయాలను ఆయన శనివారం మీడియాకు విడుదల చేశారు. క్యాపిటల్ హాస్పిటల్స్, అమెరికన్ అంకాలజీ ఇన్స్టిట్యూట్, శ్రీగాయత్రి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, వంశీ హార్ట్ కేర్ సెంటర్ యాజమాన్యాలు ఆర్టీసీ ఉద్యోగులకు ఉచిత కన్సల్టేషన్ సూపర్ స్పెషాలిటీ సేవలను అందించనున్నాయన్నారు. ► యూరాలజీ: ప్రతి నెల 1వ, 3వ మంగళవారం ఉదయం 10 నుంచి 12 గంటల వరకు క్యాపిటల్ హాస్పిటల్స్ వైద్య సిబ్బంది చూస్తారు. ► అంకాలజీ: 1వ, 3వ బుధవారం మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల వరకు శ్రీగాయత్రి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్య సిబ్బంది పరీక్షలు నిర్వహిస్తారు. ► అంకాలజీ: 2వ, 4వ బుధవారం మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల వరకు అమెరికన్ ఆంకాలజీ ఇన్స్టిట్యూట్ వారు చూస్తారు. ► కార్డియాలజీ: 1వ, 3వ గురువారం మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల వరకు క్యాపిటల్ హాస్పిటల్స్ వైద్య సేవలు అందిస్తారు. ► కార్డియాలజీ: 2వ, 4వ గురువారం మధ్యాహ్నం 12–2 గంటల వరకు వంశీ హార్ట్ కేర్ సెంటర్ వైద్య సేవలు అందిస్తారు. ► దీంతోపాటు ప్రతి గురువారం ఒక రేడియాలజిస్ట్ మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటల వరకు అల్ట్రా సౌండ్ స్కాన్ నిర్వహించేందుకు అందుబాటులో ఉంటారు. -
సీఎం స్టాలిన్ మరో కీలక నిర్ణయం.. సరికొత్త పథకానికి శ్రీకారం
ప్రమాదాల బారిన పడి ప్రాణాలతో కొట్టు మిట్టాడుతున్న వారిని సకాలంలో ఆస్పత్రులకు తరలించి, రక్షించే ప్రత్యేక వైద్య పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఆది పరాశక్తి అమ్మవారు కొలువైన మేల్ మరువత్తూరు వేదికగా ఈ పథకానికి శనివారం సీఎం ఎంకే స్టాలిన్ శ్రీకారం చుట్టారు. దయ చేసి వాహన వేగాన్ని తగ్గించుకుని, మనల్ని మనం రక్షించుకుందామని, ఇతరుల ప్రాణాల్ని కాపాడుకుందామని ఈ సందర్భంగా ప్రజలకు సీఎం విజ్ఞప్తి చేశారు. సాక్షి, చెన్నై: డీఎంకే సర్కారు అధికారంలోకి వచ్చినానంతరం బృహత్తర వైద్య పథకాల్ని అమలు చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ప్రమాద రహిత రాష్ట్రంగా తమిళనాడును తీర్చిదిద్దడమే కాకుండా, ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న వారిని సకాలంలో ఆస్పత్రులకు తరలించేందుకు ప్రత్యేక వైద్యపథకంపై సీఎం స్టాలిన్ దృష్టి పెట్టారు. ఆ మేరకు ‘ఇన్నుయిర్ కాప్పోం’– 48 ( ప్రాణాలను కాపాడుదాం – 48 గంటల్లో) పేరుతో రూపొందించిన ఈ పథకం రాష్ట్రంలోని 610 ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో అమల్లోకి వచ్చింది. 48 గంటలు ఉచిత సేవ మేల్ మరువత్తూరులో ఈ పథకాన్ని ప్రారంభించిన అనంతరం స్టాలిన్ మాట్లాడుతూ, రాష్ట్రంలోని గ్రామ, పట్టణ, నగర, జాతీయ రహదారుల్లో ఎక్కడ ప్రమాదం జరిగినా సకాలంలో బాధితులకు వైద్య సేవలు అందేవిధంగా ఆస్పత్రుల్ని ఎంపిక చేశామని వివరించారు. మనల్ని మనం రక్షించుకోవడమే కాకుండా, ఇతరుల ప్రాణాలను కాపాడాలన్న సంకల్పంతోనే ఈ పథకానికి ఇన్నుయిర్ కాప్సోం –48 అని నామకరణం చేశామన్నారు. ఆస్పత్రిలో చేరిన 48 గంటల పాటుగా క్షతగ్రాతులకు ఉచితంగా వైద్యసేవలు అందుతాయని, ఆ తదుపరి సీఎం బీమా పథకాన్ని వర్తింపజేస్తామని ప్రకటించారు. ప్రమాదానికి గురైన వారు తమిళనాడు వాసులే కానక్కర్లేదని, ఇతర రాష్ట్ర వాసులైనా, దేశాలకు చెందిన వారైనా సరే అందరికీ సమానంగా ఈ పథకం వర్తిస్తుందని వివరించారు. చదవండి: (ఓబీసీ రిజర్వేషన్ రద్దు.. ఓటు అడిగేందుకు రావద్దు..) ప్రమాదంలో గాయపడ్డ వారిని సకాలంలో ఆస్పత్రులకు తరలించే వారికి ప్రోత్సాహక నగదుగా రూ. 5 వేలు పంపిణీ చేయనున్నామని తెలిపారు. అత్యవసర కాలంలో ప్రతిఒక్కరూ స్పందించాలని, ప్రాణాల్ని కాపాడాలని పిలుపునిచ్చారు. దయచేసి రోడ్డు భద్రతా నిబంధనలు పాటించాలని, హెల్మెట్, సీటు బెల్ట్ ధరించి వాహనాల్ని నడపాలని, అతివేగాన్ని వీడాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రమాద రహిత రాష్ట్రంగా తమిళనాడును తీర్చిదిద్దుదామని, నిబంధనల్ని అనుసరిస్తామని ప్రతిఒక్కరూ ఈసందర్భంగా ప్రతిజ్ఞ చేయాలని పిలుపు నిచ్చారు. కార్యక్రమంలో మంత్రులు ఎం. సుబ్రమణియన్, కేఎన్ నెహ్రు, ఏవీ వేలు, తాము అన్భరసన్, ఎంపీ సెల్వం, ఎమెల్యేలు కరుణానిధి, ఎస్ఆర్ రాజ, అరవింద్ రమేష్ పాల్గొన్నారు. చదవండి: (పంజాబ్‌లో అమరీందర్‌తో కాషాయదళం పొత్తు) టీకా శిబిరం పరిశీలన కరోనా వ్యాక్సిన్ శిబిరం శనివారం రాష్ట్రంలో 50 వేల శిబిరాల్లో జరిగాయి. పెద్దఎత్తున జనం ఉదయాన్నే శిబిరాల వద్ద బారులు తీరారు. రెండో డోస్ టీకాను అత్యధిక శాతం మంది వేయించుకున్నారు. గూడువాంజేరిలో ఏర్పాటు చేసిన శిబిరాన్ని సీఎం స్టాలిన్ పరిశీలించారు. టీకా వేయించుకునేందుకు వచ్చిన ప్రజలతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. -
AP: ప్రసవానికి ప్రభుత్వాస్పత్రికొస్తే రూ.11 వేలు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ వైద్య రంగంలో అనేక విప్లవాత్మక సంస్కరణలతో దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది.. ఏపీ ప్రభుత్వం. ప్రభుత్వాస్పత్రుల్లో ప్రసవం చేయించుకున్నవారికి కేంద్రం భాగస్వామ్యంతో రూ.11 వేలు అందిస్తోంది. ఉచిత వైద్యసేవలు, మందులు, ఆహారం, రవాణాకు ఈ రూ.11 వేలు అదనం కావడం విశేషం. ఈ మొత్తాన్ని కూడా నగదు రూపంలో నేరుగా లబ్ధిదారుల ఖాతాలో జమ చేస్తున్నారు. దేశంలో మరే రాష్ట్రంలోనూ ఇలా లేకపోవడం గమనార్హం. ప్రభుత్వాస్పత్రుల్లో ప్రసవాలను ప్రోత్సహించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంల ద్వారా ఈ విషయాన్ని ప్రతి ఒక్కరికీ చేరవేయాలని ఆదేశించింది. ప్రభుత్వాస్పత్రులకు వస్తే అందే ప్రయోజనాలను వివరంగా చెప్పాలని సూచించింది. రవాణా నుంచి వైద్యసేవలన్నీ ఉచితంగానే.. ప్రభుత్వాస్పత్రులకు ప్రసవం కోసం వచ్చే గర్భిణులకు రవాణా నుంచి మందుల వరకు అన్నీ ఉచితమే. గర్భిణికి పురిటినొప్పులు రాగానే 108కు ఫోన్ చేస్తే ఆస్పత్రికి తీసుకెళతారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్సీ) నుంచి బోధనాస్పత్రి వరకూ ఎక్కడైనా వైద్యం చేయించుకోవచ్చు. 372 పీహెచ్‌సీల్లో జీరో డెలివరీలు రాష్ట్రంలో 1,149 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలుండగా 372 పీహెచ్‌సీల్లో ఒక్క ప్రసవం కూడా జరగడం లేదు. ఇందులో అత్యధికంగా కృష్ణా జిల్లాలో 52 పీహెచ్‌సీలు ఉన్నాయి. వీటిలో కూడా సాధారణ ప్రసవాలు చేయాలని కుటుంబ సంక్షేమ శాఖ యోచిస్తోంది. ఇప్పటికే ఇద్దరు వైద్యాధికారులు, ముగ్గురు నర్సులు, లేబర్ రూమ్‌కు కావాల్సిన వసతులు అన్నీ పీహెచ్‌సీల్లో సమకూరుస్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వాస్పత్రుల్లో 40 శాతం మాత్రమే ప్రసవాలు జరుగుతున్నాయి. వీటిని భారీగా పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వాస్పత్రులకు వస్తే లాభాలెన్నో.. ► గర్భిణి దశలోనే ప్రభుత్వాస్పత్రుల్లో వైద్య పరీక్షలకు వస్తే స్టాఫ్ నర్స్, పీహెచ్ఎన్, ఎంపీహెచ్ఎస్, మెడికల్ ఆఫీసర్లు ప్రత్యేక ట్రాకింగ్ సిస్టమ్ ద్వారా పరిశీలిస్తారు. ► సాధారణ ప్రసవాలను ప్రోత్సహిస్తారు. సిజేరియన్ అవసరమైతే బాధ్యతగా చేస్తారు. ► ప్రసవం సమయంలో రక్తం అవసరమైతే ప్రభుత్వమే సమకూరుస్తుంది. ► బాలింతకు ఆస్పత్రిలో ఉన్నన్ని రోజులు ఉచితంగా పోషకాహారం అందిస్తారు. ► చిన్నారులకు ఉచితంగా వ్యాక్సిన్లు ఇస్తారు. ► ఆస్పత్రి నుంచి డిశ్చార్జి కాగానే తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌లో ఇంటికి ఉచితంగా చేర్చుతారు. ► బిడ్డ పుట్టగానే ఆధార్ నమోదు చేస్తారు.. పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రం ఇస్తారు. బాలింతలకు భారీగా ఆసరా గతంలో ఎప్పుడూ లేని విధంగా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్య ఆసరా ఇస్తోంది. సాధారణ ప్రసవానికి రూ.5 వేలు, సిజేరియన్ ప్రసవానికి రూ.3 వేలు ఇస్తోంది. తల్లి కోలుకునే సమయంలో ఈ మొత్తం వారికి ఎంతో భరోసానిస్తోంది. దీనికి తోడు ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజన, జననీ సురక్ష యోజనల కింద మరికొంత సొమ్ము సమకూరుతోంది. -
అలా అయితేనే పెళ్లి చేసుకుంటా!
టీ.నగర్: పుట్టిన గడ్డపై మమకారంతో ఆ ప్రాంత ప్రజల వైద్య అవసరాలు తీర్చేందుకు ఓ సబ్ కలెక్టర్ వింత వరకట్నం కోరారు. వివరాలు.. తంజావూరు జిల్లా, ఒట్టంగాడు గ్రామానికి చెందిన శివగురు ప్రభాకరన్ అనేక కష్టాలతో ఐఏఎస్ అధికారి స్థాయికి చేరుకున్నారు. ప్రస్తుతం తిరునెల్వేలిలో సబ్ కలెక్టర్‌గా పనిచేస్తున్నారు. ఇతనికి వివాహం చేసేందుకు తల్లిదండ్రులు అమ్మాయి కోసం అన్వేషించారు. ఇతన్ని వివాహమాడేందుకు ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ చదివిన యువతులు సిద్ధపడినా తాను ఒక వైద్యురాలినే వివాహమాడతానని తెలిపాడు. తల్లిదండ్రులు మెడికల్ కోర్స్ చేసిన యువతి కోసం ఏడాదిగా వెదికారు. మెడిసిన్ చేసిన యువతులు లభించినా, ఇతను కోరిన వింత వరకట్నం విని పరుగు లంకించుకున్నారు. చెన్నై నందనం కళాశాల గణిత అధ్యాపకురాలి కుమార్తె డాక్టర్ కృష్ణభారతిని చూశారు. డాక్టర్ కృష్ణభారతికి వరుని నూతన నిబంధనను సంశయంతో వెల్లడించారు సబ్ కలెక్టర్ తల్లిదండ్రులు. తమ కుమారుడు పెళ్లాడే డాక్టర్ వారంలో రెండు రోజులు ఒట్టంగాడు గ్రామ ప్రజలకు, పరిసరప్రాంతాల వారికి ఉచితంగా వైద్య సేవలందించాలన్నదే అతని వరకట్నం కోరికని వెల్లడించారు. దీన్ని కృష్ణభారతి సంతోషంగా స్వీకరించడంతో ఫిబ్రవరి 26న ఇద్దరికీ వివాహం జరిగింది. ఈ కాలంలోను ఇటువంటి వ్యక్తా అంటూ ఆ ప్రాంత ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తమ పట్ల ఉన్న ప్రేమానురాగాలతో పొంగిపోయిన పేరావూరణి ప్రజలు జంటను ప్రశంసించారు. -
దయనీయ స్థితిలో మాజీ సీఎం జలగం సన్నిహితుడు
సాక్షి, మధిర: నాడు వేలాదిమంది రోగులను పరీక్షించి, వందలాదిమంది రోగులకు ప్రాణం పోసిన ప్రజా వైద్యుడు నేడు అనారోగ్య, ఆర్థిక ఇబ్బందులతో మంచంలో మగ్గుతున్న కడుదయనీయ పరిస్థితి. ఖమ్మం జిల్లా మధిర మండలం మాటూరు గ్రామానికి చెందిన నరగిరి నాధుని వెంకటాచార్యులు, రంగనాయకమ్మ దంపతులకు కృష్ణమాచార్యులు 1941, ఏప్రిల్ 30న జన్మించారు. ప్రాథమిక విద్య పూర్తిచేసుకుని విజయవాడలో ఆయుర్వేద వైద్యకోర్సును చదువుకున్నారు. ఆ తరువాత హైదరాబాద్‌లో హౌస్ సర్జన్ పూర్తిచేసి నల్లగొండ జిల్లా దేవరకొండ మండలం పులిచెర్ల గ్రామంలో ప్రభుత్వ ఆయుర్వేద డాక్టర్‌గా పనిచేసి అక్కడి ప్రజల మన్ననలు పొందారు. తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా ఉండేందుకు ప్రభుత్వ ఉద్యోగాన్ని వదులుకుని స్వగ్రామానికి వచ్చారు. ఆధునిక దేవాలయంగా పిలువబడే నాటి నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిర్మాణానికి కృషిచేసిన ప్రముఖ ఇంజనీర్ మాటూరు గోపాలరావు స్వగ్రామం కూడా మాటూరే. ఆయన సూచనలమేరకు ఆయన తండ్రి అప్పారావు పేరుతో, ఆయన నివాసంలో ప్రజా వైద్యశాలను స్థాపించారు. ఉచిత ఆస్పత్రిని నాటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావు ప్రారంభించారు. ఈ క్రమంలో రెండుమూడు దశాబ్దాలకుపైగా మధిర ప్రాంతానికి చెందిన వందలాదిమంది రోగులకు సేవలు చేశారు. వేలాదిమందికి ఉచిత వైద్యసేవలు అందించారు. ఒకవైపు మాటూరులోని చెన్నకేశవస్వామి, రామాలయంలో అర్చకత్వం చేస్తూ మరోవైపు డాక్టర్‌గా సేవలందించారు.జలగం వెంగళరావు సహకారంతో ఈ ప్రాంతానికి చెందిన ఎంతోమంది ఉద్యోగ, ఉపాధి అవకాశాలు, స్వాతంత్య్ర సమరయోధులకు పెన్షన్ మంజూరు చేయించడం తదితర సేవా కార్యక్రమాలు నిర్వహించారు. వెన్నుముకకు గాయమై.. మూడు దశాబ్దాలపాటు ఉచిత వైద్యసేవలు అందించిన తరువాత కృష్ణమాచార్యుల ఆర్థిక పరిస్థితులు తెలుసుకున్న కొంతమంది రోగులు జబ్బు తగ్గిన తరువాత కొంత డబ్బును ఆయనకు ఇచ్చేవారు. ఈ ప్రాంతానికి చెందిన బంధువులు, స్నేహితులు కృష్ణమాచార్యులు వైద్య సేవల గురించి తెలుసుకుని దీర్ఘకాలిక వ్యాధులకు వైద్యసేవలు పొందేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి ఆయన కోసం మాటూరుకు వచ్చేవారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన కృష్ణమాచార్యుల వెన్నుముకకు దెబ్బ తగిలింది. ఆర్థిక ఇబ్బందులతో, అనారోగ్య సమస్యలతో ఆయన ప్రస్తుతం మంచంలో మగ్గుతున్నారు. మంచంలో ఉన్నప్పటికీ ఆయన వద్దకు ఇప్పటికీ రోగులు వస్తుండటం గమనార్హం. వెన్నుముక సమస్యతో పాటు గుండె సమస్య కూడా వేధిస్తోంది. పెద్దాస్పత్రులకు వెళ్లేందుకు ఆయన చేతిలో చిల్లిగవ్వలేదు. నాడు వేలాదిమంది రోగులకు ఉచిత వైద్యసేవలందించిన కృష్ణమాచార్యులను ఈ ప్రాంత ప్రజలు ఇప్పటికీ ‘అబ్బాయి గారు’గా ఆప్యా యంగా పిలుచుకోవడం విశేషం. ప్రభుత్వం సహకారం అందిస్తే.. ఆయన కోలుకునేందుకు, ఆర్థిక చేయూత పొందేందుకు అవకాశాలు ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు. -
బోధనాసుపత్రుల్లో వైద్యం ఉచితం!
సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు మెడికల్ కాలేజీలకు అనుబంధంగా ఉండే బోధనాసుపత్రుల్లో పేద రోగులకు ఉచిత వైద్య సేవలు అందించాలని సర్కారు యోచిస్తోంది. ఈ మేరకు ఆయా కాలేజీ యాజమాన్యాలతో ఇప్పటికే చర్చలు జరిపింది. రాష్ట్రంలోని ప్రైవేటు బోధనాసుపత్రుల్లో వేలాది పడకలు ఖాళీగా ఉంటున్నాయని, అవి వృథాగా ఉండకుండా పేదలకు వైద్యం అందిస్తే మేలు చేసినట్లవుతుందని భావిస్తోంది. ఉచితంగా సేవలందిస్తే పేద రోగులు తరలి వస్తారని, తద్వారా మెడికల్ కాలేజీ విద్యార్థులకు ఆచరణాత్మకమైన వైద్య విద్య అందించినట్లు అవుతుందని యాజమాన్యాలతో చర్చల సందర్భంగా పేర్కొన్నట్లు తెలిసింది. సర్కారు వాదనలతో ప్రైవేటు యాజమాన్యాలు అంగీకరించట్లేదు. ఉచిత సేవలు ఇవ్వడం సాధ్యం కాదని, తామిచ్చే వైద్య సేవలను బట్టి ప్రభుత్వం ఎంతో కొంత చెల్లించాలని వారు పట్టుబడుతున్నట్లు సమాచారం. ‘నీట్’ర్యాంకుల ఆధారంగా వైద్య సీట్లను కేటాయిస్తుండటంతో తమకు ఆదాయం తగ్గిందని, ఈ నేపథ్యంలో ఉచిత సేవలు చేయలేమని చేతులెత్తేస్తున్నారు. దీంతో ఇప్పుడు ఏంచేయాలన్న దానిపై సర్కారు సంకటంలో పడిపోయింది. బోధనాసుపత్రుల్లోని పడకలు ఖాళీగా ఉండకుండా వాటిని పేదలకు సేవలు అందించడం ద్వారా భర్తీ చేయాలన్న కృత నిశ్చయంతో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ ఉన్నారు. ఈ మేరకు ఆయన పలు దఫాలుగా సంబంధిత ఉన్నతాధికారులతో చర్చించారు. ప్రభుత్వం ఏమంటోంది... ప్రైవేటు బోధనాసుపత్రుల్లో వేలాది పడకలు ఖాళీగా ఉంటున్నాయి. అవి వృథాగా ఉండకుండా పేదలకు వైద్యం అందిస్తే మేలు చేసినట్లవుతుంది. ఉచితంగా సేవలందిస్తే పేద రోగులు తరలివస్తారు. తద్వారా మెడికల్ కాలేజీ విద్యార్థులకు ఆచరణాత్మకమైన వైద్య విద్య అందించినట్లు అవుతుంది. యాజమాన్యాల వాదన.. ‘నీట్’ ర్యాంకుల ఆధారంగా వైద్య సీట్లను కేటాయిస్తుండటంతో మాకు ఆదాయం తగ్గిపోయింది. ఉచిత సేవలు ఇవ్వడం సాధ్యం కాదు. మేమిచ్చే వైద్య సేవలను బట్టి ప్రభుత్వం ఎంతో కొంత చెల్లించాలి. సర్కారు వైద్య సేవలు అందకపోవడం వల్లే.. రాష్ట్రంలో 8 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, 19 ప్రైవేటు మెడికల్ కాలేజీలున్నాయి. వాటికి అనుబంధంగా ఒక్కో దానికి బోధనాసుపత్రి ఉంది. ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు అనుబంధంగా ఉండే బోధనాసుపత్రులకు రోగులు వెల్లువెత్తుతుండగా, ప్రైవేటులో అధిక ఫీజుల కారణంగా రోగులు ఆసక్తి చూపట్లేదని వైద్య ఆరోగ్యశాఖ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆయా ఆసుపత్రుల్లో అనుభవజ్ఞులైన వైద్యులు, ప్రొఫెసర్లు ఉన్నా ఉపయోగించుకోలేని పరిస్థితి నెలకొంది. దీంతో ప్రైవేటు బోధనాసుపత్రుల్లో పడకలు నిండట్లేదు. గ్రామీణ ప్రాంతాలు, పట్టణాల్లో ప్రభుత్వ ఆసుపత్రుల్లో సరైన వసతులు లేకపోవడం, దీంతో పేద రోగులు హైదరాబాద్‌లోని గాంధీ, ఉస్మానియా, నిలోఫర్ వంటి ప్రభుత్వ బోధనాసుపత్రుల వైపు వెళ్తుండటంతో అక్కడ రద్దీపెరిగింది. ఆ రెండు హామీలు నెరవేర్చితే..? ప్రైవేటు మెడికల్ కాలేజీ యాజమాన్యాలు కోరుతున్నట్లు వైద్య సేవలకు ఎంతోకొంత డబ్బులిస్తే ఎలా ఉంటుందన్న చర్చ కూడా జరుగుతోంది. కానీ అలా చేస్తే ప్రజల్లో ప్రభుత్వ నిర్ణయంపై వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందని వెనకడుగు వేస్తున్నారు. వారు చేసే సేవలకు ఇతరత్రా ఏదో రకంగా మేలు చేసేలా హామీ ఇవ్వాలని భావిస్తున్నట్లు వైద్య ఆరోగ్య శాఖకు చెందిన ఓ కీలకాధికారి వ్యాఖ్యానించారు. ఆరోగ్యశ్రీలోని దాదాపు 100 రకాల చికిత్సలను ప్రభుత్వ ఆసుపత్రులకే సర్కారు పరిమితం చేసింది. వాటికి ఆరోగ్యశ్రీ కింద ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స చేయట్లేదు. ఆ చికిత్సలను ప్రైవేటు బోధనాసుత్రులకూ అనుమతి ఇవ్వాలని యాజమాన్యాలు ఎప్పటినుంచో కోరుతున్నాయి. ఆ డిమాండ్ నెరవేర్చే అంశంపై చర్చ జరుగుతోంది. అలాగే కేసీఆర్ కిట్ పథకాన్ని ప్రైవేటు బోధనాసుపత్రులకూ వర్తింపజేయాలని యాజమాన్యాలు విన్నవిస్తున్నాయి. వీటిపై ఆలోచించాలని సర్కారు యోచిస్తున్నట్లు సమాచారం. సర్కారు దవాఖానాల్లో ఓపీ సమయం పెంపు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఓపీ సమయాన్ని 2 గంటలపాటు పొడిగించారు. ప్రస్తుతం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకే ఓపీ చూస్తుండగా, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ ఆదేశాలతో ఈ సమయాన్ని మధ్యాహ్నం 2 గంటల వరకు పొడిగించారు. ఈ మేరకు 110 ఆస్పత్రుల సూపరింటెండెంట్లకు ఆదేశాలు జారీ అయ్యాయి. అలాగే ప్రస్తుతం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకే ఉన్న డయాగ్నిస్టిక్స్ సమయాన్ని సాయంత్రం 4 గంటల వరకు పొడిగించారు. -
ఎంఎన్‌జే కేన్సర్ ఆస్పత్రిలో యూజర్ చార్జీలు
సాక్షి, హైదరాబాద్: పేద రోగులకు సేవ చేయాల్సిన ఎంఎన్‌జే కేన్సర్ ఆసుపత్రి ఇప్పుడు వారి నుంచే యూజర్ చార్జీల పేరుతో వసూళ్లు చేస్తుండటం విమర్శలకు తావిస్తోంది. ప్రభుత్వ ఆధ్వర్యంలో కేన్సర్ చికిత్సకు రాష్ట్రంలోనే పేరెన్నికగన్న ఆసుపత్రి, ఇప్పుడు వైద్యానికి డబ్బులు వసూలు చేయడం నిబంధనలకు విరుద్ధమని పలువురు రోగులు గగ్గోలు పెడుతున్నారు. పైగా వివిధ పరీక్షలకు రసీదులు కూడా ఇవ్వడం గమనార్హం. మరోవైపు ఆరోగ్యశ్రీ రోగులకు ఉచిత వైద్య సేవలు అందించాల్సి ఉండగా, వారిపై కూడా యూజర్ చార్జీల భారం వేస్తుండటం రోగులకు ఆవేదన కలిగిస్తోంది. ఆరోగ్యశ్రీ నుంచి డబ్బులు వచ్చాక తిరిగి రోగులకు చెల్లిస్తామంటూ ఆసుపత్రి అధికారులు చెబుతున్నారని రోగులు అంటున్నారు. అలా ఇస్తామన్న హామీ ఎక్కడా లేదని, అక్రమాల కేంద్రంగా ఆసుపత్రి తయారైందని అంటున్నారు. దీనిపై సీపీఎం రాష్ట్ర కమిటీ నాయకుడు శ్రీనివాసరెడ్డి వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొచ్చారు. ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ రోగుల నుండి పరీక్షలకోసం యూజర్ చార్జీల పేరుతో భారీగా డబ్బులు వసూలు చేస్తుండటాన్ని ఆయన అధికారులకు విన్నవించారు. ఈ మేరకు వైద్య విద్యా సంచాలకుల (డీఎంఈ) కార్యాలయానికి ఫిర్యాదు చేశారు. ఎంఎన్‌జే కేన్సర్ ఆస్పత్రిలో యూజర్ చార్జీలు వసూలు చేసినట్లుగా చూపుతున్న రసీదులు రూ. 2,500 వరకు వసూలు కొన్ని పరీక్షలకు రూ.100 నుంచి రూ. 1,200 వరకు వసూలు చేస్తున్నారు. ఎంఆర్ఐ, సీటీ స్కాన్ వంటి పరీక్షలకు రూ. 2 వేలు, రూ. 2,500 వసూలు చేస్తున్నారు. ఆరోగ్యశ్రీ రోగులకైతే డబ్బు వసూలు చేయకూడదు. పూర్తి ఉచితంగా వైద్యం అందించాలని ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. దీనికి భిన్నంగా ఫీజులు భారీగా వసూలు చేయడంపై రోగులు గగ్గోలు పెడుతున్నారు. యూజర్ చార్జీలు రద్దు చేయాలని తాము కోరగా, ఆరోగ్యశ్రీ ద్వారా డబ్బులు రాగానే రోగులకు తిరిగి వెనక్కి ఇస్తున్నామని ఆసుపత్రి అర్ఎం చెప్పినట్లు శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. తొలుత వసూలు చేయడమే తప్పు, పైగా తిరిగి చెల్లిస్తున్నామని చెప్పడం కూడా వాస్తవ విరుద్ధమని ఆయన ఆరోపించారు. పైగా రోగులు ఎవరికీ డబ్బు తిరిగి చెల్లిస్తున్న పరిస్థితి లేదు. అదీగాక యూజర్ చార్జీల బిల్లులు కంప్యూటరైజ్డ్వి కాకుండా చేతిరాతతో ఇస్తున్నారు. యూజర్ చార్జీల పేరుతో వసూలైన డబ్బు పూర్తిగా దుర్వినియోగమవుతున్నదని శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. ఆరోగ్యశాఖ అధికారులతో కుమ్మక్కై ఆసుపత్రిలో కొందరు ఈ డబ్బును దిగమింగుతున్నారన్నారు. చట్టవిరుద్ధంగా జరుగుతున్న ఈ దందాపై విచారణ జరపాలని, అక్రమ వసూళ్ళను అరికట్టాలని ఆయన కోరారు. -
