ఆరోగ్యశ్రీ. 108లతో వైఎస్సార్‌కు పేరుప్రతిష్టలు: పువ్వాడ
హైదరాబాద్: ఆరోగ్యశ్రీ పథకాన్ని, 108, 104 సర్వీసులను అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సమర్థంగా అమలుచేశారు. అవి ఆయనకు, అప్పటి తమ ప్రభుత్వానికి ఎంతో మంచి పేరు ప్రతిష్టలు సంపాదించి పెట్టాయి’’ అని కాంగ్రెస్ ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు. కుయ్‌కుయ్ అంటూ 108 అంబులెన్స్ వైఎస్సార్‌కు ఎంతో పేరు తెచ్చిందన్నారు. ఈ సేవలను ప్రభుత్వం మరింత మెరుగ్గా అమలు చేసి అంతకంటె మంచిపేరు తెచ్చుకోవాలని ఆకాంక్షించారు. కాళోజీ హెల్త్ వర్సిటీకి వీసీ, రిజిస్ట్రార్, ఎగ్జిక్యూటివ్‌కౌన్సిల్‌ను ఏర్పాటుచేసి ఈ ఏడాది ఎం బీబీఎస్ అడ్మిషన్లను అక్కడి నుంచే నిర్వహిం చేలా చూడాలన్నారు.
ప్రైవేట్ ఆసుపత్రులు, కాలేజీల్లో ఫీజుల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని సీసీఎం సభ్యుడు సున్నం రాజయ్య సూచించారు. తమ ప్రతిపాదనలకు, కట్ మోషన్లకు ప్రభుత్వం అంగీకరిస్తేనే బడ్జెట్‌ను ఆమోదిస్తామన్నారు. విద్యా విధానంలో సమూల మార్పులు తేవాలని సీపీఐ సభ్యుడు రవీంద్రకుమార్ సూచించారు. సీఎం పిల్లలు, నాలుగో తరగతి ప్రభుత్వోద్యోగి పిల్లలు ఒకే పాఠశాలలో చదివేలా ఏర్పాట్లు చేయాల న్నా రు. ఏజెన్సీ ప్రాంతాల్లో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు పెట్టాలని టీఆర్‌ఎస్ సభ్యుడు చిన్నయ్య, టీచర్లకు ఇంగ్లీష్ మీడియంలో శిక్షణ ఇవ్వాలని దాసరి మనోహర్‌రెడ్డి సూచించారు.