
హోర్డింగ్‌లతో ఆదాయం..
ఫిక్స్‌డ్ డిపాజిట్లు, స్టాక్ మార్కెట్లు లాంటివే కాకుండా చిన్న ఇన్వెస్టర్ల కోసం కొంగొత్త ఆదాయ మార్గాలు వస్తున్నాయి. ఇలాంటివే హోర్డింగ్‌లు, బిల్‌బోర్డులు వంటివి. కొన్ని చోట్ల హోర్డింగ్‌లను తొలగించాలంటూ వివాదాలు ఉన్నా నోయిడా, ముంబైలాంటి ప్రాంతాల్లో హోర్డింగ్‌లపై ఇన్వెస్ట్‌మెంటు ట్రెండు ఊపందుకుంటోంది.
ఏరియా, ప్రకటనలను బట్టి సుమారు పది లక్షల రూపాయలు పెట్టి తీసుకున్న బిల్‌బోర్డ్స్ నెలకు దాదాపు రెండు లక్షల దాకా ఆదాయాన్ని అందిస్తున్నాయి. దీంతో చిన్న ఇన్వెస్టర్లు వీటిపై కూడా ఆసక్తి చూపిస్తున్నారు. సాధారణంగా ప్రభుత్వ రంగ సంస్థలవయితే బిడ్డింగ్ ప్రక్రియలో పాల్గొనే తీసుకోవాల్సి ఉంటుంది.
అదే ప్రైవేట్ మాల్స్, బిల్డింగ్స్ వంటి వాటి లోనైతే ఆయా భవంతుల యజమానులతో ఇన్వెస్టర్లు ఒప్పందాలు కుదుర్చుకుని సదరు హోర్డింగ్‌లను అద్దెకు తీసుకోవచ్చు. ఆ తర్వాత అడ్వరై ్టజింగ్ ఏజె న్సీల సహాయంతో కస్టమర్లను సాధించుకోవచ్చు. ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయాన్ని అందుకునే ఇన్వెస్టర్లు హోర్డింగ్‌కి సంబంధించిన అద్దెలు, పన్నులు కట్టుకోవాల్సి ఉంటుంది.
ప్రైవేట్ వాటితో పోలిస్తే ప్రభుత్వ విభాగాల అసెట్స్‌పై మెరుగైన రాబడులు అందుకోవ చ్చు. చాలా మటుకు ఇవి తక్కువ రేటుకి లభిస్తాయి..వచ్చే ఆదాయాలు మాత్రం ప్రాంతాన్ని బట్టి భారీగా ఉంటాయి. సందర్భాన్ని బట్టి కొన్ని సార్లు నెలకు అద్దె రూ. 5,000 రేంజిలో ఉంటే.. ప్రకటనల ద్వారా రూ. 50,000 దాకా కూడా ఆర్జించవచ్చనేది అడ్వరై ్టజ్‌మెంట్ రంగ సంస్థల మాట.