తెలుగు రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు.. భయంతో జనం పరుగులు | Earthquake Effect In AP And Telangana, Residents Of Several Areas Experienced Panic | Sakshi
Sakshi News home page

Earthquake Today News: తెలుగు రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు.. భయంతో జనం పరుగులు

Published Wed, Dec 4 2024 7:54 AM | Last Updated on Wed, Dec 4 2024 10:04 AM

Earthquake Effect In AP And Telangana

సాక్షి, ఖమ్మం: తెలుగు రాష్ట్రాల్లో పలు జిల్లాల్లో భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. ఏపీలోని ఎన్టీఆర్‌ జిల్లా, విజయవాడ, జగ్గయ్యపేట.. తెలంగాణలోని ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి వరంగల్‌ జిల్లాలతో సహా హైదరాబాద్‌లో కూడా భూమి కంపించడంతో ఇళ్లలో నుంచి ప్రజలు పరుగులు తీశారు. 

పలు ప్రాంతాల్లో బుధవారం ఉదయం 7:27 గంటలకు రెండు నిమిషాల పాటు భూమి కంపించింది. దీంతో, ఇళ్లు, అపార్ట్‌మెంట్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ప్రకంపనల తీవ్రత రిక్టర్‌ స్కేలుపై 5.3గా నమోదైంది. కాగా, ములుగు జిల్లాలోని మేడారం కేంద్రంగా భూమి కంపించినట్టు అధికారులు చెబుతున్నారు. దాదాపు  20 ఏళ్ల తర్వాత తెలుగు స్టేట్స్‌లో ఇలా భూమి కంపించడం గమనార్హం.  ఈ మేరకు సీఎస్‌ఐఆర్‌ ఓ ఫొటోను విడుదల చేసింది. 

 

 

 

వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, బోరబండ, రాజేంద్రనగర్‌, రాజేంద్రనగర్‌ సహా రంగారెడ్డి జిల్లాలో దాదాపు ఐదు సెకన్ల పాటు భూమి కంపించినట్టు స్థానికులు చెబుతున్నారు. తెలంగాణలోని చాలా జిలాల్లో భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. అటు, మహారాష్ట్రలోని గడ్చిరోలిలో కూడా భూమి కంపించింది. 

ఖమ్మంలోకి నేలకొండపల్లి, భద్రాద్రి కొత్తగూడెంలోని చుండడ్రుగొండలో బుధవారం తెల్లవారుజామున కొన్ని సెకన్ల పాటు భూమి కంపించినట్టు ప్రజలు తెలిపారు. భూ ప్రకంపనలతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.

అటు ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో కూడా భూమి కంపించింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం రంగాపురం గ్రామంలో 10 సెకన్ల పాటు  భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గవ్యాప్తంగా స్వల్పంగా భూమి కంపించింది. దీంతో, ప్రజలు ఒక్కసారిగా భయాందోళనకు  గురయ్యారు. అలాగే, కేససముద్రం, మహబూబాబాద్, బయ్యారంలో కూడా కొన్ని సెకండ్ల పాటు భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి.

హన్మకొండ జిల్లా పరకాల డివిజన్‌లో భూ ప్రకంపనలు వచ్చాయి. అలాగే, వరంగల్‌లోని పలు ప్రాంతాల్లో 5 నుండి 15 సెకండ్ల వరకు స్వల్పంగా కంపించిన భూమి. దీంతో, భయాందోళనలో స్థానికులు ఉన్నాయి. భూమి కంపించడంపై ఉదయాన్నే సిటి మొత్తం పెద్ద ఎత్తున చర్చనీయాంశం అవుతోంది. కరీంనగర్‌లోని పలు ప్రాంతాల్లో కూడా భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. 

ఏపీలోని ఎన్టీఆర్‌ జిల్లా, విజయవాడ, తిరువూరు, నందిగామ, గుడివాడ, మంగళగిరి, జగ్గయ్యపేటలోని పలు ప్రాంతాల్లో భూమి కంపించడంతో ప్రజలు భయంతో పరుగులు తీసినట్టు చెబుతున్నారు. బుధవారం ఉదయం కొన్ని సెకన్ల పాటు భూమి కంపించినట్టు స్థానికులు చెబుతున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement