చంద్రబాబుతో పేదలకు వైద్యం దూరం
చిత్తూరు (అగ్రికల్చర్) : చంద్రబాబు కారణంగా నిరుపేదలు వైద్యసేవలకు దూరం అవుతున్నారని సీపీఐ జిల్లా కార్యదర్శి ఏ.రామానాయుడు మండిపడ్డారు. చిత్తూరు ప్రభుత్వాసుపత్రిని అపోలోకు 35 ఏళ్ల పాటు లీజుకివ్వడాన్ని నిరసిస్తూ స్థానిక కలెక్టరేట్ ఎదుట సీపీఐ నాయకులు ధర్నా నిర్వహించారు. జిల్లాకు తల మానికమైన చిత్తూరుప్రభుత్వాసుపత్రి కారణంగా చుట్టుపక్కల 15 మండలాల ప్రజలు వైద్య సేవలు పొందుతున్నాయని వారు తెలి పారు. అటువంటి ఆసుపత్రిని చంద్రబాబు అపోలోకు మొదటగా ఐదేళ్లకు లీజుకిస్తున్నట్లు ప్రకటించి, తర్వాత దానిని 35 ఏళ్లకు పెం చుతూ నిర్ణయం తీసుకోవడం దారుణమన్నారు. ఉచిత వైద్యసేవలు పేదలకు దక్కకుండా చేసి కార్పొరేట్ సంస్థలకు అప్పగిస్తున్నారని దుయ్యబట్టారు.
జిల్లావాసి అయిన చంద్రబాబు గతంలో చిత్తూరు విజయాపాల డెయిరీని మూయించి వేసి పాడిరైతులను ముంచారని గుర్తుచేశారు. మళ్లీ ఇప్పుడు సీఎం కాగానే జిల్లాలోని చిత్తూరు, గాజులమండ్యం చక్కెర ఫ్యాక్టరీలను మూయిం చి ఇటు చెరకు రైతులను, అటు కార్మికులను వీధులపాలు చేశారన్నారు. ప్రజలు చంద్రబాబు అవి నీతి పాలన తీరును గమనిస్తున్నారని త్వరలోనే గుణపాఠం చెప్పడం ఖాయమని ఆయన తెలిపారు. పేద ల, కార్మికుల కడుపుకొట్టిన చంద్రబాబు భవిష్యతులో మనుగడ కోల్పోవడం ఖాయమని జోస్యం చెప్పారు.
ఇకనైనా చిత్తూరు ప్రభుత్వాసుపత్రిని అపోలోకు అప్పగించ కుండా పేదలకు వైద్య సేవలను అందుబాటులోకి తేవాలని వారు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో సీపీ ఐ ఆధ్వర్యంలో ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. ఈ ధర్నాలో సీపీఐ చిత్తూరు నియోజకవర్గ కార్యదర్శి ఎస్.నాగరాజన్, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పి.వెంకటరత్నం, ఏఐటీయూసీ జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి పీఎల్.నరసింహులు, సీపీఐ నాయకులు పాల్గొన్నారు.