11 వేలకుపైగా పడకలు ఖాళీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో 8 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, 19 ప్రైవేటు మెడికల్ కాలేజీలున్నాయి. వాటికి అనుబంధంగా ఒక్కో దానికి బోధనాసుపత్రి ఉంది. ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు అనుబంధంగా ఉండే బోధనాసుపత్రులకు రోగులు వెల్లువెత్తుతుండగా, ప్రైవేటు బోధనాసుపత్రులపై రోగులు పెద్దగా ఆసక్తి చూపడంలేదన్న చర్చ వైద్య ఆరోగ్యశాఖ వర్గాల్లో జరుగుతోంది. ఆయా ఆసుపత్రుల్లో అనుభవజ్ఞులైన వైద్యులు, ప్రొఫెసర్లు ఉన్నా ఉపయోగించుకోలేని పరిస్థితి నెలకొంది. ప్రైవేటు బోధనాసుపత్రుల్లో పడకలున్నా నిండటంలేదన్న చర్చ జరుగుతోంది. దీనిపై ఇటీవల వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. వాటిని అందుబాటులోకి తీసుకురావాలని, తద్వారా రోగులకు అవసరమైన వైద్య సేవలు అందించాలని ఆయన సంకల్పించారు. దీంతో వెద్య ఆరోగ్య శాఖ వర్గాలు కసరత్తు ముమ్మరం చేశాయి. 11 వేలకు పైగా పడకలు.. రాష్ట్రంలో 19 ప్రైవేటు మెడికల్ కాలేజీలున్నాయి. ప్రతి బోధనాసుపత్రికి కనీసంగా 600 పడకలున్నాయి. కొన్నింటికి వెయ్యి వరకు ఉన్నాయి. కనీసంగా 600 పడకలు ఉన్నాయనుకున్నా 11 వేలకు పైగా పడకలు ఆయా ఆసుపత్రుల్లో అందుబాటులో ఉన్నట్లు లెక్క. అంతేకాదు వాటిల్లో ఐసీయూ, సూపర్ స్పెషాలిటీ పడకలు అదనం. అయితే, అనేక బోధనాసుపత్రులకు రోగులు పెద్దగా రావడంలేదన్న అభిప్రాయం వైద్య శాఖ వర్గాల్లో వ్యక్తమవుతోంది. దీంతో పడకలు ఖాళీగా ఉంటున్నాయి. పాత జిల్లాల ప్రకారం చూస్తే ప్రతి జిల్లాలో ప్రైవేటు బోధనాసుపత్రులు ఉన్నప్పటికీ, రోగులు మాత్రం హైదరాబాద్ కార్పొరేట్ ఆసుపత్రులు, గాంధీ, ఉస్మానియా వంటి ప్రభుత్వ బోధనాసుపత్రులపైనే ఆధారపడుతు న్నారు. దీంతో హైదరాబాద్‌కు రోగుల తాకిడి పెరగడంతో పాటు, ఖర్చు తడిసి మోపెడు అవుతోంది. ఎందుకీ పరిస్థితి? ఉదాహరణకు ఖమ్మంలోని మమత మెడికల్ కాలేజీ నగరంలోనే ఉంది. దీనివల్ల రోగులు సులువుగా వెళ్లి రావడానికి వీలుంటుంది. కానీ కొన్ని జిల్లాల్లో ప్రైవేటు బోధనాసుపత్రులు పట్టణ కేంద్రాలకు దూరంగా ఉండటం వల్ల రోగులు వెళ్లడంలేదు. ఫలితంగా వాటిల్లో పడకలు నిండటంలేదని అంటు న్నారు. బోధనాసుపత్రులు ఉచిత వైద్య సేవలు అందించకపోవడం వల్ల కూడా రోగులు ముందుకు రావడంలేదు. జూనియర్ వైద్యులతో చికిత్స చేయిస్తున్నారన్న భావన కూడా నెలకొని ఉందన్న చర్చ జరుగుతోంది. ‘కేసీఆర్ కిట్’అమలుకు అవకాశం ఇవ్వాలి... ఆరోగ్యశ్రీలోని దాదాపు 100 రకాల చికిత్సలను కేవలం ప్రభుత్వ ఆసుపత్రులకే సర్కారు పరిమితం చేసింది. వాటికి ఆరోగ్యశ్రీ కింద ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స చేయడంలేదు. ఉదాహరణకు అపెండిసైటిస్, హిస్టరెక్టమీ తదితర జనరల్ సర్జరీలకి సంబంధించినవి ప్రభుత్వ ఆసుపత్రులకే పరిమితం చేశారు. దీంతో అనేకమంది ఆరోగ్యశ్రీ రోగులు ప్రభుత్వ ఆసుపత్రులకే వెళ్తున్నారు. ఆ చికిత్సలను ప్రైవేటు బోధనాసుత్రులకూ అనుమతి ఇవ్వాలని యాజమాన్యాలు ఎప్పటినుంచో కోరుతున్నాయి. ఇలా చేస్తే తమ వద్దకు కూడా రోగులు వస్తారని అంటున్నారు. ప్రైవేటు బోధనాసుపత్రుల్లోని పడకలను అందుబాటులోకి తీసుకురావాలంటే పలు సంస్కరణలు చేయాల్సిన అవసరముందని పలువురు వైద్య నిపుణులు కోరుతున్నారు. -
సంచార వాహనం ప్రారంభం
ఖమ్మంవైద్యవిభాగం: జంగాల రాజేశ్వరరావు సేవ్ యువర్ లివర్ ఫౌండేషన్ ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా ఉచిత వైద్య సేవలు అందించేందుకు సంచార వాహనాన్ని ఏర్పాటు చేశారు. మయూరిసెంటర్‌లోని సాయిరాం గ్యాస్ట్రో, లివర్ వైద్యశాలలో శనివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్ వాహనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జంగాల సేవ్ యువర్ లివర్ ఫౌండేషన్ ద్వారా ఖమ్మం జిల్లా పరిసర ప్రాంత ప్రజలకు ప్రతి నెల మొదటి ఆదివారం ఉచిత వైద్య సేవలతో పాటు ఉచిత పరీక్షలు, వ్యాక్సినేషన్ ఇవ్వడం అభినందనీయమన్నారు. ఫౌండేషన్ ద్వారా రూ.10 లక్షల వ్యయంతో మొబైల్ వ్యాన్ ద్వారా గ్రామీణ ప్రాంత ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించడం ప్రజలకు ఉపయోగకరమని పేర్కొన్నారు. దీన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని కోరారు. వైద్యులు సునీల్‌కుమార్, స్వాతి మాట్లాడుతూ ఫౌండేషన్ స్థాపించిన ఏడాది కాలంలో 4 వేల మందికి ఉచితంగా వైద్య సేవలు అందించినట్లు తెలిపారు. ఇందులో 293 మందికి హెపటైటిస్ ఇన్ఫెక్షన్ ఉన్నట్లు గుర్తించామని, దాని నివారణకు మందులు ఇచ్చామని తెలిపారు. కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు కటకం గిరిప్రసాద్, కమర్తపు మురళి, ప్రమోద్‌కుమార్, తేజావత్ సురేశ్, పుల్లఖండం సురేశ్, బొమ్మిడి శ్యాంకుమార్, జంగాల శ్రీధర్, అబ్దుల్ కరీం, బొమ్మిడి సునీల్‌కుమార్, బండారు శివకుమార్, కూరపాటి ప్రదీప్, గోలీ అనూప్ పాల్గొన్నారు. -
ఉచిత వైద్యం..ఇలా పొందుదాం!
తెల్ల రేషన్ కార్డు, ఎంప్లాయిమెంట్ హెల్త్ స్కీం (ఈహెచ్ఎస్), వర్కింగ్ జర్నలిస్ట్ హెల్త్ కార్డులు కలిగినవారు జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రధానమైన ప్రభుత్వ, ప్రముఖ కార్పొరేట్ హస్పిటల్స్లలో ఉచితంగావైద్య సేవలు పొందవచ్చు.అందుకు తగిన సమాచారం తెలియక చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. ఏ హాస్పిటల్లో ఏ వైద్యం లభిస్తుందో తెలియక అయోమయానికి గురి అవుతున్నారు. అనుకోకుండా సంభవించే ఆపదలు,అనారోగ్య సమయాల్లో ఈ ఉచిత వైద్య సేవలు ఎంతగానో ఉపయోగపడుతాయి. మనిషి ప్రాణాలను కాపాడుతాయి. అందుకు ‘సాక్షి’ అందిస్తున్న సమాచారు. కడప రూరల్: మనిషి అనారోగ్యం పాలైతే వైద్య సేవలకు అధిక ఖర్చులు చేయాల్సి వస్తోంది.. ఇలాంటి తరుణంలో నిరుపేదలకు వర్తించే నాటి రాజీవ్ ఆరోగ్య శ్రీ. నేటి డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ, ప్రభుత్వ ఉద్యోగులకు ఈహెచ్ఎస్, వర్కింగ్ జర్నలిస్ట్‌లకు హెల్త్ కార్డులు ఎంతగానో ఉపయోగపడుతాయి. కాగా తెల్ల రేషన్ కార్డు కలిగిన వారికి వర్తించే ఎన్టీఆర్ వైద్య సేవలో 1044 వ్యాధులు, ఈహెచ్ఎస్, వర్కింగ్ జర్నలిస్ట్ హెల్త్ కార్డులు కలిగిన వారికి 1885 రకాల జబ్బులకు ఉచితంగా వైద్య సేవలను పొందవచ్చు. ఏ కార్డు లేని వారికి ‘ఆరోగ్య రక్ష’ దిక్కు... మొన్నటి వరకు తెల్లరేషన్ కార్డు ఉంటేనే ఎన్టీఆర్ వైద్య సేవలు వర్తించేవి.కార్డు లేకపోతే సీఎం పేషీకి వెళ్లి ప్రత్యేకంగా అనుమతి తీసుకొని రావాల్సిన పరిస్ధితి ఏర్పడేది. ఇదంతా వ్యయ ప్రయాసాలతో కూడింది. తాజాగా ఆ విధానానికి ప్రభుత్వం స్వస్తి పలికింది. ఇప్పుడు ఏ వర్గమైనా సరే.. ఏ కార్డు లేనివారు ‘ఆరోగ్య రక్ష’ పథకంలో చేరాలి.ఇందులో చేరాలంటే ఒక వ్యక్తి ఏడాదికి రూ. 1244 లను మీ సేవా కేంద్రాలు లేదా కడప పాత కలెక్టరేట్లోని డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా జిల్లా కార్యాలయంలో చెల్లించాలి. ఇందులో చే రిన వారికి ఎన్టీఆర్ వైద్య సేవ తరహలోనే 1044 రకాల వ్యాధులకు సంబంధించి జిల్లా వ్యాప్తంగా ఉన్న 22 హాస్పిటల్స్‌లలో ఉచితంగా వైద్య సేవలను పొందవచ్చు. ఆపరేషన్ లేని వ్యాధులకు కూడా వైద్యం... పెరాల్సిస్ తదితర ఆపరేషన్‌తో సంబంధంలేని వ్యాధులకు కూడా ఉచితంగా వైద్య సేవలను పొందవచ్చు. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో కూడా వైద్య సేవలను పొందవచ్చు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ వెబ్సైట్, ఆయా హాస్పిటల్స్‌లోని ఆరోగ్య మిత్ర లేదా కడప పాత కలెక్టరేట్లో గల డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ జిల్లా కో ఆర్డినేటర్ కార్యాలయంలో తెలుసుకోవచ్చు. వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలి... ఉచిత వైద్య సేవలకు సంబంధించి ఆయా హాస్పిటల్స్‌లో ఉన్న ఆరోగ్య మిత్రలను లేదా కడప పాత కలెక్టరేట్లోని ఎన్టీఆర్ వైద్యసేవ జిల్లా కో ఆర్డినేటర్ కార్యాలయాన్ని సంప్రదింవచ్చు. అలాగే ఏ కార్డు లేనివారు ‘ఆరోగ్య రక్ష’ పథకంలో చేరి లబ్దిపొందాలి. ఉచిత వైద్య సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి– డాక్టర్ శివనారాయణ,జిల్లా కో ఆర్డినేటర్, ఎన్టీఆర్ వైద్య సేవ -
‘కార్పొరేట్’లో ఉచిత ఓపీ లేనట్టే!
నిమ్స్ ప్యాకేజీ’ కోరిన ఆసుపత్రులు సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కార్పొరేట్ ఉచిత వైద్య సేవలకు సంబంధించి ఏడాదిన్నరగా పరిష్కారం కావడంలేదు. నగదు రహిత ఆరోగ్య కార్డుల కింద ఉద్యోగులకు కార్పొరేట్, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో ఉచిత వైద్యంపై బుధవారం సచివాలయంలో ఆసుపత్రుల యాజమాన్యాలతో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి ప్రత్యేక సమావేశం నిర్వహించారు. కానీ పూర్తిస్థాయి పురోగతి సాధించకుండానే సమావేశం ముగిసింది. ఔట్ పేషెంట్(ఓపీ) వైద్య సేవలను ఉచితంగా చేయబోమని, ఇది తమకు ఏమాత్రం గిట్టుబాటుకాదని కార్పొరేట్ ఆసుపత్రులు స్పష్టం చేసినట్లు వైద్య మంత్రి కార్యాలయం తెలిపింది. వాస్తవంగా ఉద్యోగులు ఏదైనా ఆరోగ్య పరీక్ష చేసుకోవాలంటే కార్పొరేట్ ఆసుపత్రుల్లో కన్సల్టేషన్ ఫీజు, ఇతర పరీక్షల ఫీజు తడిసి మోపెడవుతుంది. ఇది ఉచితంగా లేకుంటే నగదు రహిత ఆరోగ్య కార్డుల వల్ల ప్రయోజనం ఏమిటనేది ఉద్యోగుల ప్రశ్న. ఉచిత ఓపీ సేవలు కాకుండా ఉద్యోగులకు ఏడాదికి రూ.5 వేల చొప్పున ఓపీ అలవెన్స్ ఇస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనలో సర్కారుంది. కానీ అది ఏమూలకూ సరిపోదని ఉద్యోగులు అంటున్నారు. ఓపీ సేవల కోసం ప్రత్యేక క్లినిక్‌లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆలోచించినా అది ఆచరణ సాధ్యం కాదన్న అభిప్రాయమూ ఉంది. ఆపరేషన్ల ప్యాకేజీ 40 శాతం పెంపునకు అంగీకారం వివిధ ఆపరేషన్లకు గాను ప్రస్తుతమున్న ప్యాకేజీని 40 శాతం పెంచడానికి ప్రభుత్వం అంగీకారం తెలిపింది. దీనిపై ఇరు వర్గాలకు ఎటువంటి వివాదం లేదు. మెడికల్ ప్యాకేజీని నిమ్స్ మిలీనియం ప్యాకేజీ ప్రకారం ఇవ్వాలని కార్పొరేట్ ఆసుపత్రి వర్గాలు కోరుతున్నాయి. సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో ఓపీ సేవలు, వైద్య పరీక్షలకు సంబంధించి అవసరమైతే ఉద్యోగులు ప్రీమియం చెల్లించడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ అడుగు ముందుకు పడలేదు. నిమ్స్ మాదిరి మెడికల్ ప్యాకేజీ, ఓపీకి సొమ్ము చెల్లించాలని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల సంఘం (టీషా) కోరుతోంది. దీనికి అంగీకరిస్తే మెడికల్ ప్యాకేజీ, ఓపీలకే రూ. 500 కోట్ల మేర అదనపు భారం పడుతుందని సర్కారు అంచనా. ఓపీ సేవలు ఉచితమైతే ఉద్యోగులు అవసరమున్నా లేకున్నా వైద్య పరీక్షలు చేయించుకుంటారన్నది ప్రభుత్వం, కార్పొరేట్ ఆసుపత్రుల వాదన. అయితే, వచ్చే దసరా నుంచి ఉద్యోగులకు ఉచిత కార్పొరేట్ వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి వెల్లడించారు. అప్పటిలోగా ఈ సమస్యను పరిష్కరిస్తామన్నారు. -
అభాగ్యులకు ఆసరా
వారంతా విద్యార్థులు, ఉద్యోగులు. ఎక్కడైనా పేదలు ఆకలితో అల్లాడుతున్నారని తెలిస్తే వెంటనే స్పందిస్తారు. వృద్ధులు, వితంతువులు, పేదలకు ఆసరాగా నిలుస్తారు. బియ్యం, దుస్తులు, చెప్పులు వంటివి అందిస్తారు. పిల్లల నిరాదరణకు గురైన వారికి ఉచితంగా వైద్యసేవలు అందిస్తూ బతుకుపై భరోసా కల్పిస్తున్నారు. సేవ చేసేందుకు జిల్లాలతో సంబంధం లేదని చాటుతున్నారు. విశాఖ జిల్లా నుంచి జామి మండలంలోని భీమసింగి పంచాయతీ పరిధిలో ఉన్న ఏడు గ్రామాలకు చెందిన 200 మందికి ప్రతి నెలా సాయం చేస్తున్నారు. - జామి విశాఖపట్నానికి చెందిన ద్వారకా సాయి సేవా సమితి సభ్యులు 20 మంది కలిసి నిరాశ్రయులకు సేవ చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు సర్వే చేసి భీమసింగి పంచాయతీలో ఏడు గ్రామాలకు చెందిన వృద్ధులు, వితంతువులు, పేదలను 200 మందిని ఎంపిక చేశారు. ప్రతి నెల మొదటి ఆదివారం విశాఖ నుంచి భీమసింగి పంచాయతీలోని యాతపాలెం గ్రామానికి చేరుకుంటారు. ఎంపిక చేసిన 200 మందికి ఒక్కొక్కరికి నెలకు 3.5 కిలోల బియ్యం, దుస్తులు, చెప్పులు, ఇతర నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తారు. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి వైద్య చికిత్స చేయిస్తారు. అన్నదాన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తారు. రెండేళ్లుగా ఈ సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. విద్యార్థులే ఎక్కువ.. ద్వారకా సాయి సమితి సభ్యుల్లో విద్యార్థులే ఎక్కువ. కొద్దిమంది ఉద్యోగులు, వ్యాపారులు కూడా ఉన్నారు. విశాఖపట్నంలోని కంచరపాలేనికి చెందిన సాయిసురేష్, శ్రీరామమూర్తి, సాయిరాం, పి.వెంకటరావు, ధరణి, రోజా, భవానీ, లోకే ష్, వేణు, పోలారావు తదితరులు ఈ సమితిలో సభ్యులు. వీరు తమ సొంత డబ్బులతో సేవ చేస్తున్నారు. ఈ బృందాన్ని స్థానికులు అభినందిస్తున్నారు. సేవ చేయడంలోనే ఆనందం ‘సేవ చేయడంలో ఎంతో ఆనందం ఉంటుంది. నిరాశ్రయులు, పేదలకు మాకు ఉన్నదానిలోనే సాయం చేస్తున్నాం. ఈ ప్రాంతంలో ఎక్కువగా వృద్ధులు, బీదలు ఉన్నారని తెలుసుకున్నాం. యాతవరానికి చెందిన ముత్యాలు అనే యువకుడి సహకారంతో రెండేళ్లుగా ప్రతి నెల ఈ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం.’ - సాయిసురేష్, పీజీ విద్యార్థి, ద్వారకా సాయి సేవా సమితి సభ్యుడు -
చంద్రబాబుతో పేదలకు వైద్యం దూరం
చిత్తూరు (అగ్రికల్చర్) : చంద్రబాబు కారణంగా నిరుపేదలు వైద్యసేవలకు దూరం అవుతున్నారని సీపీఐ జిల్లా కార్యదర్శి ఏ.రామానాయుడు మండిపడ్డారు. చిత్తూరు ప్రభుత్వాసుపత్రిని అపోలోకు 35 ఏళ్ల పాటు లీజుకివ్వడాన్ని నిరసిస్తూ స్థానిక కలెక్టరేట్ ఎదుట సీపీఐ నాయకులు ధర్నా నిర్వహించారు. జిల్లాకు తల మానికమైన చిత్తూరుప్రభుత్వాసుపత్రి కారణంగా చుట్టుపక్కల 15 మండలాల ప్రజలు వైద్య సేవలు పొందుతున్నాయని వారు తెలి పారు. అటువంటి ఆసుపత్రిని చంద్రబాబు అపోలోకు మొదటగా ఐదేళ్లకు లీజుకిస్తున్నట్లు ప్రకటించి, తర్వాత దానిని 35 ఏళ్లకు పెం చుతూ నిర్ణయం తీసుకోవడం దారుణమన్నారు. ఉచిత వైద్యసేవలు పేదలకు దక్కకుండా చేసి కార్పొరేట్ సంస్థలకు అప్పగిస్తున్నారని దుయ్యబట్టారు. జిల్లావాసి అయిన చంద్రబాబు గతంలో చిత్తూరు విజయాపాల డెయిరీని మూయించి వేసి పాడిరైతులను ముంచారని గుర్తుచేశారు. మళ్లీ ఇప్పుడు సీఎం కాగానే జిల్లాలోని చిత్తూరు, గాజులమండ్యం చక్కెర ఫ్యాక్టరీలను మూయిం చి ఇటు చెరకు రైతులను, అటు కార్మికులను వీధులపాలు చేశారన్నారు. ప్రజలు చంద్రబాబు అవి నీతి పాలన తీరును గమనిస్తున్నారని త్వరలోనే గుణపాఠం చెప్పడం ఖాయమని ఆయన తెలిపారు. పేద ల, కార్మికుల కడుపుకొట్టిన చంద్రబాబు భవిష్యతులో మనుగడ కోల్పోవడం ఖాయమని జోస్యం చెప్పారు. ఇకనైనా చిత్తూరు ప్రభుత్వాసుపత్రిని అపోలోకు అప్పగించ కుండా పేదలకు వైద్య సేవలను అందుబాటులోకి తేవాలని వారు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో సీపీ ఐ ఆధ్వర్యంలో ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. ఈ ధర్నాలో సీపీఐ చిత్తూరు నియోజకవర్గ కార్యదర్శి ఎస్.నాగరాజన్, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పి.వెంకటరత్నం, ఏఐటీయూసీ జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి పీఎల్.నరసింహులు, సీపీఐ నాయకులు పాల్గొన్నారు. -
ధర్మాస్పత్రిపై అధర్మవేటు!
