Puvvada MLA Ajay Kumar
-
సంచార వాహనం ప్రారంభం
ఖమ్మంవైద్యవిభాగం: జంగాల రాజేశ్వరరావు సేవ్ యువర్ లివర్ ఫౌండేషన్ ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా ఉచిత వైద్య సేవలు అందించేందుకు సంచార వాహనాన్ని ఏర్పాటు చేశారు. మయూరిసెంటర్‌లోని సాయిరాం గ్యాస్ట్రో, లివర్ వైద్యశాలలో శనివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్ వాహనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జంగాల సేవ్ యువర్ లివర్ ఫౌండేషన్ ద్వారా ఖమ్మం జిల్లా పరిసర ప్రాంత ప్రజలకు ప్రతి నెల మొదటి ఆదివారం ఉచిత వైద్య సేవలతో పాటు ఉచిత పరీక్షలు, వ్యాక్సినేషన్ ఇవ్వడం అభినందనీయమన్నారు. ఫౌండేషన్ ద్వారా రూ.10 లక్షల వ్యయంతో మొబైల్ వ్యాన్ ద్వారా గ్రామీణ ప్రాంత ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించడం ప్రజలకు ఉపయోగకరమని పేర్కొన్నారు. దీన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని కోరారు. వైద్యులు సునీల్‌కుమార్, స్వాతి మాట్లాడుతూ ఫౌండేషన్ స్థాపించిన ఏడాది కాలంలో 4 వేల మందికి ఉచితంగా వైద్య సేవలు అందించినట్లు తెలిపారు. ఇందులో 293 మందికి హెపటైటిస్ ఇన్ఫెక్షన్ ఉన్నట్లు గుర్తించామని, దాని నివారణకు మందులు ఇచ్చామని తెలిపారు. కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు కటకం గిరిప్రసాద్, కమర్తపు మురళి, ప్రమోద్‌కుమార్, తేజావత్ సురేశ్, పుల్లఖండం సురేశ్, బొమ్మిడి శ్యాంకుమార్, జంగాల శ్రీధర్, అబ్దుల్ కరీం, బొమ్మిడి సునీల్‌కుమార్, బండారు శివకుమార్, కూరపాటి ప్రదీప్, గోలీ అనూప్ పాల్గొన్నారు. -
ఆరోగ్యశ్రీ. 108లతో వైఎస్సార్‌కు పేరుప్రతిష్టలు: పువ్వాడ
హైదరాబాద్: ఆరోగ్యశ్రీ పథకాన్ని, 108, 104 సర్వీసులను అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సమర్థంగా అమలుచేశారు. అవి ఆయనకు, అప్పటి తమ ప్రభుత్వానికి ఎంతో మంచి పేరు ప్రతిష్టలు సంపాదించి పెట్టాయి’’ అని కాంగ్రెస్ ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు. కుయ్‌కుయ్ అంటూ 108 అంబులెన్స్ వైఎస్సార్‌కు ఎంతో పేరు తెచ్చిందన్నారు. ఈ సేవలను ప్రభుత్వం మరింత మెరుగ్గా అమలు చేసి అంతకంటె మంచిపేరు తెచ్చుకోవాలని ఆకాంక్షించారు. కాళోజీ హెల్త్ వర్సిటీకి వీసీ, రిజిస్ట్రార్, ఎగ్జిక్యూటివ్కౌన్సిల్ను ఏర్పాటుచేసి ఈ ఏడాది ఎం బీబీఎస్ అడ్మిషన్లను అక్కడి నుంచే నిర్వహిం చేలా చూడాలన్నారు. ప్రైవేట్ ఆసుపత్రులు, కాలేజీల్లో ఫీజుల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని సీసీఎం సభ్యుడు సున్నం రాజయ్య సూచించారు. తమ ప్రతిపాదనలకు, కట్ మోషన్లకు ప్రభుత్వం అంగీకరిస్తేనే బడ్జెట్‌ను ఆమోదిస్తామన్నారు. విద్యా విధానంలో సమూల మార్పులు తేవాలని సీపీఐ సభ్యుడు రవీంద్రకుమార్ సూచించారు. సీఎం పిల్లలు, నాలుగో తరగతి ప్రభుత్వోద్యోగి పిల్లలు ఒకే పాఠశాలలో చదివేలా ఏర్పాట్లు చేయాల న్నా రు. ఏజెన్సీ ప్రాంతాల్లో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు పెట్టాలని టీఆర్ఎస్ సభ్యుడు చిన్నయ్య, టీచర్లకు ఇంగ్లీష్ మీడియంలో శిక్షణ ఇవ్వాలని దాసరి మనోహర్‌రెడ్డి సూచించారు.