వాహనాన్ని ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే అజయ్‌కుమార్
ఖమ్మంవైద్యవిభాగం: జంగాల రాజేశ్వరరావు సేవ్ యువర్ లివర్ ఫౌండేషన్ ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా ఉచిత వైద్య సేవలు అందించేందుకు సంచార వాహనాన్ని ఏర్పాటు చేశారు. మయూరిసెంటర్‌లోని సాయిరాం గ్యాస్ట్రో, లివర్ వైద్యశాలలో శనివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్ వాహనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జంగాల సేవ్ యువర్ లివర్ ఫౌండేషన్ ద్వారా ఖమ్మం జిల్లా పరిసర ప్రాంత ప్రజలకు ప్రతి నెల మొదటి ఆదివారం ఉచిత వైద్య సేవలతో పాటు ఉచిత పరీక్షలు, వ్యాక్సినేషన్ ఇవ్వడం అభినందనీయమన్నారు. ఫౌండేషన్ ద్వారా రూ.10 లక్షల వ్యయంతో మొబైల్ వ్యాన్ ద్వారా గ్రామీణ ప్రాంత ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించడం ప్రజలకు ఉపయోగకరమని పేర్కొన్నారు.
దీన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని కోరారు. వైద్యులు సునీల్‌కుమార్, స్వాతి మాట్లాడుతూ ఫౌండేషన్ స్థాపించిన ఏడాది కాలంలో 4 వేల మందికి ఉచితంగా వైద్య సేవలు అందించినట్లు తెలిపారు. ఇందులో 293 మందికి హెపటైటిస్ ఇన్‌ఫెక్షన్ ఉన్నట్లు గుర్తించామని, దాని నివారణకు మందులు ఇచ్చామని తెలిపారు. కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు కటకం గిరిప్రసాద్, కమర్తపు మురళి, ప్రమోద్‌కుమార్, తేజావత్ సురేశ్, పుల్లఖండం సురేశ్, బొమ్మిడి శ్యాంకుమార్, జంగాల శ్రీధర్, అబ్దుల్ కరీం, బొమ్మిడి సునీల్‌కుమార్, బండారు శివకుమార్, కూరపాటి ప్రదీప్, గోలీ అనూప్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment