తెల్ల రేషన్ కార్డు, ఎంప్లాయిమెంట్ హెల్త్ స్కీం (ఈహెచ్‌ఎస్), వర్కింగ్ జర్నలిస్ట్ హెల్త్ కార్డులు కలిగినవారు జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రధానమైన ప్రభుత్వ, ప్రముఖ కార్పొరేట్ హస్పిటల్స్‌లలో ఉచితంగావైద్య సేవలు పొందవచ్చు.అందుకు తగిన సమాచారం తెలియక చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. ఏ హాస్పిటల్‌లో ఏ వైద్యం లభిస్తుందో తెలియక అయోమయానికి గురి అవుతున్నారు. అనుకోకుండా సంభవించే ఆపదలు,అనారోగ్య సమయాల్లో ఈ ఉచిత వైద్య సేవలు ఎంతగానో ఉపయోగపడుతాయి. మనిషి ప్రాణాలను కాపాడుతాయి. అందుకు ‘సాక్షి’ అందిస్తున్న సమాచారు.
కడప రూరల్: మనిషి అనారోగ్యం పాలైతే వైద్య సేవలకు అధిక ఖర్చులు చేయాల్సి వస్తోంది.. ఇలాంటి తరుణంలో నిరుపేదలకు వర్తించే నాటి రాజీవ్ ఆరోగ్య శ్రీ. నేటి డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ, ప్రభుత్వ ఉద్యోగులకు ఈహెచ్‌ఎస్, వర్కింగ్ జర్నలిస్ట్‌లకు హెల్త్ కార్డులు ఎంతగానో ఉపయోగపడుతాయి. కాగా తెల్ల రేషన్ కార్డు కలిగిన వారికి వర్తించే ఎన్టీఆర్ వైద్య సేవలో 1044 వ్యాధులు, ఈహెచ్‌ఎస్, వర్కింగ్ జర్నలిస్ట్ హెల్త్ కార్డులు కలిగిన వారికి 1885 రకాల జబ్బులకు ఉచితంగా వైద్య సేవలను పొందవచ్చు.
ఏ కార్డు లేని వారికి ‘ఆరోగ్య రక్ష’ దిక్కు...
మొన్నటి వరకు తెల్లరేషన్ కార్డు ఉంటేనే ఎన్టీఆర్ వైద్య సేవలు వర్తించేవి.కార్డు లేకపోతే సీఎం పేషీకి వెళ్లి ప్రత్యేకంగా అనుమతి తీసుకొని రావాల్సిన పరిస్ధితి ఏర్పడేది. ఇదంతా వ్యయ ప్రయాసాలతో కూడింది.
తాజాగా ఆ విధానానికి ప్రభుత్వం స్వస్తి పలికింది. ఇప్పుడు ఏ వర్గమైనా సరే.. ఏ కార్డు లేనివారు ‘ఆరోగ్య రక్ష’ పథకంలో చేరాలి.ఇందులో చేరాలంటే ఒక వ్యక్తి ఏడాదికి రూ. 1244 లను మీ సేవా కేంద్రాలు లేదా కడప పాత కలెక్టరేట్‌లోని డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా జిల్లా కార్యాలయంలో చెల్లించాలి. ఇందులో చే రిన వారికి ఎన్టీఆర్ వైద్య సేవ తరహలోనే 1044 రకాల వ్యాధులకు సంబంధించి జిల్లా వ్యాప్తంగా ఉన్న 22 హాస్పిటల్స్‌లలో ఉచితంగా వైద్య సేవలను పొందవచ్చు.
ఆపరేషన్ లేని వ్యాధులకు కూడా వైద్యం...
పెరాల్సిస్ తదితర ఆపరేషన్‌తో సంబంధంలేని వ్యాధులకు కూడా ఉచితంగా వైద్య సేవలను పొందవచ్చు. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో కూడా వైద్య సేవలను పొందవచ్చు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ వెబ్‌సైట్, ఆయా హాస్పిటల్స్‌లోని ఆరోగ్య మిత్ర లేదా కడప పాత కలెక్టరేట్‌లో గల డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ జిల్లా కో ఆర్డినేటర్ కార్యాలయంలో తెలుసుకోవచ్చు.
వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలి...
ఉచిత వైద్య సేవలకు సంబంధించి ఆయా హాస్పిటల్స్‌లో ఉన్న ఆరోగ్య మిత్రలను లేదా కడప పాత కలెక్టరేట్‌లోని ఎన్టీఆర్ వైద్యసేవ జిల్లా కో ఆర్డినేటర్ కార్యాలయాన్ని సంప్రదింవచ్చు. అలాగే ఏ కార్డు లేనివారు ‘ఆరోగ్య రక్ష’ పథకంలో చేరి లబ్దిపొందాలి. ఉచిత వైద్య సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి– డాక్టర్ శివనారాయణ,జిల్లా కో ఆర్డినేటర్, ఎన్టీఆర్ వైద్య సేవ
Comments
Please login to add a commentAdd a comment