- చిత్తూరు ప్రభుత్వాస్పత్రి ఇక ప్రైవేటుపరం - వైద్యశాల పరిశీలనకు నేడు కమిటీ రాక - పేదలకు దూరం కానున్న వైద్యం - అన్ని సేవలకూ ఫీజుల మోత తప్పదు - పేదలు, వైద్యవర్గాల్లో ఆందోళన సాక్షి,చిత్తూరు/చిత్తూరు అర్బన్ : గతంలో చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి ఉన్నపుడు చిత్తూరు విజయా డెయిరీ మూతపడింది. మళ్లీ ఆయన పదవిలోకి ఏడాది పూర్తి కాకనే చిత్తూరు షుగర్స మూతపడేట్లు చేశారు. తాజాగా ప్రభుత్వాస్పతిని కూడా ప్రయివేటు పరంచేసేందుకు సర్వం సిద్ధం చేశారు. ఉచిత వైద్యసేవలు అందించడమే ధ్యేయమని చెప్పిన చంద్రబాబు మాట తప్పారు. చిత్తూరులోని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిని అపోలో వైద్య సంస్థలకు అప్పగించడానికి ఏర్పాట్లన్నీ చకచకా జరిగిపోతున్నాయి. ఇక్కడున్న ఆస్పత్రిని అపోలో సంస్థలు ఏర్పాటు చేయనున్న మెడికల్ కాలేజీకి క్లీనికల్ అటాచ్మెంట్ ఇవ్వాలని ఆ సంస్థ అడగటం.. ప్రభుత్వం సైతం అంగీకరించడం తెలి సిందే. దీంతో గురువారం ఆస్పత్రిలోని అధికారులు ప్రభుత్వం అడిగిన నివేదిక ఇవ్వడంలో నిమగ్నమయ్యారు. 300 పడకలు, రోజులు వెయ్యి మందికిపైనే అవుట్ పేషెంట్లు, 17 ఎకరాల సువిశాల స్థలం ఉన్న చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రిలో మొత్తం 14 విభాగాలున్నాయి. ఎక్స్‌రే, డిస్పెన్సరీ, ఆపరేషన్ థియేటర్లు, కంటి విభాగం, ప్రసూతి విభాగం, కుష్ఠు వ్యాధి నివారణ వార్డు, జీఈ షెడ్డు, రోగులకు భోజనం అందించే విభాగం, నర్శింగ్ క్వార్టర్స్, క్షయ వార్డు, పోస్టుమార్టం విభాగం, ఇటీవల నూతనంగా రూ.2 కోట్ల వ్యయంతో నిర్మించిన మాతా, శిశు సంరక్షణ కేంద్ర భవనం, ఎంపీహెచ్‌డబ్ల్యూ శిక్షణ కేంద్రం, ఆయుర్వేదిక్, ఏఆర్టీ సెంటర్లు ఆస్పత్రిలో ఉన్నాయి. మొత్తం ఆస్పత్రి 2.65 లక్షల చదరపు అడుగుల్లో భవనాలు ఉన్నాయి. ఇన్ని వసతులున్న ఆస్పత్రిలో ప్రైవేటు సంస్థకు చెందిన శిక్షణ వైద్యులు ప్రవేశిస్తారు. రోగుల జబ్బులపై ప్రయోగాలు చేయడం, పోస్టుమార్టం గదిలో మృతదేహాలకు శవపరీక్షలు చేసి శిక్షణ పొందడం లాంటివి చేయనున్నారు. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రైవేటు భాగస్వామ్యానికి అంగీకరించిందని చెబుతున్న రాష్ట్ర ప్రభుత్వం దీనికున్న సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని ఓ కమిటీని ఏర్పాటు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. అయితే ప్రభుత్వ ఆస్పత్రిని మూడేళ్ల తరువాత ఖాళీ చేస్తారా..? చేయకుంటే పరిస్థితి ఏమిటి..? అనే విషయాలపై అధికారుల వద్ద, ప్రజాప్రతినిధుల వద్ద సరైన సమాధానాలు లేవు. ఉద్యోగులపై ఆరా... మరోవైపు ఆస్పత్రిలో పనిచేస్తున్న ఉద్యోగుల వివరాలు, వారికి నెలసరి ఇచ్చే జీత భత్యాలు, ఎన్నేళ్ల నుంచి ఇక్కడ పనిచేస్తున్నారు, వారి పనితీరు ఎలా ఉందనే అంశాలను సైతం వెంటనే సిద్ధం చేయాలని ఆస్పత్రి అధికారులను ఆదేశించింది. 2012-13, 2013-14, 2014-15 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి మూడేళ్ల నివేదికను ఇవ్వాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దీంతో ఉద్యోగులకు ఇక నుంచి ప్రభుత్వం జీత భత్యాలు చెల్లిస్తుందా..? మరో ప్రాంతానికి బదిలీ చేస్తుందా..? అపోలో సంస్థలకు తమనూ అప్పగిస్తుందా..? అనే ప్రశ్నలతో వైద్యులు, ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. పేదల వైద్యానికి పాతర చిత్తూరు ప్రభుత్వాస్పత్రిని అపోలోకు అప్పగిస్తే పేదలకు వైద్యసేవలు అందే పరిస్థితి ఉండదని వైద్య ఉద్యోగులు,యూనియన్ నేతలు పేర్కొంటున్నారు. ప్రస్తుతం ఈ ఆస్పత్రిలో రోజుకు వెయ్యి మందికి తగ్గకుండా వైద్యసేవలు పొందుతున్నారు. అపోలో చేతుల్లోకి వెళితే వైద్య సేవల కోసం వచ్చే పేదల నుంచి ముక్కుపిండి కనీస ఫీజులు వసూలు చేయనున్నారు. ముఖ్యంగా సీటీ స్కాన్,ఈసీజీ,ఎండో స్కోప్,ఎక్సరే తదితర టెస్ట్‌లకు అధిక ఫీజులు వసూలు చేస్తారు. పేద,మధ్యతరగతికి చెందిన రోగులకు కష్టాలు తప్పవని ఇక్కడి వైద్యులు చెబుతున్నారు. చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి 166ఏళ్లు చిత్తూరు ఆసుపత్రికి పెద్ద ఘనచరిత్రే ఉంది. ఈ ఆసుపత్రి నిర్మాణం జరిగి ఇప్పటికి 166 సంవత్సరాలు. 1849 లో ఒక చిన్న డిస్పెన్షరిగా ఓ ప్రైవేటు బిల్డింగులో ఈ ఆసుపత్రి ప్రారంభమైంది. 1867లో ఆసుపత్రికి ప్రభుత్వం సొంతభవనాన్ని నిర్మించింది. 1919 వరకు లోకల్ బోర్డు ఆసుపత్రి నిర్వహణను చేపట్టింది. ఆ తరువాత రాష్ట్ర ప్రభుత్వం ఆసుపత్రి నిర్వహణను చేపట్టింది. ప్రస్తుతం 320 పడకల ఆసుపత్రిగా చిత్తూరు ఆసుపత్రి రూ పాంతరం చెంది రోజూ వెయ్యిమంది పేదలకు వైద్యసేవలు అందిస్తోంది. ప్రస్తుతం 177మంది రెగ్యులర్ ఉద్యోగులుండగా, 10 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు, మరో పదిమంది ఔట్సోర్సింగ్ ఉ ద్యోగులు పనిచేస్తున్నారు. మరో 55 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మొత్తం ఈఆస్పత్రిలో 252మంది ఉద్యోగ పోస్టులున్నా యి. ఇంత చరిత్ర కలిగిన ప్రజావైద్యశాలను ప్రభుత్వం ప్రైవేటుపరం చేయాల ని పూనుకోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెతుతున్నాయి. -
వర్సిటీలకు నిధులు పెంచాలి
తెయూ(డిచ్పల్లి): తెలంగాణ యూనివర్సిటీ అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది (టూటా)ఆధ్వర్యంలో వర్సిటీ పరిపాలనా భవనం ఎదుట గురువారం మహా ధర్నా నిర్వహించారు. రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల ఉద్యోగుల, అధ్యాపకుల జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపు మేరకు మహాధర్నా చేపట్టారు. యూనివర్సిటీలకు ఏకమొత్తంలో విడుదల చేసే నిధులు(బ్లాక్ గాంట్స్) పెంచాలని, వర్సిటీ ఉద్యోగులందరికీ హెల్త్ కార్డులందించి ఉచిత వైద్య సదుపాయం కల్పించాలని, ఔట్ సోర్సింగ్ సిబ్బందిని రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. టూటా అధ్యక్షుడు ప్రొఫెసర్ శివశంకర్, ప్రధానకార్యదర్శి, వర్సిటీ ఇన్చార్జి రిజిస్ట్రార్ ప్రొఫెసర్ యాదగిరి మాట్లాడుతూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత యూనివర్సిటీలకు నిధు లు భారీగా పెరుగుతాయని ఆశించామన్నారు. అయితే గత ప్రభుత్వాల వలనే అరకొర నిధులతో సరిపెట్టారని విమర్శించారు. రెగ్యులర్ వైస్ చాన్స్లర్లను నియమించాలన్నారు. నాన్-టీచింగ్ ఉద్యోగుల సం ఘం అధ్యక్షుడు మనోహర్‌గౌడ్ మాట్లాడుతూ.. ప్రభు త్వ ట్రెజరీ నుంచి వర్సిటీల ఉద్యోగులందరికీ జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఔట్సోర్సింగ్ ఉద్యోగుల యూ నియన్ అధ్యక్షుడు శ్రీనివాస్ మాట్లాడు తూ.. ఔట్సోర్సింగ్ ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. టూటా ఉపాధ్యక్షులు మమత, పున్నయ్య, జాన్సన్, ఇక్బాల్ ఖురేషీ, సాయాగౌడ్, విజ యలక్ష్మి, టీచింగ్, నాన్-టీచింగ్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.